ఏం తింటున్నాం మనం.! - ..

What do we eat?

ఏదో తినేస్తున్నాం.. ఎలాగోలా బతికేస్తున్నాం. ఒంట్లో నలతగా ఉంటే ఓ టాబ్లెట్‌ వేసుకోవడం.. నీరసంగా ఉంటే ఎనర్జీ డ్రింక్‌లు లాగించేయడం ఇంతేనా జీవితం.? అసలేం తింటున్నాం.? మన శరీరానికి ఏం కావాలి.? నిత్యం శరీరానికి శక్తి అవసరం. ఆ శక్తి మనం తినే ఆహారం ద్వారానే మనకు లభిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా తిండి తినకపోతే అంతే సంగతి. పొద్దున్నే బ్రేక్‌ ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌, రాత్రయితే డిన్నర్‌ తినేశాం. పడకేశాం. పొద్దున్నే మళ్లీ లేచాం. గిరగిరా తిరిగేస్తోంది గడియారం. రోజూ ఇదే సైకిల్‌. పెద్దగా మార్పులేమీ లేవు. ఈ జీవన శైలి చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఏం తింటున్నామో ఆ తిండి మీద అవగాహన లేక తినేస్తుండడం వల్ల శరీరానికి అందాల్సిన శక్తి అందడం లేదు. ఇంతేనా జీవితం.!

తినాలి.. తిన్నది సరిగా జీర్ణం కావాలి. ఆ జీర్ణమైంది ఒంటికి శక్తినివ్వాలి. ఇన్ని ముఖ్యమైన పనులున్నాయి. శరీరానికి శక్తి కావాలంటే తిన్నది జీర్ణం కావాలి. సరిగా జీర్ణం కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అసలు సరైన ఆహారం అంటే ఏమిటి? వెంట్రుక నుండి కాలి గోటి వరకూ మంచి ప్రభావం చూపే ఆహారాన్ని సరైన ఆహారం అంటాం. వెజ్‌ కావచ్చు. నాన్‌ వెజ్‌ కావచ్చు. ఏది తిన్నా తగినంత, అవసరమైనంత, జీర్ణమయ్యేంత, శక్తినిచ్చేంత తప్పనిసరి. ఇది ఆహార సూత్రం. నాన్‌ వెజ్‌ తినేస్తే బలమొచ్చేస్తుందనీ ఆకుకూరలు తింటే ప్రయోజనం ఉండదనీ కొందరిలో కొన్ని అపోహలుండొచ్చు. ఏదైనా సరైన మోతాదులో తీసుకుంటే అది మనకి కావాల్సిన శక్తినిస్తుంది. ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం ఈ మూడు పూటలు కొంతమందికి సరిపడకపోవచ్చు. అదనంగా ఇంకో రెండు సార్లు ఆహారం తీసుకోమని వైద్యులు చెబుతుంటారు. దానర్ధం మూడు పూటలు తినే ఆహారాన్ని ఐదు భాగాలుగా చేసుకోమని.. ఇది శరీర ధర్మానికి తగ్గట్లుగా ఆహార నియమాన్ని మార్చుకోవడమే.

గాలి కాలుష్యం.. నీరు కాలుష్యం.. ఆహారమూ కాలుష్యమే. కాబట్టి ఉన్నంతలో మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పెరట్లోనో, ఇంట్లో పూలకుండీల్లోనో పెంచుకునే ఆహారం శ్రేయస్కరం. మొత్తం మనం తినే కూరగాయలన్నీ ఇలాగే పండించుకోలేం. కానీ కొంతవరకూ ఉన్న అవకాశాన్ని వాడుకోవాలి. ఐదారు పూలకుండీల్లో చేసే ఇంటి వ్యవసాయం ఎంతో కొంత శరీరానికి వ్యాయామాన్ని అలాగే మానసిక ప్రశాంతతనీ కలిగిస్తుంది. ముందే చెప్పుకున్నాం కదా. ఏదో తినేస్తున్నాం.. అని కాకుండా కొంచెం ఆలోచిస్తే మన ఆరోగ్యం కొంతవరకూ అయినా మన చేతుల్లో భద్రంగా ఉండొచ్చు. కొంచెం ట్రై చేస్తే పోలా. అదనంగా ఖర్చయ్యేది కాదు కదా.!

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు