ఆత్మలూ, దయ్యాలూ మిమ్మల్ని భయపెడుతున్నాయా? - ..

Do spirits and demons scare you?

మన మనస్సుకు ఉన్న రెండూ అంశాలైన 1) స్పష్టమైన జ్ఞాపకశక్తి ఇంకా 2) అద్భుతమైన ఊహాశక్తి మనకు ఓ వానపామో ఓ మిడతో లేదా మరే ఇతర జీవరాశులకన్నా ఓ ప్రత్యేకతను కల్పిస్తుంది. కానీ, ఈ రెండు అంశాల వల్లే ఎంతోమంది మానవులు బాధలని అనుభవిస్తున్నారు.

ప్రజలు  పదేళ్ల కింద జరిగిన వాటి గురించీ బాధ పడతారు, రేపో-ఎల్లుండో జరగబోయే వాటిని గురించి కూడా దిగులు పడుతూనే ఉంటారు. లేదా, అసలు "ఉనికే" లేని వాటి గురించి కూడా బాధ చెందుతూనే ఉంటారు. వారికి ఉన్న జ్ఞాపకశక్తి ఇంకా ఊహాశక్తులను వారు ఓ బాధగా మలచుకుంటున్నారు. ఈ రెండు శక్తులే మనల్ని మనవులుగా తీర్చిదిద్దుతున్నది. అంటే పరిణామక్రమంలో ఎదగడం కూడా మనకో బాధగా మారింది.

అసలు ఏం జరుగుతోందంటే, మీ ఊహాశక్తిని మీరు బాధగా అనుభూతి చెందుతున్నారు. అదొక  భయానక చిత్రంలా చేసుకుని చూస్తున్నారు. కానీ దానిని ఎందుకు ఆస్వాదించడం లేదు? సమస్య ఏమిటంటే, దాని దర్శకత్వం అస్సలు బాలేదు. మీ స్మృతులు, కల్పనలు మీ అదుపులో లేవు. ఆ నాటకం అంతా దానంతట అదే సాగిపోతోంది.

 

ప్రజలు దీనిని "మానవ స్వభావం" అంటారు. కానీ, ఇది మానవ స్వభావం కాదు. మానవ స్వభావాన్ని గురించిన బాధ్యతని తీసుకోని వ్యక్తుల స్వభావం. మీ మనో నాటకాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో మీకు తెలిసి ఉంటే, మీరు పారవశ్యంలో మునిగిపోయేవారు, భయపడే వారు కాదు. ఈ నాటకాని పట్ల మీకు కొంత అవగాహన కలిగించి, మీ మనో నాటకానికి మీరే దర్శకులై తీర్చిదిద్దుకోనేలా చేయడమే, నేను చేస్తున్న పనిలో సారం అంతా..!

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం