మేష రాశి : ఈవారం మొత్తం మీద వ్యాపారవిషయాల్లో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. దూరప్రదేశంలో ఉన్న బంధువులను కలుసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొవడం అనేది సూచన. తల్లితరుపు బంధువులతో మాటపట్టింపులకు వెళ్ళకండి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందిన ఇబ్బందులు కలుగక పోవచ్చును. ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఉండవు.
వృషభ రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఊహించని విధంగా ధనం చేతికి అందుతుంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చర్చలకు సమయం ఇస్తారు.
మిథున రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి ముఖ్యమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. స్వల్పఅనారోగ్య సమస్యలు మిమల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు లభిస్తాయి. జీవితబాగాస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. కొని కొన్ని విషయాల్లో మీ మాటతీరు మూలాన నూతన సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంది , కాస్త సర్దుబాటు మేలుచేస్తుంది.
కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద మీమాట నెగ్గాలనే ఆలోచన ధోరణి అధికంగా ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలు ఏర్పడే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. ఆత్మీయులనుండి నూతన సమాచారం అందుతుంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులు లేదా బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది , కాస్త రుణపరమైన విషయాల్లో బాగా ఆలోచించి ముందుకు వెళ్లడం అనేది సూచన.
సింహ రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలతో మీ అనుబంధం బలపడేలా ప్రణాలిక కలిగి ఉండుట మంచిది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఆలోచనలను అదుపులో చేసుకోవడం మంచిది. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుటకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.
కన్యా రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన అవకాశాలు పొందుతారు. భాగస్వామ్య ఒప్పందాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. చర్చాపరమైన విషయాలకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండుట మంచిది. రావాల్సినధనం విషయంలో స్పష్టత కలిగి ఉండుట మంచిది. సంతానం గురుంచి ఉన్న ఆందోళన తగ్గుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకపోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.
.
తులా రాశి : ఈవారం మొత్తం మీద సమయాన్ని మీకు నచ్చిన వారితో గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీఉస్కోవడంలో తడబాటు పొందుతారు , ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ద పనికిరాదు. ఆరోగ్యపరమైన సమస్యలు పెరుగుటకు అవకాశం ఉంది, జాగ్రత్త. సొంత ఆలోచనలు పనికిరాకపోవచ్చును, నూతన సమస్యలు వస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు. అనవసరమైన విషయాల్లో నిదానం అవసరం.
వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది , జాగ్రత్త. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట అలాగే నలుగురి సహకారం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం కొంత మేర చేతికి అందుతుంది. విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. దూరప్రదేశంలో ఉన్న స్వదేశానికి తిరిగి వచ్చేఆస్కారం ఉంది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది, వారై సూచనల మేర ముందుకు వెళ్ళండి.
ధనస్సు రాశి :ఈవారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు పెరుగుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. అర్థిపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, ఈ విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చర్చాపరమైన విషయాల్లో మీకంటూ ఒక స్పష్టమైన విధానాం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో పెద్దలను కలుసుకునే ఆస్కారం ఉంది.
మకర రాశి : ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాల్లో శ్రద్ద కలిగి ఉండుట సూచన. మానసికంగా దృడంగా ఉండుట మంచిది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. విలువైన వస్తువుల విషయంలో మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. ఆరోగ్యం విషయాల్లో కాస్త పురోగతి ఉంటుంది. పెద్దలనుండి వచ్చే ఆలోచనలు అలాగే సూచనలు మీలో కొత్త విధానాలకు దారితీస్తాయి. ప్రయాణాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద అవసరం. శత్రువులు బలపడే అవకాశం ఉంది.
కుంభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మీకంటూ నూతన విధానాలు కలిగి ఉంటారు. సాధ్యమైనంత మేర కుటుంబంలో ఎవ్వరితోను విభేదాలు రాకూండా చూసుకోండి. జీవితభాగస్వామితో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ద అవసరం. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది అలాగే విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం కలదు.
మీన రాశి : ఈవారం మొత్తం మీద చర్చలకు ఆరంభంలో దూరంగా ఉండుట మంచిది. పెద్దలను కలుస్తారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన ప్రయత్నాల విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. వ్యాపారపరమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా చేసే చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులను కలుస్తారు. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ద తీసుకోండి, సమాయానికి భోజనం తీసుకోండి.