సోషల్‌ మీడియా - హేటర్స్‌ డెన్‌.! - ..

social media - hetars den

పలానా హీరోకి బోలెడంత మంది ఫాలోవర్స్‌ ఉన్నారట సోషల్‌ మీడియాలో.! అయితే ఈ ఫాలోవర్స్‌లో హేటర్స్‌ ఎంతమంది ఉన్నారట.? ఫాలోవర్స్‌లో హేటర్స్‌ ఉండడమేంటి.? కుక్కని చంపాలంటే అది పిచ్చిదని ముద్ర వేయాలి. అలాగే ఓ ప్రముఖున్ని డీ గ్రేడ్‌ చేయాలంటే హేటర్‌ అనేవాడు ఆ ప్రముఖుడి అభిమానిగా అవతారమెత్తాలి. చాలా మంది సినీ ప్రముఖుల విషయంలో ఇదే జరుగుతోంది. ఈ అభిమానం ముసుగు వేసుకున్న హేటర్స్‌ కాకుండా సోషల్‌ మీడియా ఛండాలంగా తయారవుతోంది. ఆ ప్రముఖులకు వీరి కారణంగా తలనొప్పి ఎక్కువైపోతోంది. సినిమా సెలబ్రిటీలు, పొలిటికల్‌ సెలబ్రిటీలే కాదు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ హేటర్స్‌ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

సినీ సెలబ్రిటీలనే తీసుకుంటే, అభిమానుల ముసుగులో లక్షలాది మంది ఫాలోవర్స్‌ సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నారు. ఈ ఫాలోవర్స్‌ మార్ఫింగ్‌ ఫోటోలతో తాము సెలబ్రిటీస్‌ని కలిసినట్లు, వారి మీద అభిమానం ఉందంటూ ప్రచారం చేసుకుని ఆ తర్వాత సందర్భం చూసుకుని విషం చిమ్ముతున్నారు. ఇతర హీరోలపై బురద చల్లడం, ఇతర రాజకీయ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలతో అలజడి సృష్టిస్తున్నారు. వీరి వికృత ప్రవర్తన సెలబ్రిటీలకు ఆందోళన కలిగిస్తోంది. అభిమాన సంఘాల పేరిట వసూళ్లకు పాల్పడడం, సేవా కార్యక్రమాల పేరుతో డబ్బు గుంజడం, అమాయక మహిళల్ని లోబర్చుకోవడం వంటివన్నీ సోషల్‌ మీడియా వేదికగా జరిగిపోతున్నాయ్‌. 
హేటర్స్‌ని గుర్తించడం ఎలా.?

ఇలాంటి వాళ్ల విషయంలో సెలబ్రిటీలు లైట్‌ తీస్కోలేరు. అందుకే అప్పుడప్పుడూ స్పందిస్తున్నారు. కానీ ఇదొక వైరస్‌లా తయారైంది. కొన్నిసార్లు కేసులు నమోదవడం, పోలీసులు రంగంలోకి దిగి అరెస్టులు చేయడం జరుగుతున్నా, కథ మళ్లీ మొదటికే వస్తోంది. సోషల్‌ మీడియా నుండి ఇలాంటి వాళ్లపై ఇప్పుడిప్పుడై నిఘా పెరుగుతోంది. ఆ నిఘా ఇంకాస్త పెరగాల్సి ఉంది. దేన్నైనా దుర్వినియోగం చేయడంలో మనకు మనమే సాటి.. అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన సందర్భమిది. సోషల్‌ మీడియా ప్రపంచాన్ని మనముందు ఆవిష్కరిస్తోంది. విజ్ఞానం కోసమో వినోదం కోసమో వినియోగించుకోగలిగితే ఇదొక అద్భుతం. కానీ వికారపు పోకడలకు వేదికవుతుండడం దురదృష్టకరం.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు