ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌: ట్రెండ్‌ మారింది గురూ.! - ..

old is gold

ట్రెండ్‌ మారింది. మోడ్రన్‌ ట్రెండ్‌ చాలా వరకూ బోర్‌ కొట్టేసింది. పాత తరం సాంప్రదాయాల్ని నేటి యువత ప్రోత్సహిస్తోంది. ఇది కేవలం వస్త్ర ధారణకే పరిమితం కాదు, ఇంట్లో ఫర్నిచర్‌ కావచ్చు, పెళ్లి సాంప్రదాయాలు, పుట్టినరోజు వేడుకలు, భోజన పద్థతులు ఇలా ఒక్కటేమిటీ అన్నింట్లోనూ కొత్తగా ట్రెడిషనల్‌ ట్రెండ్‌ ఫాలో చేస్తున్నారు. కొత్త ట్రెండ్‌ అంటే ఇదేమీ పాశ్చాత్య సాంప్రదాయమేమీ కాదు. మన తాత, ముత్తాతలు, ముత్తవ్వలు పాఠించిన పాత సాంప్రదాయాలన్న మాట. సింపుల్‌గా చెప్పాలంటే ఓన్లీ ట్రెడిషన్‌. నో మోడ్రన్‌. కొంత కాలంగా పాశ్చాత్య సాంప్రదాయాల్ని నేటి యువత విస్మరిస్తోంది. కొత్త ఒక వింత. పాత ఒక రోత అనే నానుడి రివర్స్‌ అయిపోయింది. పాతే ఒక వింత. కొత్త రోతలా మారిపోయింది.

అమ్మాయిల్నే తీసుకుంటే, కాస్ట్యూమ్స్‌ విషయంలో చుడీదార్స్‌, మిడీస్‌ స్థానంలో చక్కగా లంగావోణీలు, చీరకట్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎప్పుడూ ట్రెండీగా కనిపించే అమ్మాయిలు పండగలు, స్పెషల్‌ ఫెస్టివల్స్‌లో బాపు బొమ్మల్లా ఓల్డ్‌ ట్రెండ్‌ ఫ్యాషన్‌ని ఫాలో అయిపోతున్నారు. నిండైన వస్త్రాలు, నిండైన నగలను ధరించి చక్కని కుందనపు బొమ్మల్లా మెరిసిపోతున్నారు. అలాగే జ్యూయలరీ విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నారు. పాత తరం కాసుల పేర్లు, పెద్ద పెద్ద నెక్లస్‌లనే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు పెద్ద పెద్ద జ్యూయలరీని వాడేందుకు ఇష్టపడేవారు కాదు. మేమేమైనా పల్లెటూరి పిల్లలమా అనేవారు కానీ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా, పాత సంస్కృతిని చక్కగా పాఠిస్తున్నారు. 'జడలేసుకోవడమే మానేశారు. ఓ పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారే..' అని ఓ సినిమాలో మహేష్‌బాబు చెప్పినట్లుగా ఇప్పుడు అమ్మాయిలు మేకప్‌ లేదండోయ్‌. లూజ్‌ హెయిర్‌ వదిలేశారు. చక్కగా జడలు, జడల నిండా ఒత్తుగా పూలు పెట్టుకుంటున్నారు.

అబ్బాయిలు కూడా ఎప్పుడూ ప్యాంటు, షర్టులే కాదు, అమ్మాయిలకేనా ఫ్యాషన్‌. మేము కూడా ఫ్యాషన్‌ ఫాలో అవుతాం. అది కూడా ఓల్డ్‌ ఫ్యాషన్‌ అంటూ, పంచెకట్ల బాట పట్టారు. ఇప్పుడు ఫెస్టివల్స్‌లో అబ్బాయిలు సాంప్రదాయ పంచెకట్టుతో ఎట్రాక్ట్‌ చేస్తున్నారు. బఫే సిస్టమ్‌ అంటూ చక్కగా పీట వేసి, విస్తరాకు వేసి, ఆవకాయ, అరటి పండుతో సహా భోజనం వడ్డించే రోజుల్ని ఎప్పుడో మర్చిపోయాం. కానీ నేటి యువత నాటి రోజుల్ని మళ్లీ గుర్తు చేస్తోంది. అమ్మమ్మలు, తాతయ్యల కాలం నాటి పరిస్థితుల్ని అడిగి మరీ తెలుసుకుని పెళ్లి విందులో విస్తరాకు భోజనం నుండి తమలపాకు తాంబూలం వరకూ పాత తరాన్ని, కొత్తగా పరిచయం చేస్తోంది. దీంతో ఈవెంట్‌ మేనేజింగ్‌ సంస్థలు కూడా ఆ ట్రెండ్‌ వైపే తమ తమ సంస్థలకు ట్రైనింగ్స్‌ ఇస్తోంది. ఇప్పటికే చాలా వరకూ పెళ్లిళ్లలో మోడ్రన్‌ ట్రెండ్‌ ఫ్లేవర్‌ని పక్కన పెట్టేసి, పూర్తిగా ఓల్డ్‌ ట్రెండ్‌ ఫ్లేవర్‌ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలా 'ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌' అంటూ పాత తరానికి కొత్త సొబగులద్దేస్తోంది నేటి తరం.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు