‘మా నాన్న రైతు’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - -సాయి సోమయాజులు

maa nanna raitu short flim review

ఎల్.బీ.శ్రీ రాం గారు ఒక్క పక్క తన సొంత బ్యానర్ అయిన ఎల్.బీ. శ్రీ రాం హార్ట్ ద్వారా ఎన్నో అందమైన లఘు చిత్రాలు తీస్తున్నప్పటికీ, మరో వైపు మిగతా దర్శకులతో అంతే అందమైన చిత్రాలలో పాల్గొంటున్నారు. అలాంటి ఓ సినిమానే ‘మా నాన్న రైతు’. కవిరాత్ భరద్వాజ్ దర్శకత్వంలో, రన్‍వే రీల్ పతాకం పై విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఒక లక్షకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ చిత్ర సమీక్ష.. మీ కోసం!

కథ :
ఈ కథ ప్రాణానికన్నా వ్యవసాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ఓ రైతుది. వ్యవసాయమే తన జీవన ధోరణిగా నడిపించుకునే ఈ పెద్ద మనిషికి ఇద్దరు కొడుకులు. ఇద్దరూ సిటీలలో సెటిలైపోతారు. అయితే, ఆస్తి వాటాగా తన నాన్నగారిని పొలం అమ్మమని అడుగుతారు. అప్పుడు ఆ రైతు దానికి అంగీకరిస్తాడు, కాని, ఓ షరతుతో! ఏంటా షరతు? తెలుసుకోవాలంటే, మీరు ఈ చిత్రాన్ని చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :
ఎల్.బీ.శ్రీ రాం గారి నటన గురించి మనం కొత్తగా ఏం చెప్పుకోనక్కర్లేదు. వ్యవసాయాన్ని ప్రేమించే ఓ రైతుగా తన పాత్రని ఎంతో నిజాయితీగా వహించారు. ఆ పాత్రకి ఎల్.బీ. గారు తప్ప మనం వేరే ఎవరినీ ఓహించుకోలేము. విలేజ్ నేటివిటి, వ్యవసాయాన్ని కుటుంబ వారసత్వంగా, ఆవులని కుటుంబ సభ్యులుగా చూపించిన విధానం చాలా అందంగా అనిపిస్తుంది. కథ చాలా చక్కనైనది. సినీ నటుడు జీవా నటన మరో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ చాలా సందేశాత్మకంగా రాశారు.. ముఖ్యంగా ఓక సీన్ లో ఎల్.బీ. శ్రీ రాం గారు రైతు కష్టాల మీద చెప్పే ఓ మొనొలాగ్ హైలైట్.

మైనస్ పాయుంట్స్ :
కొన్ని మైనర్ డబ్బింగ్ సమస్యలు జర్క్ క్రియేట్ చెయ్యచ్చు. ఎండింగ్ ఇంకొంచెం బాగా తీసుంటే ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

సాంకేతికంగా :
కొన్ని ఓవర్ ఎక్స్పోస్డ్ షాట్స్ ను పరిగణనలోకి తీసుకోకపోతే మిగతా కెమెరా వర్క్ అంతా కూడా ఎక్స్టాడినరి! ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్‍గా ఉంది. డబ్బింగ్ చాలా ప్రొఫెషనల్ గా చేశారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.

మొత్తంగా :
రైతన్న కోసమైనా.. ఒకసారి చూడండి!

అంకెలలో:
3.5 / 5

LINK-
https://www.youtube.com/watch?v=nLP4q8mOqQo

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం