ఆరోగ్యమే మహాభాగ్యం" అన్ని ఐశ్వర్యాలకు మూలం ఆరోగ్యం. ఇవాళ ఆరోగ్యం పేరుమీద ఎంతో గందరగోళం శృష్టిస్తున్నారు. డైట్ చర్చలు పెట్టుకుని తింటున్నారు. ఈ తరానికి షడ్రసోపేతమైన భోజనం తెలియదు. ఎదో తింటున్నారు. మన భారతీయ ఋషి పరంపర మనకు చెప్పిన విధానం ఏమిటంటే శుచిగా రుచిగా వేడిగా వున్నప్పుడు భోజనం చెయ్యాలి. అన్ని పదార్ధాలు తిను, దేన్ని బాగుందికదా అని మితిమీరి తినకు. నీవు చేసే పనిననుసరించి తినాలి. తిన్నది జీర్ణం కావాలి నీకు శక్తిని అందించాలి.
మా చిన్నప్పుడు అన్ని పెట్టేవాళ్ళు. ఒక జ్వరం వచ్చినప్పుడూ మాత్రమే "లంఖణం" చేయించేవారు.అదికూడా ఒక పూట లేదా రసం తో అన్నం తినిపించేవారు. అంతేకాని ఇవ్వాళ్ళటి యువత తిండిని చూస్తే అర్ధరాత్రి లేదు ఎప్పుడు పడితే అప్పుడు వింతవింతైన ఆహారపదార్ధాలు తింటున్నారు. ఏ పదార్ధమైన మితంగా హితంగా తినాలి. నీవు తినే తిండి నిన్ను మనిషిగా మనీషిగా నిలబెట్టాలి కాని నిన్ను పశువుగా రాక్షసుడిగా మార్చకూడదు. సాత్వికమైన ఆహారాన్ని తీసుకో, ఆరోగ్యంగా మసులుకో..
డాక్టర్ ఆచార్య వేణు
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు