31-8-2018 నుండి6-9-2018 వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : 

ఈవారం మొత్తం మీద సాధారణఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది చేపట్టు పనుల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. ప్రయాణాలు వాయిదావేయుట ఉత్తమం. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో కలిసి విందుల్లో పాల్గొనే ఆస్కారం కలదు. వ్యాపరంలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది,అనుకోని ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. అధికారుల నుండి నూతన సమస్యలు వచ్చుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. కుటుంభసభ్యులతో కలిసి నూతన ఆలోచనలు చేపట్టుటకు అవకాశం ఉంది. అనారోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన,సమయానికి భోజనం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి.      

 

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద మాములుగా ఉంటుంది కొంత ఆశించిన ఫలితాలు వచ్చినను కొన్ని కొన్ని విషయాల్లో వ్యతిరేకఫలితాలు పొందు అవకాశం ఉంది అసంతృప్తి తప్పకపోవచ్చును. మాటను నిదానంగా వాడుట నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మరింత మేలుజరుగుతుంది,వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేయునపుడు అనుకోని ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు వీలయితే వాయిదా వేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దల నుండి ఆశించిన విధంగా సహాకారం లభిస్తుంది. ప్రమాదకరమైన వస్తువులతో పనిచేయునపుడు నిదానంగా వ్యవహరించుట సూచన. తలపెట్టిన పనులలో ఉత్సాహంను చూపించే అవకాశం ఉంది నలుగురితో కలిసి పనిచేయునపుడు అవతలివారి సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. సోదరవర్గం నుండి నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం కలదు. కుటుంభంలో మార్పులు ఆశిస్తారు.

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద   బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు వారి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం చేత ఊహించని విధంగా ధనమును నష్టపోతారు జాగ్రత్త. కుటుంభంలో వచ్చిన మార్పుల విషయంలో సర్దుబాటు అవసరం మార్పును  స్వాగతించే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన  పనులను పొందుతారు వాటికి సమయం ఇవ్వడం నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. దూరప్రదేశం నుండి వచ్చిన వార్తల మూలాన ఆందోళనకు గురయ్యే అవకాశం కలదు జాగ్రత్త. ప్రయాణాలు చేయునపుడు  విలువైన సూచనలు పాటించుట మంచి చేస్తుంది. మీ అనుకున్న వారితో విభేదాలు కలుగుటకు ఆస్కారం ఉంది కావున నిర్ణయాలు చేయకండి. దైవసమ్భదమైన విషయాలకు సమయం తప్పక ఇవ్వాలి మంచిది.   

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద  మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఏదైనా పనులను చేపట్టుటకు ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట వలన మేలుజరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుట వలన చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టాలనే తలంపును కలిగి ఉంటారు పెద్దల సూచనలు పాటించుట ఉత్తమం. ఒకవార్త మాత్రం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే ఆస్కారం కలదు కావున మానసికంగా దృడంగా ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే అనవసరమైన ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయానికి ప్రయత్నం చేస్తారు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును. ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళండి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. 

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద  మొదట్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. బందుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది అలాగే వారితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సూచనలతో ముందుకు వెళితే లబ్దిని పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో స్థిరమైన ఆలోచనలు చేయుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో అందరిని కలుపుకొని వెళ్ళండి మాటపట్టింపులకు వెళ్లకపోవడం మంచిది. వ్యతిరేకవర్గం ద్వార వారం చివరలో చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచ్చును తెలివిగా వ్యవహరించుట వలన ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాల వలన కొంత ఒత్తిడిని శ్రమను పొందుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో బాగుంటుంది మీ ఆలోచనలు అధికారులకు తెలియజేయుట వలన ఆశించిన విధంగా గుర్తింపును పొందుటకు అవకాశం కలదు.  

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద  బంధుమిత్రులతో కలిసి విందులు,వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు సమయాన్ని వారితో గడిపేందుకు ఇష్టపడుతారు. ఇష్టమైన వ్యక్తుల నుండి సమాచరం సేకరించే అవకాశం కలదు నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. అనారోగ్యం వలన సమస్యలు తప్పవు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పనులకు అధికమైన సమయం కేటాయిస్తారు అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఉత్సాహంను చూపించి కొన్ని పనులను ఆరంభిస్తారు వాటి మూలాన నలుగురిలో ఆశించిన విధంగా గుర్తింపు లభిస్తుంది. స్త్రీ సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సూచన. ఆరంభంలో తడబడినా వెంటనే కోలుకొని పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులు పెరిగినను ధనము సమాయనికి సర్దుబాటు అవుతుంది. అధికారుల నుండి ఒత్తిడి తప్పకపోవచ్చును ప్రణాలికా బద్దంగా నడుచుకొనుట మంచిది.   

 

 

తులా రాశి : ఈవారం మొత్తం మీద  ఆరంభంలో బాగుంటుంది కాకపోతే మానసికంగా దృడంగా ఉండి  వెళ్ళడం చేత మంచి  ఫలితాలు పొందు అవకాశం కలదు. మృష్టాన్నభోజనప్రాప్తిని కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి సరదాగా విహరయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో  పెద్దలనుండి సహాయ సహకారాలు లభ్సితాయి సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం కొన్ని కొన్ని విషయాల్లో కోపం వ్యక్తపరచకండి. ఉద్యోగంలో అధికారులతో చేసిన  ఆలోచనలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. స్త్రీ సంభందమైన విషయాల వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయాలు చేయకండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు అలాగే  పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావోచ్చును  ప్రయాణాల్లో కొంత ఖర్చులు కలుగుతాయి.  

 

 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద  అధికమైన ఆలోచనలకు అనవసరమైన నిర్ణయాలకు దూరంగా  ఉండుట సూచన.  పనులలో పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచును కావున బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడం సూచన. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు చేయడం మంచిది. నలుగురిలో ఉన్నప్పుడు వారి ఆలోచనల ప్రకారం నడుచుకొనే  ప్రయత్నం వలన విభేదాలు తగ్గుతాయి. వ్యాపారంలో సర్దుబాటు తప్పకపోవచును గుర్తింపు వచ్చిన ధనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో అధికారుల నుండి పని ఒత్తిడి తప్పదు నిదానంగా వాటిని పూర్తిచేయుట ఉత్తమం. తోటివారినుండి వచ్చు మాటలకు సమాధానం చెప్పవలసి రావోచ్చును జాగ్రత్త. దైవసంభందమైన విషయాలకు  సమయాన్ని ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. పెద్దలతో పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు వారితో కలిసి నూతన పనులలో పాలుపంచుకుంటారు.

 

 

 

 

 

ధనస్సు రాశి :ఈవారం మొత్తం మీద  ఉద్యోగంలో అధికారులతో మంచిసంభందాలు ఏర్పడుటకు ఆస్కారం కలదు వారి సూచనలు పాటించుట ఉత్తమం. ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని కేటాయిస్తారు. నూతన ప్రయత్నాలు చేయునపుడు తొందరపాటు నిర్ణయాలు వద్దు. పనులలో శ్రమతప్పక పోవచ్చును ప్రనలిక్ అవసరం అలాగే పెద్దాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి మంచిది. వారం చివరలో నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు వారితో సమయాన్ని గడుపుతారు. వాహనముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. దూరప్రదేశం నుండి ఒక వార్త కొన్ని మార్పులను కలిగించేవిగా ఉండే అవకాశం కలదు.  ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపాటు వద్దు. వ్యాపరపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టకండి అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. 

 

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలు ఏర్పడుతాయి, మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారంలో బాగానే ఉంటుంది, భాగస్వామ్య ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. తండ్రి తరుపు బంధువుల నుండి వచ్చిన సూచనల విషయంలో ఆలోచనలు చేయుట మంచిది. ఉద్యోగంలో బాగాఉంటుంది, నూతన అవకాశాలు పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

కుంభ రాశి :  ఈవారం మొత్తం మీద  ఆర్థికపరమైన విషయాల్లో పెద్దల నుండి తోడ్పాటు అందుటకు అవకాశం కలదు వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. తలపెట్టిన పనులలో శ్రమతప్పక పోవచ్చును వారం ఆరంభం కొంత ఇబ్బందిగా ఉంటుంది. వారం చివరలో కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు కాకపోతే ఒకవార్త ఆందోళన కలిగించేదిగా ఉండే అవకాశం ఉంది. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆస్కారం కలదు. మీయొక్క ఆలోచనలు ఎదుటివారిని ఇబ్బందిపెట్టేవిగా ఉండే అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు మీరు ఆశించిన విధంగా లబ్దిని కలిగిన్చకపోవచ్చును సర్దుకుపోవాలి. దూరప్రదేశప్రయాణాల వలన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మంచిది. మిత్రులనుండి ఒక సమాచరం అందుతుంది.    

 

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద  తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. సోదరవర్గం నుండి మాటపడవలసి రావోచ్చును సర్దుబాటువిధానం మంచిది. ప్రయాణాలు చేయుటకు ప్రయత్నం చేయకపోవడం మంచిది బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనుల్లో శ్రమను పొందినను చివరలో ఆశించిన విధంగా ఫలితాలు రావడానికి ఆస్కారం కలదు. నూతన నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు, కుటుంభ సభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి,తగిన జాగ్రత్తలు పాటించుట వలన ఇబ్బందులు తగ్గుతాయి.   

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్