ఈ మధ్య చిన్న, పెద్ద అవసరమా లేదా అని చూడకుండా 'డైట్' చేయటం ఫ్యాషనై పోయింది. ఏ డైటూ చేయకుండా మామూలుగా తింటూ (కొన్ని మానుకుని) ఆరోగ్యంగా ఉండవచ్చు. పలువురు డాక్టర్లు, ఆయుర్వేద ప్రముఖులు సూచనల మేరకు మీకు కొంత సమాచారం అందించదలిచాను.
1. రైస్ కుక్కర్ ని మానేసి వార్చిన అన్నం తినాలి. అలాగే రోజు మీరు తినే అన్నం లో 40% తగ్గించి, ఆ స్థానంలో పప్పు తినండి.
2. పప్పు టమాటో, పప్పు ఆకుకూర ఇలా ఏదోటి చేస్కుని పోపు ఒక్క స్పూను నెయ్యితో వేయాలి (ఆయిల్ వాడొద్దు)
3. వేపుడులు తగ్గించాలి. నెలకు ఒక 1kg oil మీరు వాడుతుంటే దాన్ని 1/2kg కి తగ్గించండి.
4. స్వీట్స్ పూర్తిగా మానేస్తే మంచిది లేదా 60% తగ్గించండి.
5. మాంసాహారులు రెడ్ మీట్, రొయ్యలు, పీతలు మానేయాలి. కేవలం చికెన్, చేప మాత్రమే తీసుకోవాలి (ఫ్రై కాదు)
6. ఐస్ క్రీం, చాక్లేట్స్, చిప్స్ మానేయండి. ముఖ్యంగా పెరుగు పూర్తిగా మానేయాలి. తప్పని సరి పరిస్థితుల్లో మజ్జిగ బాగా పలచగా తాగండి.
7. ఎగ్స్ రోజూ 2 తినండి. Fruits ఏదన్నా రోజుకోటి తినండి. Juice త్రాగేవారు చక్కెర లేకుండా తాగండి.
పైన చెప్పిన విధంగా డైట్ అందరూ చేయగలరు. పెద్దగా కష్టపడాల్సింది గాని, బాధ పడాల్సిందిగాని ఏమీలేదు. అనవసరం గా లిక్విడ్ డైట్ లు చేసి కిడ్నీ ప్రోబ్లెమ్స్, నరాల బలహీనతల్ని కొని తెచ్చుకోవద్దు. కనీసం రోజుకో 2 కిలో మీటర్లు నడవండి. !! సర్వేజనా ఆరోగ్యమస్తు !!