ప్రతాప భావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapa bhavalu

నేనూ నా బాస్ లు!

నేను రైల్వే ఎలక్ట్రానిక్స్ లో టీం లీడర్ గా చేస్తున్నప్పుడు సురేన్ అని ఓ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఉండేవాడు. అన్నిరంగాల్లో ఆయనకున్న అపార పరిజ్ఞానానికి, చలాకీతనానికి ఆశ్చర్యపోయేవాళ్లం. మా డిపార్ట్ మెంట్ లో దాదాపు అరవై మంది పనిచేసేవాళ్లం. వర్క్ పరంగా అందరినీ కనిపెట్టుకుని ఉండేవాడు. ఎవరికి ఏ వర్క్ ఇచ్చారో అన్న షెడ్యూల్ ఆయన మైండ్ లో నిక్షిప్తమై పోయుండేది. పొరబాటున కూడా కంప్లీషన్ డేట్ ను దాటే వాళ్లం కాదు. కాదు కాదు దాటనిచ్చేవారు కాదు.

టెక్నాలజీని ఎంతబాగా ఉపయొగించవచ్చో ఆయన దగ్గరే నేర్చుకున్నాం. మా అందర్నీ సెల్ ఫోన్ లోని మెస్సేజెస్ తో ఛేజ్ చేసేవారు. పొరబాట్న మెస్సేజ్ చూడ్డం మిస్సయ్యామా? ఇక అంతే సంగతులు. సున్నితంగా అయినా మనసులో నాటుకుపోయేలా తిడతారు. దాంతో మనలో మార్పు ఖాయం.

ఎవరైనా ఆయన ఎడుటికొచ్చి నేను ఫలానా దాంట్లో తోపుని, తురుముని అని చెప్పుకున్నాడంటే అయిదే అయిదు నిముషాల్లో ’తనకు తెలిసింది కొంతేనని, తెలుసుకోవాలని కొండంత ఉందన్న’విషయం వాళ్లకి తెలిసొచ్చేలా చేస్తారు.

ఇంక్రిమెంట్స్ కోసం మా అప్రైజల్స్ జరుగుతున్నప్పుడు, రౌండ్ టేబుల్ లో నన్నో వైపు, మా జీ ఎం నోవైపు, తనో వైపు కూర్చుని నాలో మా జీఎం ఏం కోరుకుంటున్నాడో అడిగేవారు. ఆయన చెప్పినవన్నీ నోట్ చేసుకుని ఆ సమ్మరీ నాకు వినిపించేవాడు. అలాగే మా జీ ఎం నుంచి నేనెలాంటి సపోర్ట్ ఆశిస్తున్నానో కూడా అడిగేవారు. నేను చెప్పినవీ నోట్ చేసుకుని ఆయనకు చెప్పేవాడు. చివరగా నన్ను ఎంత ఇంక్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావని అడిగేవారు. అప్పటికే జీ ఎం మన లోటు పాట్లన్నీ కాగితం మీద పెట్టాడు కనక చిన్నగా ‘ఓ టెన్ పర్సెంట్ సార్’ అనేవాణ్ని. దానికాయన పెద్దగా నవ్వుతూ ’ టెన్ ఏం సరిపోతుంది? ట్వెన్టీ ఫై పర్సెంట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ పనిచేసి చూపించు’ అనేవారు.

ఎప్పుడన్నా క్యాష్ అవార్డ్స్ వస్తే, సంబంధిత లెటర్ ను, చెక్ ను కవర్లో పెట్టి ఇంటికి కొరియర్ చేసేవారు. కారణం మా విజయం వెనక మా భార్యలున్నారట, దాన్లో వాళ్లకీ భాగం ఉంది కాబట్టి వాళ్ల ద్వారా ఆ తీపి కబురు మేము అందుకోవాలట. ఆనందాన్ని పంచుకోవాలట.
మేమేమన్నా టెక్నికల్ గా అచీవ్ చేస్తే టెక్నికల్ బుక్స్ ఎంత ఖరీదైనవైనా సరే కొని వాటి మీద మా డైరెక్టర్లు, ఎమ్ డీ ల చేత సైన్ చేయించి ఇచ్చేవాడు.

పని చేయించడం గొప్పకాదు. పని విలువ తెలుసుకుని అనుకున్న సమయానికి పూర్తిచేయించడం. టీం మొత్తాన్ని కోడి తన పిల్లల్ను కాపాడుకున్నట్టు కాపాడుకోవడం. ఎప్పుడూ చేసే పనిలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేయడం. సబ్జెక్ట్ లో అప్ టు డేట్ గా ఉండడం. చేసిన పనిని ప్రశంసించి ప్రోత్సహించడం. ఎంప్లాయీస్ కు అనుకున్నదానికన్నా ఎక్కువిచ్చి, దానికి తగ్గట్టుగా పనిచేసి తమని తాము నిరూపించుకోమని ఛాలెంజ్ చేయడం. చొచ్చుకుపోవడం. అన్నిసెక్షన్లతో కలసిమెలసి ఉండడం. అన్ని విషయాల్లో నాలెడ్జ్ సంపాదించుకోడం. డెలిగేషన్స్. డాక్యుమెంటేషన్. నిరాశానిస్పృహల్ని దగ్గరకి రాకుండా చూసుకోడం..ఇలా ఆరేళ్లలో ఆయన్నుంచి ఎన్నో నేర్చుకుని స్ఫూర్తిపొందాను.

ఇంతకీ ఆయన చదివింది కంప్యూటర్స్ డిగ్రీ కానీ ఎలక్ట్రానిక్స్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను తనంతట తాను నేర్చుకుని సాధించిన పట్టుని చూసి మాకు ఆశ్చర్యం కలిగేది. అలాగే కదా డిపార్ట్ మెంట్ హెడ్ అయింది. మొత్తానికి ఇలాంటి బాస్ లతో పనిచేయడం గొప్ప అపర్చ్యూనిటీ. అంతే.

*****

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు