‘బ్యాక్‍ స్పేస్’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - -సాయి సోమయాజులు

‘మధురం’ తో తనని తాను ప్రూవ్ చేసుకున్న ఫణీంద్ర నారిసెట్టి ఈ వారం ‘మను’ తో మన ముందుకు రాబోతున్నారు. రోటీన్ సినిమాలకి భిన్నంగా ఉంటుందన్న భారీ అంచానాలతో విడులవుతున్న ఈ చిత్రానికి ‘గోతెలుగు’ బెస్ట్ విషెస్ చెబుతోంది. లఘు చిత్రాలతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు మొట్టముదటి సారిగా ఫీచర్ ఫిల్మ్ తో డెబ్యూ చెయ్యబోతున్నారు. అయితే, ఫ్లాష్‍బ్యాక్‍లోకి వెళ్తే, ‘మధురం’ మాత్రమే కాదు... ఫణీంద్ర తీసిన మరో లఘు చిత్రం సంచలనమైన క్రిటికల్ అక్లైమ్ ని పొందింది. ఆ చిత్రమే ‘బ్యాక్‍స్పేస్’. ఈ చిత్రం రెండు కారణాల వల్ల చాలా స్పెషల్. ఒకటి- ఇది మొత్తంగా ఐఫోన్ 4ఎస్ ద్వారా తీయబడిన చిత్రం.. రెండు- ఇది ఐ.ఎమ్.డీ.బీ. లో 8.6/10 రేటింగ్‍ను సొంతం చేసుకుంది. ఈ యొక్క చిత్ర సమీక్ష మీకోసం-

కథ-

ఓ రోజు పొద్దున్న.. ఓ బ్యాచిలర్‍కి రోజూ వచ్చే పాలతో పాటు ఓ పార్సెల్ వస్తుంది. అందులో ఒక ఖాలీ కాగితం, ఇంకా ఒక నోట్ రాసి ఉంటుంది. ‘ఈ ఖాలీ కాగితం మీద పెన్ తో బ్యాక్‍స్పేస్ అని బ్రేక్ చెయ్యకుండా రాసినట్టైతే, మీరు అప్పటివరకూ చేసిన చివరి యాక్షన్ రెవర్స్ అయిపోతుంది’ అని ఆ నోట్ స్పష్టం చేస్తుంది. ఇది నిజమో కాదో అని టెస్ట్ చేసిన అతను రిజల్ట్ చూసి షాక్ అవుతాడు. అతను ఆ మాయగల కాగితంతో ఏం చేశాడు? అసలు ఆ పార్సెల్ ఎక్కడనుంచి వచ్చింది?

ప్లస్ పాయింట్స్-

వండర్స్ సృష్టించడానికి జస్ట్ మీ ఫోన్ చాలు అనడానికి ఈ సినిమాయే నిదర్శనం. కథ-కథనం పెద్ద ప్లస్ పాయింట్. చాలా కొత్తగా, అన్‍కన్వెన్షనల్ గా, ఫణీంద్ర మార్క్ తో ఈ మొత్తం సినిమా ఉంటుంది. చాలా షాట్స్ క్రియేటివ్‍గా తీశారు. ముఖ్యంగా, పీ.ఓ.వీ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్ మూడ్‍ని క్రియేట్ చేస్తుంది. ఆర్ట్ డైరెక్షన్ కథ ఇంటెన్సిటీ మొత్తాన్నీ పెంచడమే కాకుండా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ డీటైల్స్ ని చాలా బాగా స్పష్టం చేస్తుంది. ఫణీంద్ర నటన కూడా పెద్ద ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్-

ఈ సినిమాలోని కొన్ని పాయింట్స్ మరింత క్లారిటీతో చెప్పనందువల్ల ప్రేక్షకులు చిన్నపాటి కన్ఫ్యూజన్స్ కి గురయ్యే అవకాశం ఉంది. అలానే అన్‍కన్వెన్షనల్ ఎడిటింగ్ కొంతమందికి నచ్చకపోవచ్చు.

సాంకేతికంగా-

కెమెరా వర్క్ డీ.ఎస్.ఎల్.ఆర్ తో తీసినంత బాగా అవుట్‍పుట్ వచ్చింది. మ్యూజిక్ కథతో పాటు సరి సమానంగా ప్రయాణిస్తుంది. వార్మ్ టోన్ చాలా యాప్ట్. ఇరవై నిమిషాలున్నా కూడా ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ న్ని బోర్ కొట్టకుండా తీసినందుకు మొత్తం టీం ని అభినందించాల్సిందే!

మొత్తంగా-

బ్యాక్‍స్పేస్ మళ్ళీ మళ్ళీ చూడదగిన ఓ ఫ్యాంటసీ!

రేటింగ్-

4/5

LINK :

https://www.youtube.com/watch?v=fpLcxtihnp0

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్