ప్రాణాల్ని తోడేస్తున్న ప్రేమ - ..

killing love

ప్రేమ పేరుతో అబ్బాయిలు, అమ్మాయిల ప్రాణాల్ని తీసేయడం గురించి వింటూనే విన్నాం. అమ్మాయిలు అదే ప్రేమ పేరుతో అబ్బాయిల్ని నిలువు దోపిడీ చేసేయడం, ఇంకొకరితో కలిసి ప్రేమించినోడి హత్యకు ప్లాన్‌ చేసి, ఆ ప్లాన్‌ని అమలు పరచడం వంటి సంఘటనల్ని గురించి వింటూనే ఉన్నాం. సినిమాల్లో చూసి ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో జరుగుతాయా? అని కొందరు ఆశ్చర్యపోతే, ఇంకొందరు సినిమాలు చూసే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారనీ నమ్ముతున్నాం. ప్రాణం తీసేయడానికి ప్రేమ ఎప్పుడూ కారణం కాదు. ప్రేమ ముసుగులో రాక్షసత్వం మాత్రం ఇలాంటి పనులు చేస్తోంది. నిజమే ప్రేమ వేరు. రాక్షసత్వం వేరు. ప్రేమించే మనసున్నోడికి ప్రాణం తీసేంత రాక్షసత్వం అంత తేలిగ్గా వచ్చేయదు. అయితే ఒక్కోసారి ప్రేమ చేతిలో మోసపోతే ఆ బాధ మనిషిని రాక్షసుడిగా మార్చేస్తుందేమో.
అల్లు శిరీష్‌ హీరోగా నటించిన 'గౌరవం' సినిమా గుర్తుంది కదా.

అందులో అది సినిమా మాత్రమే కాదు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందించారు ఆ సినిమాని. మొన్న తెలంగాణాలోని మిర్యాలగూడలో ఓ తండ్రి తన కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తట్టుకో లేక మృగంగా మారి పోయాడు. కూతుర్ని పెళ్లాడిన కుర్రాడ్ని అల్లుడిగా అంగీకరించ లేక దారుణానికి ఒడి కట్టాడు. కూతురి నుదిటి బొట్టు చెరిగి పోయింది. మా నాన్న ఎదురు పడితే నేనే చంపేస్తా అని ఆ కూతురు తన భర్తను కళ్ల ముందే చంపించిన తండ్రి పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. కూతురి మీద ప్రేమతో తండ్రి ఇలా చేశాడంటే నమ్మేదెవరు? నర రూప రాక్షసుడే అతను. అందుకే అంతటి దారుణానికి ఒడి కట్ట గలిగాడు. హైద్రాబాద్‌లో తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద జరిగింది ఈ ఘటన. కూతుర్ని, అల్లున్ని ఇద్దర్నీ నరికేశాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, స్వయానా ఆ కూతురుకి తండ్రే.

అసలు ఈ ప్రేమలో ఏముంది? పిల్లలు తల్లితండ్రుల ప్రేమకు ప్రతిరూపాలు. కానీ ఆ పిల్లలేమో తమ తల్లితండ్రుల ప్రేమని కాదని ఇంకో ప్రేమని వెతుక్కుంటున్నారు. అక్కడే వస్తోంది సమస్య అంతా. తెలియని వ్యక్తితో ప్రేమలో పడడం ఎలాగో తెలిసినప్పుడు కని, పెంచిన తల్లి తండ్రుల్ని ఒప్పించడమూ తెలియాలి. అయితే ట్రెండ్‌ మారింది. ప్రేమించడం ఓ ఫ్యాషన్‌. చంపేయడం ఇంకో ఫ్యాషన్‌. కని, పెంచిన తల్లి తండ్రుల్ని ఖాతరు చేయని పిల్లలది ఎంత తప్పో, కంటికి రెప్పలా చూసుకున్న పిల్లల్ని కాటు వేయడం అంతకన్నా పెద్ద తప్పు. సమాజంలో విపరీత ధోరణి పెరిగి పోవడమే ఇన్ని అనర్ధాలకూ కారణం. తల్లితండ్రుల ప్రేమని అర్ధం చేసుకుంటే పిల్లలు గీత దాట లేరు. పిల్లల్ని అర్ధం చేసుకుంటే తల్లితండ్రులు హద్దులు దాటి ఆలోచించరు. పరిష్కారం లేని సమస్య ఇది. అయినా కానీ ప్రేమ ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. ఆ ప్రేమ తల్లితండ్రుల్లోనూ, పిల్లల్లోనూ ఉండాలి. అది లేకపోవడం వల్లనే విధి ఇలా తగలడింది.
 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు