24-8-2018 నుండి30-8-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో స్వల్పమార్పులకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబంలో గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు లేక మనస్పర్థలు సర్దుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల గురుంచి నూతన ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. చర్చల్లో మీ ఆలోచనలను అవతలి వారికి తెలియజేయడంలో సఫలీకృతులు అవుతారు. సంతానం కోసం చేసిన ఆలోచనలను కుటుంబపెద్దలకు తెలియజేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద పూజాది కార్యక్రమాలకు సమయం ఇవ్వడం మంచిది. పెద్దలతో మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారంలో అవతలి వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. చర్చాపరమైన విషయాలకు సమయం కేటయిస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం ఉంది. రుణపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంబంలో సర్దుబాటు విధానం మంచిది. సంతానపరమైన విషయాల్లో ఒకింత ఆందోళనకు లనవుతారు, నూతన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. మిత్రులతో ఆలోచనలు పంచుకుంటారు.


మిథున రాశి : ఈవారం మొత్తం మీద సంతానం గురుంచి అధికంగా ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. జీవితభాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన.

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఏమాత్రం స్పష్టమైన ప్రణాళిక లేకపోతే నూతన సమస్యలు ఏర్పడుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు , గతంలో మీకు రావాల్సిన ధనమ్ సమయానికి చేతికి అందుతుంది. విదేశీ ప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాలకు ధనం వెచ్చించే ఆస్కారం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద మీదైనా ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపాన్ని కలిగి ఉంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం మంచిది. సోదరులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం అలాగే కట్టుబడి ఉండుట మంచిది. రుణపరమైన విషయాల్లో మాటపడవల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు, తగిన జాగ్రత్తలు తీస్కోవడం వలన తప్పక మేలుజరుగుతుంది.

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, సమయాన్న్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ప్రయాణములు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన భగస్వామ్య ఒప్పందాలకు ఆస్కారం ఉంది. సంతానం విషయంలో ఒకింత సంతోషాన్ని పొందుతారు, వారై విషయంలో నూతన ఆలచనలకు శ్రీకారం చుడుతారు. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. సోదరులతో చర్చలకు అవకాశం ఉంది. వారి ఆలోచనలు స్వీకరించుట సూచన. 

 

 

 

 

తులా రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఉద్యోగంలో కొంతమేర పనిఒత్తిడి ఉంటుంది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది , కాస్త ఈ విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబపరమైన విషయాల్లో పెద్దగా ఆశించిన మేర మార్పు రాకపోవచ్చును. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికీ నూతన అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. సోదరులతో మాటపట్టింపులకు వెళ్ళకపోవడం సూచన.

 

 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబంలో ముఖ్యమైన పనులను మొదలు పెడతారు. ఆత్మీయులను కలుసుకుంటారు , వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయంలో మీకంటూ ఒక స్పష్టమైన విధానం ఉండటం వలన లబ్దిని పొందుతారు. పూజాదికార్యక్రమంలో పాల్గొంటారు. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది , తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం చెందుతారు. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. మిత్రులను కలుసుకుంటారు.

 

 

 

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. తలపెట్టిన పనుల విషయంలో శ్రద్ద అలిగి ఉండుట సూచన. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపుట సూచన. పెద్దలతో కలిసి పనిచేసే సమయంలో వారై సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువులను కలుస్తారు. కొంత కోపాన్ని తగ్గించుకోవడం వలన వివాదాలు తగ్గుముఖం పడుతాయి. విదేశీప్రయాణాలు చేయుయవారికి అనుకూలమైన సమయం.

 

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలు ఏర్పడుతాయి, మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారంలో బాగానే ఉంటుంది, భాగస్వామ్య ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. తండ్రి తరుపు బంధువుల నుండి వచ్చిన సూచనల విషయంలో ఆలోచనలు చేయుట మంచిది. ఉద్యోగంలో బాగాఉంటుంది, నూతన అవకాశాలు పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

కుంభ రాశి :  ఈ వారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన సర్దుకుంటాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఆర్థికంగా లబ్దిని పొందుతారు. చర్చాపరమైన విషయాల్లో మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సాధ్యమైనంత మేర వివాదాస్పద వ్యాఖ్యలు చేయక పోవడం మంచిది. చిన్ననాటి మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు.

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద బంధువుల నుండి సహకారం పొందుతారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. గతంలో మధ్యలో ఆగిన పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. సంతానపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. సంతానం వలన సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. అధికారులతో చిన్న చిన్న మనస్పర్థలు లేదా వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది , కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. చర్చలకు ఆస్కారం ఉంది , నిదానం అవసరం. 

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు