మనుషులు మాత్రమే బాధకు గురౌతున్నారు..ఎందుకు - ..

Only people are suffering ... Why

స్వేచ్ఛ వల్ల మానవులు మృగత్వానికీ, దివ్యత్వానికీ మధ్య ఊగిసలాడుతున్నారు . మీరు మనిషిగా పుట్టారు, కాని మంచి మనిషిగా కావాలంటే ఎన్ని యాతనలు పడాలి? అన్నీ చేసినా, మీ పరిస్థితి మీకే తెలియదు, అవునా? దేవతా స్వభావం కూడా స్థిరమైనదే. మీరు మానవ స్వభావం అంటున్నదానిలో అర్ధం లేదు. అసలు మానవ స్వభావం అంటూ ఏమీ లేదు. మీరు అయితే మానవునిగా మారగలగాలి లేకపోతే లేదు. మీరు మానవుడు అంటున్నది, ఏదో ఒక రకంగా నిశ్చయింపబడలేదు. అంటే అక్కడ మీకు కొంత స్వేచ్ఛ ఉన్నది. ఈ స్వేచ్ఛ వల్ల మానవులు మృగత్వానికీ, దివ్యత్వానికీ మధ్య ఊగిసలాడుతున్నారు. ఒక్కోసారి, మీరు అద్భుతంగానూ, ఒక్కోసారి వికారంగానూ, మరోసారి అందంగానూ, మళ్ళీ ఒకసారి మరో విధంగానూ ఉంటున్నారు, ఎందుకంటే మీరు రెండు వేర్వేరు స్థితుల మధ్య ఊగిసలాడుతున్నారు. మీకు, మానవునిగా ఏదో ఒక స్పష్టమైన స్వభావం లేదు, గమనించండి. మీరు ఏ స్వభావాన్నైనా తీసుకుని మీ స్వభావంగా చేసుకోవచ్చు.

మీరెప్పుడూ ఆశ్చర్యపడుతూ “‘ఓఁ, అతనలాంటి నేరం ఎలా చేయగలడు? అతనెలా చంపగలడు?” అనుకోవచ్చు. కాని మీలో మీరు ఎక్కడో అది సరైన పనే అని సర్దిచేప్పుకోవచ్చు. మీరు ఈ రోజు వంద మందిని చంపి, దాన్ని మీలో సరైనదిగా చెప్పుకొని, ఎంతో గొప్పగా చేసుకుని, మరో వంద మందిని చంపవచ్చు. ప్రజలు అలాగే చేస్తున్నారు, అవునా? మానవుడు ఎక్కడా ఖచ్చితంగా స్థిరంగా లేడు కాబట్టి, మీరు దేని గురించైనా కావలసిన విధంగా భావించుకోవచ్చు.

ఎరుక ద్వారానే ఉన్నతి

మీరు ఎరుకతో ఉంటే సహజంగానే మిమ్మల్ని మీరు వృద్ధి పరచుకోవచ్చు. మీరు ఎరుక లేకుండా ఉంటే, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మీరు పతనం కావచ్చు. అందువల్లే మీరు ఇప్పుడు, బాధ పడుతున్నారు. మీరు బాధ పడుతున్నది మీ సంకెళ్ళ వల్ల కాదు, దురదృష్టవశాత్తూ మీ స్వాతంత్రయం వల్లనే, అంతే కాకుండా మీరు ‘నన్ను జంతువుగా ఎందుకు మార్చటం లేదు, అలా నా జీవితం గూడా ఫిక్సైపోతే నాకూ బాధలుండవు ’ అని ప్రాధేయ పడుతున్నారు? అంటే మీ ఫిర్యాదు, మీ స్వేచ్చ గురించే, అవునా? మీరు ఎరుకతో ఉంటే స్వేచ్ఛ ఒక వరం, మీరు ఎరుకలేకుండా ఉంటే అదే శాపం. అందువల్ల మీరు మీ స్వేచ్ఛ తొలగించుకునే ప్రయత్నం చేయవద్దు. మీరు ఎరుకతో ఉండండి, ఉన్న అవకాశాన్ని చూడండి.

మీరు మానవుడు అంటున్నది ఒక రకమైన, మధ్యావస్ధ. మృగ స్వభావం, దైవ స్వభావం, బాగా స్థిరపరచబడ్డవి. మానవునిది వదులుగా ఉన్నది. రెండు ఊగే తాళ్ళ మధ్యలో ఉన్నట్టు, ఏదో ఒకటి పట్టుకుంటే బాగానే ఉంటుంది, కాని మీరు అలా పట్టుకోరు... అదే సమస్య అంతా. మీరు పడిపోతే మళ్ళీ ఎక్కి పట్టుకుని మరకటి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే పునరపి జననం, పునరపి మరణం. మీరు ఎరుకతో లేకపోతే, అది అంతులేని పరిభ్రమణం, మళ్ళీ మళ్ళీ అదే చెత్త. మీరు ఎరుకతో ఉంటే... మీరు స్పృహతో మెలకువగా ఉంటే, మీరు మీ ఎరుకను వృద్ధి పరచుకోవడానికి చేయవలసిందంతా చేస్తారు, అందువల్ల మీరు సహజంగానే ముందుకు పోతారు. మీకు మొదటిది, రెండవది, మూడవది... ఉత్తమమైంది, మధ్యమం, అధమం అలా ఎంపిక ఉంటే మీరు సహజంగా కోరుకునేది ఏది? సర్వోత్తమం అవునా? అంటే ఆ స్శభావం మీలో అంతర్గతంగానే ఉంది. దీని మూలంగా ప్రకృతి మిమ్మల్ని నమ్మి మీరు సహజంగానే ఉత్తమమైనది ఎంచుకుంటారని మీకు ఎన్నుకునే స్వేచ్ఛ నిచ్చింది. మరి మనం ఆ స్వేచ్ఛను వదిలేద్దామా? మీరు మీ సంకెళ్ళ వల్ల బాధ పడుతుంటే ఫరవాలేదు కాని, మీరు మీ స్వేచ్ఛ వల్ల బాధ పడుతుంటే? ప్రస్తుతం మీరు బాధ పడేది మీ స్వేచ్ఛ వల్లే, గమనించండి.

 
 
ఇషా ఫౌండేషన్  సౌజన్యంతో....

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు