గంగ
ఎండుతోందా?
కూర్చున్నది
శివుడి మూడోకంటి సెగ మీద కదా!
----------------------------------------------
జ్ఞానాన్ని
పంచేవాళ్లే కనిపిస్తున్నారు-
జ్ఞానంలో
నివసించే వాళ్లకన్నా!
----------------------------------------------
మనిషి మనసుని
ఊహించలేం;
చేప నీళ్లెప్పుడు తాగుతుందో
చెప్పలేం.
----------------------------------------------
వేసంకాలం-
సండే కూడా
"మండే" ఎండే,
రోజూ "ఫ్రై"డేనే!