28-09-2018 నుండి 04-10-2018 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈ వారంలో ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారి నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభించినను శ్రమను పొందుటకు అవకాశం ఉంది. మాటలు నిదానంగా ఇతరులకు ఇబ్బందిని కలిగించకుండా వాడుట సూచన. కుటుంబంలో నూతన నిర్ణయాలకు అవకాశం కలదు. ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి, అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. దూర ప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని కేటయిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది అలాగే అగ్ని సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. మిత్రుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును.

 వృషభ రాశి : ఈ వారంలో ఇష్టమైన వ్యక్తులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను చిన్న చిన్న సమస్యలను పొందినను చివరకు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు కాకపోతే సరైన ప్రణాళిక అసవరం. కుటుంబ సభ్యులతో కలిసి విందుల్లో పాల్గొనే అవకాశం ఉంది అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. పెద్దలతో కలిసి చేయు ప్రయత్నాల విషయంలో నిదానంగా లేకపోతే నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. స్త్రీ/పురుష సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాట పడవలసి రావచ్చును. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.

మిథున రాశి : ఈ వారంలో ఉద్యోగంలో తలపెట్టిన పనుల్లో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కొత్త కొత్త పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. పెద్దలతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది, వారి నుండి నూతన అవకశాలు పొందుతారు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తి చేసే అవకాశం ఉంది జాగ్రత్త కొంత శ్రమను పెంచుట వలన మేలు జరుగుతుంది. వ్యాపార పరమైన విషయాల్లో బాగానే ఉంటుంది సమయానికి అనుకూలంగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం వలన కొంత మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద పనికి రాదు తగిన జాగ్రత్తలు తీసుకోవలసినదిగా సూచన.  స్త్రీ మూలక విషయాలలో నిదానంగా లేకపోతే మాట పడవలసి రావొచ్చును.

కర్కాటక రాశి :ఈ వారంలో సంతాన పరమైన విషయాల్లో సంతోషకరమైన వార్తను వినే అవకాశం కలదు. ఉద్యోగంలో బాగుంటుంది. నూతన ఆలోచనలతో మిత్రులతో కలిసి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి గత కొంత కాలంగా ఆగి ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి చర్చా పరమైన విషయాలకు అవకాశం ఉంది వాటికి సమయం ఇవ్వ వలసి రావొచ్చును ఈ విషయంలో నిదానంగా ఉండి వారి ఆలోచనలు తెలుసుకోండి. వ్యాపార పరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. ఆర్థిక పరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలు జరుగుతుంది.

సింహ రాశి : ఈ వారంలో పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు కాకపోతే మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. ఉద్యోగంలో శ్రమ తప్పక పోవచ్చును ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళడం మేలు. కుటుంబంలో అనవసరమైన ఖర్చులకు కళ్ళెం  వేయుట మంచిది. ప్రయాణాలు చేయవలసి రావొచ్చును చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట చేత ఇబ్బందులు తగ్గుతాయి. దూర ప్రదేశం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. రాజకీయ పరమైన విషయాల్లో అనుభవజ్ఞుల ఆలోచనల మేర నడుచుకోండి. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది అలాగే ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. 

కన్యా రాశి : ఈ వారంలో బంధు మిత్రులను కలుస్తారు వారితో కలిసి సమయాన్ని విందులకు, వినోదాలకు గడిపే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగుంటుంది పెద్దల నుండి ఆశించిన విధంగా సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే సరైన ప్రణాళిక అవసరం. ఆర్థిక పరమైన విషయాల్లో అనుభవజ్ఞులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనే అవకాశం ఉంది. కుటుంబంలో భాగస్వామి విషయంలో సంతోష కరమైన వార్తలను వినే అవకాశం కలదు. వ్యాపార పరమైన విషయంలో మాత్రం పెట్టుబడులు పెట్టక పోవడం అనేది మంచిది కొంత కాలం వేచి చూడడం ఉత్తమం. విదేశీ ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు కావున ప్రయత్నం పెంచుట మేలు.   చిన్ననాటి మిత్రులను కలవడానికి ఆస్కారం ఉంది.

తులా రాశి : ఈ వారంలో చేపట్టు పనుల విషయంలో ఆచి-తూచి వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. పని ఒత్తిడి మూలాన స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పక పోవచ్చును. ఆర్థిక పరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు అవకాశం కలదు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం మూలాన  పూర్తి చేసే అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి మేలు జరుగుతుంది. ఉద్యోగంలో భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది ఈ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలు లబ్దిని చేకూరుస్తాయి నూతన పనులను చేపడుతారు. దైవ సంబంధ విషయాలకు సమయం ఇవ్వండి.

వృశ్చిక రాశి :ఈవారంలో ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయనికి పూర్తి చేయుట ద్వార నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది బంధువులతో సరదాగా గడుపుతారు. శుభ కార్యముల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది అలాగే గత కొంత కాలంగా ఆగి ఉన్న పనులు ముందుకు వెళ్ళుటకు ఆస్కారం కలదు. అగ్నిసంబంధ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. పెద్దలతో మీకున్న పరిచయాలు లబ్దిని కలిగిస్తాయి వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. మానసికంగా దృడంగా లేకపోతే కొంత ఇబ్బందులను పొందుతారు కొన్ని కొన్ని విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన.

ధనస్సు రాశి : ఈ వారంలో చేపట్టిన పనులను దాదాపు అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది. పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొనేటప్పుడు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సూచన. ఉద్యోగంలో శ్రమను పొందుతారు. ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలు జరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో నిదానంగా వ్యవహరించుట సూచన అనవసరమైన విషయాలకు సమయం ఇవ్వకండి. మీ యొక్క ఆలోచనా సరళి కొంత మందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది సర్దుబాటు విధానం కలిగి ఉండుట అనేది మంచిది. బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది వారి ఆలోచనల విషయంలో మరొక సారి తరచి చూసుకోవడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు వద్దు.

మకర రాశి : ఈ వారంలో ఆర్థిక పరమైన విషయాల్లో మీదైన ముద్ర వేసే అవకాశం ఉంది. తల పెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయుట ద్వారా నలుగురిలో ఆశించిన విధంగా గుర్తింపును సంపాదించుకుంటారు. పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన భాద్యతలు పెరుగుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో ఒక వార్త మిమ్మల్ని కొంత భాధకు గురి చేసిన త్వరగా తేరుకునే ప్రయత్నం చేయుట వలన లబ్దిని పొందుతారు. జీవిత భాగస్వామి తో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి చేసిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సంతాన పరమైన విషయాల్లో మార్పులకు ఆస్కారం కలదు వాటికి కొంత సమయం ఇవ్వడం సూచన.

కుంభ రాశి : ఈ వారంలో మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం కలదు. మీ యొక్క వ్యవహార శైలి ఇతరులను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వ్యతిరేక వర్గం నుండి వచ్చిన ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు నలుగురిలో గుర్తింపు కోసం చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన ఆలోచనలు చేసే ముందు కొంత ఆలోచన చేయుట మంచిది. మాటలు జాగ్రత్తగా వాడుట వలన మేలు జరుగుతుంది. తొందర పాటు నిర్ణయాలు తీసుకోక పోవడం ఉత్తమం పెద్దలను కలిసి ముందుకు వెళ్ళక పోవడం మేలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.


మీన రాశి : ఈ వారంలో తల పెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం కలదు. పెద్దలతో కలిసి చేసిన చర్చలు ఒక కొలిక్కి వచ్చుటకు అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. భాద్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. బంధు వర్గం నుండి నూతన సమాచరం సేకరిస్తారు. వారితో కలిసి పని చేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన అవకాశాలకు ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి సమయం ఇవ్వడం వలన మేలు జరుగుతుంది.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు