రంగుల పండగ ఇది కొంచెం ప్రత్యేకంగా.! - ..

colorful festivity is a little different!
మామూలుగా అయితే ఏదైనా అప్లికేషన్‌లో ఆడ లేదా మగ అని మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ రెండు కాకుండా ఇంకోటి కూడా ఉంది. 'అది' మా హక్కు అంటూ ఆ మూడో తరగతికి చెందిన కొంతమంది ఉద్యమ బాట పట్టారు. ఇది ఇప్పటి వ్యవహారం కాదు. చాన్నాళ్ల కిందట పరిస్థితి. స్త్రీలింగం, పులింగం మాత్రమే కాదు. నపుంసక లింగం కూడా ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్నదే. అయితే ఆ నపుంసక లింగంను చాలా తక్కువగా చూడడం జరుగుతూ వచ్చింది. ఇకపై అలా ఎవర్నీ తక్కువ చేసి చూడడానికి వీల్లేదు. ఎందుకంటే మన భూమ్మీదే, మన సమాజంలోనే వాళ్లూ అంతర్భాగం కాబట్టి. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఆ మూడో విభాగాన్ని తయారు చేశాయి. సామాజిక పరమైన ఓ జాడ్యం అని ఆ మూడో లింగం గురించి చాలా మంది భావించారు.

మూడు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. లెజ్బియన్‌, గే, బై సెక్సువల్‌, ట్రాన్స్‌ జెండర్‌, ఇంట్రా సెక్సువల్‌, క్వెరీ ప్లస్‌ ప్లస్‌.. ఇలా చాలా పుట్టుకొస్తున్నాయి. మొదట్లో ఈ విభాగాలకు చెందిన వారు బయటికి రావడానికి సిగ్గు పడేవారు. పరిస్థితులు మారాయి. ప్రముఖుల మద్దతు లభించింది. పోరాటం మొదలైంది. తమ పట్ల చిన్న చూపు తగ్గడంతో హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది 'లెజిబిటీఐక్యూ..' సమాజం. ప్రముఖ బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ ఈ ఉద్యమంలో చాలా ఎక్కువగా కనిపించింది. మొదట్లో ఆమెని అంతా తప్పు పట్టారు. తర్వాత ఆమె బాటలో చాలా మంది సినీ ప్రముఖుల నడిచారు. బలవంతపు శృంగారం వేరు. పరస్పర అంగీకారంతో సహజ శృంగారం వేరు. సర్వోన్నత న్యాయస్థానం అందుకే స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని తేల్చి చెప్పింది. ఎప్పుడో పద్దెనిమిదవ శతాబ్ధంలో బ్రిటీష్‌ చట్టాల్ని అనుసరించి ఏర్పాటైన ఇండియన్‌ పీనల్‌ కోర్టు సెక్షన్‌ 377 ఇప్పుడు కొట్టివేయబడింది.

సుప్రీం తీర్పు తర్వాత రెయిన్‌బో జెండాలతో దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సంబరాలు చోటు చేసుకుంటున్నాయి. స్వేచ్ఛకు అర్ధం ఇది అంటూ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో స్పందించారు. కరణ్‌జోహార్‌, సోనమ్‌కపూర్‌, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా జయం రవి, అభిషేక్‌ బచ్చన్‌ ఇలా ఒకరేంటి ప్రతీ ఒక్కరూ ఆ సంబరాలకు మద్దతుగా నిలిచారు. అయితే స్వలింగ సంపర్కంతో అనేక అనర్ధాలుంటాయంటూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మళ్లీ సర్వోన్నత న్యాయస్థానంలోనే సవాల్‌ చేసే అధికారం ఉందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆ సంగతెలా ఉన్నా దేశ వ్యాప్తంగా ఈ సరికొత్త రంగుల  పండగ  చర్చనీయాంశమైంది. ప్రధానంగా యువత ఈ సంబరాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారారు.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు