21-9-2018 నుండి27-9-2018 వరకు వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం నూతన నిర్ణయాల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట వలన పూర్తి చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుటకు అవకాశం ఉంది. పెద్దలతో చర్చలు చేయకపోవడం మంచిది. వ్యాపార పరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ ఆలోచనల్లో కాస్త స్వల్ప మార్పుకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వేచి చూసే ధోరణి మంచిది.

 వృషభ రాశి : ఈవారం ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ మాటతీరు వలన అధికారుల నుండి చక్కటి సహకారం లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన రంగాలలో నూతన అవకాశాలను పొందుతారు. సంతానపరమైన విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనల మేర ముందుకు వెళ్ళండి. చర్చల్లో సర్దుబాటు విధానం మంచిది.

మిథున రాశి : ఈ వారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్ట పడుతారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తి చేయుట మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మిత్రుల నుండి వచ్చిన సూచనలను పరిగణ లోకి తీసుకోవడం ఉత్తమం. నూతన వ్యాపార పరమైన విషయాల్లో తొందర పాటు వద్దు , అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. చర్చల్లో అధిక సమయం గడుపుటకు అవకాశం కలదు. కుటుంబంలో మీ ఆలోచనలను పెద్దలకు తెలియ జేసే ప్రయత్నం చేస్తారు.

కర్కాటక రాశి : ఈ వారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను చేపట్టుట వలన పెద్దల నుండి ప్రశంశలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ఆర్థిక పరమైన విషయాల్లో ముఖ్యమైన సూచనలు వింటారు. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును, తండ్ర లేదా తండ్రి తరపు బంధువుల గురుంచి ఆలోచన చేయుటకు ఆస్కారం ఉంది. వివాదాలకు సాధ్యమైనంత  దూరంగా ఉండండి.

సింహ రాశి :  ఈ వారం మీ మాట తీరు పెద్దలను ఆకట్టుకొనే అవకాశం ఉంది , కాకపోతే మీ నిర్ణయాల వలన వారు ఇబ్బందికి గురయ్యే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేయుటకు తోటి వారి సహకారం తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది, కాస్త ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఆరోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు ఆవకాశం ఉంది, జాగ్రత్త. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. మౌనం మిమ్మల్ని లబ్దిని పొందేలా చేస్తుంది.

కన్యా రాశి : ఈ వారం సోదరులతో చేపట్టిన చర్చలను పూర్తి చేస్తారు, సంతృప్తి కరమైన ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన వ్యాపార పరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. సంతాన పరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు ఆస్కారం ఉంది. దైవ పరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయు వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. మిత్రులతో ఊహించని విధంగా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, కావున కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది.

తులా రాశి :ఈ వారం మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసే ఆస్కారం ఉంది. వ్యాపార పరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఎవరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి. సోదరుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. వ్యాపార పరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట మంచిది. పెట్టుబడుల విషయంలో తొందర పాటు కూడదు. ఆరోగ్యంలో కాస్త ఇబ్బందులు తగ్గేందుకు ఆస్కారం కలదు.

వృశ్చిక రాశి : ఈ వారం నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. కాస్త స్వార్థ పూరితమైన ఆలోచనలను కలిగి ఉంటారు. చేపట్టిన పనుల వలన స్పష్టత కలిగి ఉండుట మంచిది. ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి, నూతన విధానాలు కలిగి ఉంటారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య పరమైన సమస్యలు పెరుగుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరులతో మీరు చేపట్టిన చర్చలు మధ్యలో ఆగి పోయే ఆస్కారం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, ఖర్చులు పెరుగుతాయి.

ధనస్సు రాశి :

ఈవారం కోపాన్ని తగ్గించుకోవడం వలన లబ్దిని పొందుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు ఆవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది, వాహనాల విషయంలో ఖర్చులు అయ్యే ఆస్కారం ఉంది. వ్యాపార రంగంలో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తిగా సహకారం లభించుటకు అవకాశం ఉంది.

మకర రాశి :  ఈ వారం నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. వ్యాపార పరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతాన పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రుల నుండి మీకు నూతన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ఖర్చులను తగ్గించుకోవడం వలన మేలు జరుగుతుంది. పెద్దల నుండి ముఖ్యమైన సహకారం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను నష్ట పోయే ఆస్కారం కలదు , కావున కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. 

కుంభ రాశి :  ఈ వారం పెద్దలను కలుస్తారు, వారి నుండి వచ్చిన సూచనల విషయంలో భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను ముందుగా పూర్తి చేయుట మంచిది. మధ్యలో ఆగిన పనులను ముందుగా పూర్తి చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది, వారి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో మీకున్న ఆందోళన తొలగుటకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. 

మీన రాశి : ఈ వారం పెద్దలను కలుస్తారు, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేయుటకు ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్త. పెద్దలతో మీకున్న పరిచయం వలన లబ్దిని పొందుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుండి లేక మిత్రుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట సూచన. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు.

 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు