వైరల్‌ న్యూస్‌ ఇదే పెద్ద వైరస్‌.! - ..

Viral news is the same virus!

ప్రపంచంలో ఎక్కడ ఏ మూల చీమ చిటుక్కుమన్నా, క్షణాల్లో ఆ న్యూస్‌ ప్రపంచమంతా తెలిసిపోతోంది. సాంకేతిక విప్లవం సాధించిన ఘన విజయాల్లో ఇదొకటి. ఇంటర్నెట్‌ పుణ్యమా అని ఈ అద్భుతం సాధ్యమైంది. జస్ట్‌ ఓ స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు. ప్రపంచం మీతోనే. హెల్త్‌కి సంబంధించిన విషయాలు కావచ్చు. విద్యకు సంబంధించిన సమాచారమ్‌ కావచ్చు, రాజకీయాలు, సినిమాలు ఇలా ఒక్కటేంటి? ఇంటర్నెట్‌లో వెతికితే, దొరకని సమాచారమే లేదు. ఈ సాంకేతిక అద్భుతం కారణంగా పుట్టుకొచ్చిన పదం 'వైరల్‌'. జరిగిందో తెలీదు. జరగలేదో తెలీదు. ఎక్కడో ఓ గాలి వార్త పుడుతుంది. అది ప్రపంచమంతా తిరిగేస్తుంది. ఫార్వర్డ్‌ అనే ఆప్షన్‌ ఉంది కదా అని షేర్‌ చేసే అవకాశం ఉంది కదా అని వచ్చిన మెసేజ్‌ని చదవకుండా ఇంకొకరికి పంపేస్తున్నారు చాలా మంది. చిన్న చిన్న విషయాలకైతే, ఇది పెద్ద సమస్య కాదు. కానీ సున్నితమైన అంశాలకు ఈ నిర్లక్ష్యం పెను శాపమవుతోంది. ఓ మతం, ఓ కులం ఇలాంటి వైరల్‌ న్యూస్‌తో రచ్చకెక్కడం సర్వ సాధారణమై పోయింది.

గాలి వార్త మనుషుల ప్రాణాల్ని తీసేంత శక్తివంతమవుతోంది. అందుకే దానికి అడ్డుకట్ట వేసి తీరాల్సిన సమయం ఆసన్నమైంది. ఓ సర్వే ప్రకారం చదువుకున్న యువత ముందూ వెనకా ఆలోచించకుండా, ఫేక్‌ న్యూస్‌ని ఎక్కువగా ప్రచారంలో పెడుతున్నట్లు తేలింది. జస్ట్‌ ఫర్‌ ఫన్‌ యాంగిల్‌లో మాత్రమే యువత ఈ విషయాల్ని లైట్‌ తీసుకుంటోంది తప్ప అది సమాజంపై చూపే చెడు ప్రభావం గురించి కాస్తంత కూడా ఆలోచించడం లేదు. అయితే అందర్నీ ఒకే గాడిన కట్టేయలేం. కొంతమంది ఇది ఫేక్‌ న్యూస్‌ అని బాధ్యతాయుతంగా తమకొచ్చే మెసేజ్‌లను తిప్పి కొడుతున్నారు. కానీ ఎక్కువ భాగం మాత్రం వైరల్‌ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్‌ గ్రూపులు కావచ్చు, ట్విట్టర్‌ ఫేస్‌బుక్స్‌ కావచ్చు ఇంకేదైనా కావచ్చు. ఫేక్‌ న్యూస్‌కున్నంత క్రేజ్‌ రియల్‌ న్యూస్‌కి లేకపోవడం శోచనీయం.

శరీరంలో ఓ భాగానికి నయం చేయలేని రోగం సోకితే, అది శరీరాన్ని తినేస్తుందని తెలిసినప్పుడు నిర్ధాక్షణ్యంగా ఆ భాగాన్ని తొలగించాల్సిందే. ఫేక్‌ న్యూస్‌ విషయంలో కూడా అంత సీరియస్‌గా వ్యవహరించాలని మెజార్టీ అభిప్రాయపడుతోంది. అయితే చిన్న చిన్న సాంకేతిక జాగ్రత్తలతో ఈ ఫేక్‌ న్యూస్‌ని అరికట్టొచ్చు. అందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయాలి. అలా అని వ్యక్తులు కనీసపాటి సామాజిక బాథ్యతను గుర్తెరగాలి. న్యూస్‌నీ, ఫేక్‌ న్యూస్‌నీ వేరు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు, సమాజంలోకి విషం చిమ్ముతున్న వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటే అది కొంతవరకూ సత్ఫలితాన్నివ్వచ్చు. విజ్ఞత కోల్పోవడం నాగరికత అని భావిస్తే, అంత కన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. దురదృష్టవశాత్తూ ఫేక్‌ అండ్‌ వైరల్‌ అనే అనాగరిక వాతావరణంలోకి నేటి యువత వెళ్లిపోతోంది. పెరుగుట విరుగుట కొరకే అంటే ఇదేనా.!

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు