జిందగీ దొబారా నహీ మిలేగా - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapbhavalu

"డబ్బు సంపాదించుకోవచ్చు. కాలాన్ని మాత్రం కాదు"

మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం.

రఘు అని నా స్నేహితుడు ఒకతనుండేవాడు. ఒకసారి ఆఫీసుకు ఆఫ్టర్ నూన్ వచ్చాడు. పొద్దున్నే రానందుకు ఆఫీసరు చేత చీవాట్లూ తిన్నాడు.

నేను మధ్యాహ్నం టీ టైంలో "రఘూ, ఆఫీసులో ఇంపార్టెంట్ వర్క్ ఉందని తెలుసుగా, మార్నింగ్ రాలేదేమిటి? పర్సనల్గా ఏవన్నా ప్రాబ్లమా?" అడిగాను.

‘ఇవాళ పొద్దుటే లేచాను బాస్, కిటికీ తెరచి చూస్తే, ముసురుపట్టి ఉంది. చల్లని గాలి. వానకి తడిసిన మట్టి వాసన. ఇంటి ముందున్న గులాబీ చెట్లకి పూలు పూసి, వర్షానికి తడిసి ఎంత బావున్నాయో చూడ్డానికి. వెంటనే  పిక్ తీసి అందరికీ గుడ్ మార్నింగ్ మెస్సేజ్ తో షేర్ చేశా! తర్వాత వెళ్లి మంచం మీద దుప్పటీ కప్పుకుని వెచ్చగా పడుకున్నాను. గంట తర్వాత లేచి, కిటికీ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని, వేడి వేడి కాఫీ తాగుతూ బయటకి చూస్తుంటే ఎంత బావుందో చెప్పలేను. ఆఫీసు టైం, వర్క్, బాస్ తిట్లు ఇవన్నీ రొటీన్. జస్ట్ ఫర్ ఛేంజ్ వర్షాన్ని ఎంజాయ్ చేశాను. మన హాలిడే ఉందని ఆ రోజున వర్షం రాదుగా. ఇలాంటి వాతావరణం ఉండదుగా. అందుకే నేను నా ఆనందానికి ప్రాధన్యతను ఇస్తాను. జిందగీ దొబారా నహీ మిలేగా మేరా భాయ్’ అన్నాడు చిలిపిగా.

ఉదయం సన్నగా వర్షం వస్తుంటే నాకూ కాసేపు ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ వర్క్, ఆఫీసర్ గుర్తొచ్చి ఆదరబాదరగా బైకెక్కి హడావుడిగా ఆఫీసుకు వచ్చేశాను. ఇప్పుడు రఘు చెప్పేది వింటుంటే నేనేం కోల్పోయానో అనుభవం లోకి వస్తోంది. వర్క్ ఈజ్ వర్షిప్ నిజమే కాని డబ్బు వెనకాల పరిగెడుతూ, చిన్న చిన్న ఆనందాలని సైతం పొందలేక గానుగెద్దులా జీవించడం ఎంతవరకు సబబు? ప్రకృతి సీజనల్ గా మారుతూ కంటికి, ఒంటికీ ఎన్నో ఆనందాలనీ, అనుభూతుల్ని ప్రెజెంట్ చేస్తుంది. అవి పొందలేకపోతే జీవితానికి అర్థం ఏమిటి?
ఎప్పటి నుంచో భద్రాచలం వెళ్లి పాపికొండల యాత్ర చేసి కొండల్నీ, నది సోయగాలని, గిరిజనుల ఆవాసాలను, జీవన విధానాన్ని చూడాలని కోరిక. కాని బాస్ ను సెలవడగలేని భయంతో నిర్లిప్తంగా బతుకుతున్నాను. ‘ఇహ లాభం లేదు’ అనుకుని రఘుకి బై చెప్పి లీవ్ లెటర్ ఫిల్ చేసి బాస్ క్యాబిన్ లోకి ధైర్యంగా వెళ్లి, అర్జెంట్గా లీవ్ కావాలని, లీవ్ నుంచి రాగానే వర్క్ కంప్లీట్ చేసే బాధ్యత నాదని బాస్ ను ఒప్పించి దానిమీద సంతకం పెట్టించుకున్నాను.

ఆవిధంగా పాపికొండల యాత్ర చేసి మనసులో మధుర స్మృతులను నిక్షిప్తం చేసుకున్నాను. ఇప్పుడు ఓవర్టైం చేశయినా సరే, నా వర్క్ కంప్లీట్ చేయగలను.

గవర్న్ మెంట్ ఎంప్లాయిస్ కు ఎల్ టీ సీ ఎందుకిస్తారు? కొన్ని ఎమ్ ఎన్ సీ సంస్థల్లో ఎంప్లాయిస్ ను టూర్లకి ఎందుకు తీసుకెళ్తారు? హాప్పీగా, మెంటల్ గా రెజువెనేట్ అవడానికేగా! ఇలాంటి ఫెసిలిటీస్ లేని సంస్థల్లో మనమే చొరవ తీసుకుని హాయిగా వెళ్లి ఎంజాయ్ చేసి రావాలి. పని ముఖ్యమే! కాని జీవితంలోని అనుభూతుల్ని, ఆనందాలనీ కోల్పోయేంత కాదు.

మళ్లీ జన్మ ఉందో లేదో! ఈ జన్మని భయాలతో, మొహమాటాలతో గడిపితే ఓ చెట్టుకు, పుట్టకు, మనకు తేడా ఉండదు.

***

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు