అవకాశాలు 'తారుమారు'! - కె. సతీష్ బాబు

avakashalu taru maru

చిత్రసీమలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకరికి వచ్చిన అవకాశం, పాత్ర, వేషమో ఇంకొకరిని వరించడం జరుగుతుంటుంది. ఇలాంటి మార్పులూ, చేర్పులూ చిత్రసీమలో సర్వసాధారణం. ఇలా అవకాశాలు తారుమారైన నటుల గురించి కొన్ని సంగతులు...

'పోకిరి' మహేష్ బాబుకే కాదు, పూరి జగన్నాథ్ కి కూడా ఓ పెద్ద విజయం. 'పోకిరి' సినిమాను మొదట రవితేజతో 'సన్నాఫ్ సూర్యనారాయణ' పేరుతో తీయాలనుకున్నాడు దర్శకుడు పూరి. కానీ చివరికి ఆ అవకాశం మహేష్ కు దక్కింది. ఇదే 'పోకిరి' లో హీరోయిన్ ఇలియానా. కానీ మొదట 'వెన్నెల' పార్వతీమెల్టన్ ను అనుకున్నారు. చివరికి అవకాశం ఇలియానాకు దక్కింది.

నాగార్జున 'హలో బ్రదర్' లో రమ్యకృష్ణ ఒక హీరోయిన్ కానీ ఆ పాత్ర నిజానికి రోజా చేయాల్సింది. ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో రమ్యకృష్ణ కు అవకాశం దక్కింది. రాజశేఖర్, మీరాజాస్మిన్ లతో వచ్చిన 'గోరింటాకు' సినిమా మహిళలను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాకి హీరోగా మొదట్లో జగపతిబాబుని అనుకొని చివరకు రాజశేఖర్ తో చేసారు.

హీరోగా రవితేజను, దర్శకునిగా పూరి జగన్నాథ్ కెరీర్లను మలుపుతిప్పిన సినిమా 'ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం'. ఇందులో హీరోయిన్ తనూరాయ్. కానీ మొదట్లో ప్రత్యూషను అనుకున్నారు. ప్రత్యూషకు వేరే షూటింగ్ ఉండడంతో ఆ అవకాశం తనూరాయ్ కి వచ్చింది. 'వర్షం' లో హీరోయిన్ గా అదితీ అగర్వాల్ చేయాలి. 'గంగోత్రి' సినిమా పూర్తికాకపోవడంతో త్రిషను తీసుకున్నారు. అలాగే 'శ్రీ ఆంజనేయం' లో నితిన్ సరసన అదితీ అగర్వాల్ ను అనుకుంటే ఆ అవకాశం ఛార్మీకి వచ్చింది. గుణశేఖర్ 'మనోహరం' లో జగపతిబాబు హీరో. కానీ మొదటగా అనుకొన్నది వెంకటేష్ ను.

'చంద్రముఖి' లో మొదట హీరోయిన్ గా సిమ్రాన్ ను తీసుకున్నారు. రెండు రోజులు షూటింగ్ కూడా చేసారు. కానీ సిమ్రాన్ ప్రెగ్నెంట్ కావడంతో జ్యోతికను తీసుకున్నారు. కె. విశ్వనాథ్ 'సాగర సంగమం' లో హీరోయిన్ జయప్రద. మొదట అనుకున్నది జయసుధను. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ అవకాశం జయప్రదకు దక్కింది. '7/జి బృందావన కాలనీ' లో మొదట కథానాయికగా అనుకున్నది 'కలర్స్' స్వాతిని. ఎందుకనో సోనీ అగర్వాల్ కు అవకాశం దక్కింది. తేజ 'చిత్రం' లో మొదట హీరోగా తరుణ్ ని అనుకుని చివరకు ఉదయ్ కిరణ్ ను తీసుకున్నారు. రజనీకాంత్ 'నరసింహ' లో అబ్బాస్ పాత్రకు మొదట విక్రమ్ ను అనుకుని కొన్ని కారణాల వల్ల అబ్బాస్ నే తీసుకున్నారు.

- కె. సతీష్ బాబు

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం