ఈ విశాల ప్రపంచంలో అనేక విధాలైన జీవరాసులు ఉద్భవిస్తు న్నాయి .ఈ ప్రపంచంలోని సమస్త జీవరాసులూ నాల్గు వర్గాలుగా విభ జింప బడ్డాయి.
1. అండజములు (గ్రుడ్డు నుండి పుట్టినవి) ఇవి కోళ్ళు,కాకులు, గ్రద్ద లు ,కోయిలవంటి పక్షులు , బల్లుల వంటి సరీ స్పృపాలు ఈగలు,దో మలు, 2. పిండజములు (గర్భమునుండి ఆవిర్భవించినవి) – పశువు లు , మృగాలు, మానవులు 3. స్వేదజములు (చెమటనుండి పుట్టి న వి) నల్లులవంటివి . 4. ఉద్భిజములు (భూమినుండి ఉద్భవించి న వి). భూమిలో కనిపించే పురుగులు, వానపాములు మొదలైనవి . ఒక్కొక్క వర్గము క్రింద 21 లక్షల చొప్పున మొత్తం 84 లక్షల జీవ రాసులున్నాయి. ఇవన్నీకూడా మూడు రకములైన బాధలకు గురి అవు తున్నాయి. ఒకవర్గానికి మరోవర్గం శత్రువులుకావచ్చు.ఎలాగంటే మానవులకు అనేక జీవరాసుల వలన హాని జరుగవచ్చు. అదేవిధంగా మిగిలివాటికీ ఇది వర్తిస్తుంది.
1. అధిభౌతికము 2. అధిదైవికము 3. ఆధ్యాత్మికము.
జంతువులవలన, ఈగలు, దోమలు వంటి క్రిమికీటకాదులవలన సంభవించే బాధలు అధిభౌతిక మునకు సంబంధించినవి. అంటే పాములు, తేళ్ళు జెర్రులు వంటి విష క్రిములవల్లా, ఈగలు దోమలు వంటి రోగవ్యాప్త కీటకాలద్వారా వ్యాలించే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వానిద్వారానూకలిగే బాధలు అధిభౌతికము క్రిదకువస్తాయి
ఇహ రెండవది- భూకంపాలు, జలప్రళయాల వంటి ప్రకృతి వైపరీ త్యములవలన, కలరా, ప్లేగు వంటి జాడ్యములువ్యాపించడంవలన కలిగే బాధలు అధిదైవికమునకు సంబంధించినవి.
మూడవది – ఆహార విహారముల చేతను, దుర్మార్గులచేతను సంభ వించే బాధలు ఆధ్యాత్మి కమునకు సంబంధించినవి.అంటే విషాహా రం తినడంవల్లా , దొంగలు హంతకులూ, మొదలైన దుర్మార్గుల ద్వారా కలిగే బాధలన్నమాట. ఐతే ఈ సర్వబాధలకు నివారణ ఏమిటి అని ఆలోచిస్తే మానవున కు దృఢమైన ఆత్మవిశ్వాసా న్ని కల్గియుండటమే. ఆత్మను విశ్వసిం చాలి. ఆత్మను గౌరవించాలి. ఆత్మానందము నిమిత్తమై పాటు పడాలి. ఆత్మానందాన్ని పొందటానికి నవవిధభక్తి మార్గర్గా చెప్ప బడ్డాయి
మానవుని సర్వఅవయవాలూ సరిగా ఉపయోగిస్తే అవి మేలుచేస్తాయి. అదే దుర్వినియ్పగపరుచుకుంటే హాని జరుగుతుంది ఉదాహరణకు మన నాలుకకు ఎంతో త్యాగగుణముంది. ఏదైనా పదార్థాన్ని రుచి చూసినప్పుడు అది మధురంగా ఉంటే , వెంటనే '' ఓ జఠరాగ్నీ! దీ నిని నీవే అనుభవించు, చాలామధురంగాఉంది ''అని లోపల కు పంపుతుంది.
ఒక వేళ అందినపదార్ధం చేదుగా ఉంటే తక్షణమే దానిని బయటికి ఉమ్మి వేస్తుంది. లోనికి పంపి లోపలి అంగాలనుబాధకుగురిచేయదు.
అంతేకాక నాలుక ఎంతో గౌరవమర్యాదలతో ప్రవర్తిస్తుంది; ఎన్నడూ తన గడప దాటి బయటికి వచ్చి, పరులింటికి పోదు; ఎన్ని పనులైనా లోపలే చేసుకుంటుంది.
జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం
సత్యం హితం త్వాం పరమం వదామి
ఆవర్ణ యేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి!
ప్రతి ఇంద్రియమూ ఒక్కొక్క పని చేస్తుందిగాని, నాలుక చేసే పనులు రెండున్నాయి. ఒకటి రుచి చూడటం; రెండవది, మాట్లాడటం.
కనుక నాలుకను కొంత అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే అది ఎన్నో పాపాలకు గురిచేస్తుంది. కోపం వస్తే మౌనం వహించాలి. నోరుంది కదాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడ రా దు. పరులకు ప్రీతి కలిగించే పలుకులు పలకాలి.
''గోవిందా! దామోదరా! మాధవా!'' అంటూ భగవన్నామాన్నిపలు మారు ఉచ్చరించాలి. టాక్ లెస్, వర్క్ మోర్ అన్నారు. తక్కువ మాట్లాడాలి.దీనీవల్ల మన జీవితకాలమూ పెరుగుతుంది.శక్తి వృధా కాదు. ఇతరులనుగూర్చి మాట్లాడటం నివారించబడుతుంది తద్వారా పాపానికి దూరమవుతాం. ఎక్కువ పని చేయాలి.మనశక్తిని సద్వినియో గ పరచాలి, ఉన్న శ్వాసలను పరోపకారానికి ఉపయోగపెట్టాలి.
ఎంత తక్కువగా మాట్లాడితే హృదయం అంత పవిత్రంగా రూపొందు తుంది.మాటలు ఎక్కువయ్యేకొద్దీ ఇతరులగూర్చి దూషణ తిరస్కారా లు తెలీకుండానే వస్తాయి.పొరపాటున ఇతరులు బాధపడే రీతి గా , ఇ తరుల ను కించపరిచేరీతిగా మాట్లాడవచ్చు. అందుకే ‘స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ ‘అన్నారు.
ఇంద్రియ దోషాలను నిర్మూలించుకోవాలంటే భగవచ్చింతన చే యాలి. దానిద్వారా మనమూ సుఖ పడతాం, ఇతరులకూ మేలు చే స్తాం . శక్తిని సద్వినియోగపరుచుకోడం వలన మనకేకాక అందరికీ ఎంతో మేలు జరుగుతుంది.
ఈనాడు మనం మన ఇంద్రియాలను ఇష్టానుసారం వదలి పెడు తున్నాం. అందుకే పడరాని పాట్లు పడుతున్నాం.మొట్టమొదట మ నం చేయవలసిన సాధన ఇంద్రియాలను అరి కట్టుకోవటమే. ఆకలి తీర్చు కోను అన్నం తినాలి కానీ ,మితివిూరి భుజించ కూడదు. భుజిం చ నుకూడా ఒకపధ్ధతి ఉంది. కడుపులో ఒక భాగాన్ని భోజనంతో నిం పాలి, ఒక భాగాన్ని నీటితో నింపాలి. మిగిలిన సగ భాగన్నీ ఖాళీగా ఉంచాలి , గాలికోసం.
కాని, మనం నేడు మధురమైన పదార్ధాలను చూడగానే గొంతువరకు తింటున్నాం. క్రిందకూర్చుని భుజిస్తే పైకి లేవలేక పోతున్నాం.ఎవరి చెయ్యైనా సపోర్ట్ కావల్సి వస్తున్నది.అందుకే డైనింగ్ టేబుల్స్ వచ్చా యి. క్రిందకూర్చుని తినడం విధాయకం ఐతే అలా కూర్చుని లేవ నుకూడా సాధ్యం కానంతగా పొట్టను నింపు కుంటున్నాం. కనుక నే అజీర్ణవ్యాధికి గురి అవుతున్నాం. ఒబెసిటీ వస్తున్నది. షుగర్ వంటి వ్యాధుల పాల బడుతున్నాం.తిండిని ఒక పరిమితిలో పెట్టుకోవాలి. అది సాధిస్తే ఎంతో మంచిది. పసుపక్ష్యాదులు మితంగా తింటాయి, వాటికి సరిపడిన వాటినేతింటాయి.వేటాడిన జంతువును తిని మిగతా దాన్ని అక్కడే వదిలేసి వెళతాయి మనం చూసిందల్లా వదలం. దొరికిందంతా తింటాం. అందరినీ ప్రేమిం చడం నేర్చుకోవాలి, దీనివలన మనహృదయం పవిత్రంగా ఉంటుంది.ఇక్కడ ప్రేమ అంటే ఇంద్రియాలతో సంబం ధం లేనిది. స్వార్ధరహితప్రేమ. అన్ కండిషనల్ లవ్ .స్వార్ధ పూరిత ప్రేమకాదు. ''అందరూ నావారే, అందరియందున్నది నా వంటి ప్రా ణ మే'' అన్న విశాలమైన భావంతో అందరినీ ప్రేమించాలి. ఎవ్వరి పట్లా తేడాగా ఉండకూడదు.
మానవుల్లో ఎంతోమంది పరమపూజ్యులు ఉన్నారు. ఆదర్శమాన వులు. వారు ధనకనక వస్తువాహనాదులకు లొంగక కేవల దైవార్పిత భావంతోనే , భక్తితోనే దైవానుగ్రహాన్నుఇ మాత్రమే కోరినవారు .ఉదాహరణకు 'పోతన' -పోతన అనే పేరులోనే ఎంతో గొప్ప అర్థం ఇమిడిఉంది. 'తన' అనే భావాన్ని 'పో'గొట్టు కున్నవాడు 'పోతన'. అందుచేతనే, అతడు గొప్ప భక్తుడైనాడు. అతడు ఆత్మ తత్త్వాన్ని విశ్వసించాడు, లౌకిక తత్త్వాన్ని దూరం చేసుకున్నాడు. కనుకనే పోతన పేరు ప్రజల హృదయా లలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈనాటికీ ఆయన పద్యగద్యాలను పఠించి ఆనంది స్తున్నాం. భాగవతా ని నిత్యం పారాయణం చేసే వారున్నారు. భాగవతాన్ని చదివితే బాగ వుతాం .పోతన ఒక్కోపద్య ఒక్కో ఆణిముత్యం.ఆయన అంతటి భక్తు డు కనుకే వాటికంత మాధుర్యం వచ్చింది.
కనుక మనం మనకు లభించిన మానవ జన్మను సార్ధకంచేసుకోను ప్రయత్నిద్దాం. మానవుడు పాటించాల్సిన ధర్మాలను అనుసరిద్దాం .
ఇక్కడ ధర్మము రెండు విధాలు. ఒకటి ప్రవృత్తిధర్మం, రెండవది నివృత్తి ధర్మం.
లోక సంబంధమైన ధర్మాలన్నీ ప్రవృత్తి ధర్మాలు. ''నాయనా! నీకు ఆకలైతే అన్నాన్ని తినూ' అని చెబుతుంది ప్రవృత్తి. తక్షణమే నివృత్తి అడ్డుతగిలి ''నాయనా! నీకు ఆకలౌతోందని చేతికి చిక్కినదల్లా తికూ' అంటుంది. ఎలాంటి తిండి తినాలి? ఏరీతిగా తి నాలి? అని బోధించేది నివృత్తిధర్మం. ఏపనిచేయాలి, ఏదిచేయ కూ డదు,ఏదిమాట్లాడాలి, ఏది కూడదు అనిమనస్సుకుచెప్పేది నివృత్తి. బాహ్యమైన చర్యలకు సంబంధించినది ప్రవృత్తి.
ఈనాడు మనం లోకంలో కంటితో చూసేది, చెవులతో వినేది, మన స్సు తో అనుభవించేది అంతా ప్రవృత్తికి సంబంధించినదే. మనస్సుకు, ఇంద్రియాలకు అతీతమైన తత్త్వమే నివృత్తి.
కనుక పైనచెప్పుకున్న నాలుగు వర్గాల జీవుల్లో అంటే 84లక్షల జీవరాసుల్లో మానవజన్మ లభించడమే అదృష్టం. మానవునకు ల భించిన ప్రత్యేకతను , విచక్షణాశక్తిని , జ్ఞానసంపద గడించే అవకా శాన్నీ సద్వినియోగపరచుకుని ,పరోపకారం చేస్తూ జీవితాన్ని సద్వి నియోగపరచుకుందాం.[ భగవాన్ శ్రీసత్యసాయి బాబావారి ఉపన్యాసాల ఆధారంగా ]