అందలమెక్కిస్తున్న 'అందం'.! - ..

beauty parlour industry

ఏముంది ముఖానికి రంగేసేయడమే కదా. సింపుల్‌ అనుకుంటారు. కానీ అదెంత కష్టమో ఎంత ఇష్ట పడి దాన్ని ఫాలో చేయాలో అది చేసే వారికే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మేకప్‌ అనేది ఓ ఇష్టమైన ప్రొఫిషన్‌గా మారి పోయింది చాలా మందికి. మేకప్‌ లేకుండా ముఖ్యంగా అమ్మాయిలు బయటికి రావడం లేదు. ఇదివరకటి రోజుల్లో చాలా తక్కువ మంది అందులోనూ ధనిక మహిళలకే ఈ మేకప్‌ అనేది పరిమితంగా ఉండేది. మిగతా వారు ఎక్కువగా నేచురల్‌ బ్యూటీ తోనే దర్శనమిచ్చేవారు. అయితే ఇప్పుడలా కాదు, స్కూల్‌ పిల్లలు ఓ రకమైన మేకప్‌ వేసుకుంటే, కాలేజీ అమ్మాయిలు మరో రకం. వర్కింగ్‌ ఉమెన్‌ ఇంకో రకం. హౌస్‌ వైఫ్స్‌ కూడా మేకప్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. సోషల్‌ మీడియా ట్రెండ్‌ పెరిగిన ఈ తరుణంలో మేకప్‌ చేసుకోవడం అనేది చాలా సింపుల్‌ అయిపోయింది. ఇంట్లో ఉండే చాలా మంది మేకప్‌ కిటుకుల్ని ఫాలో అవుతున్నారు.
ఇక పోతే కాలేజీ అమ్మాయిలు టైం పాస్‌ కోసమో, లేక పాకెట్‌ మనీ కోసమో మేకప్‌ ఆర్ట్‌ని ఓ ప్రొఫిషన్‌గా ఎంచుకుంటున్నారు. ప్యాషన్‌తో ఇదే ప్రొఫిషన్‌లో కొనసాగుతున్న వారూ ఉన్నారు. ముఖ్యంగా బ్రైడల్‌ మేకప్‌కి బాగా డిమాండ్‌ ఉందిప్పుడు. పాత రోజుల్లో పెళ్లి కూతురు మేకప్‌ అంటే, అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పిన విధంగానే చీర కట్టు, జడ కట్టు పూల తీరు మొత్తంగా కట్టూ బొట్టూ ఇలాగే ఉండాలి అని పక్కా నియమాలుండేవి. కానీ ఇప్పుడలా కాదు, ట్రెండీ బ్రైడల్‌ మేకప్స్‌ని ఇష్ట పడుతున్నారు. అందు కోసం ప్రత్యేకంగా బ్యుటీషియన్స్‌ని ఎంచుకుంటున్నారు. అందుకోసం 500 రూపాయల నుండి 5000 రూపాయల వరకూ ప్యాకేజీల రూపంలో బ్యుటీషియన్లకు సొమ్ములు చెల్లిస్తున్నారు. మేకప్‌ అంటే అలాంటి ఇలాంటి మేకప్‌ కాదు, ఖరీదైన మేకప్‌ కిట్స్‌ని వాడుతున్నారు. ఆయా ఈవెంట్స్‌ని బట్టి అందుకు తగ్గట్లుగా మేకప్‌ చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్‌కి మాత్రమే మేకప్‌ ఆసిస్టెంట్స్‌ ఉండే వారు. కానీ ట్రెండ్‌ మారింది. ఇప్పుడు స్తోమత ఉండాలే కానీ, ఫ్యామిలీ డాక్టర్‌ లాగా, ఫ్యామిలీ బ్యుటీషియన్‌ని కూడా నియమించుకోవచ్చునన్న మాట.

వైద్యుల్లో స్పెషలిస్టులు మాదిరి గానే బ్యుటీషియన్స్‌లో కూడా స్పెషలైజేషన్స్‌ ఉన్నాయి. హెయిర్‌ స్పెషలిస్ట్‌. ఐబ్రోస్‌ స్పెషలిస్ట్‌. కాస్ట్యూమ్‌ స్పెషలిస్ట్‌.. ఇలా ఒక్కటేంటీ అన్నింట్లోనూ స్పెషలిస్టులున్నారు. అందుకే ఈ తరహా సేవల్ని అందించేందుకు ఆకర్షణీయమైన కొత్త కొత్త బ్యూటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అధిక ఆదాయం ఆర్జించే రంగంగా ఈ మేకప్‌ రంగం అభివృద్ది చెందుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా, బ్యుటీషియన్‌ వృత్తిని ఎంచుకునేందుకు ప్రత్యేకంగా ఆకర్షితులవుతోంది నేటి యువత. ట్రెండ్‌ని ఫాలో అవ్వాలంటే మేకప్‌ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే మేకప్‌ రంగానికి ఆదరణ ఎక్కువైంది. అన్నింట్లోనూ మంచీ చెడూ ఉన్నట్లే ఇందులోనూ కొంత మంచి, కొంత చెడు ఉంది. ఉపాధి కోసం కొందరు ఈ వృత్తిని ఎంచుకుంటుంటే, మరికొందరు ఈ వృత్తి పేరు చెప్పి, వాటి మాటున అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తప్పుడు దారుల్లో నడుస్తున్నారు. అలా కాకుండా, తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ రంగాన్ని ఉపాధిగా ఎంచుకుంటే అందమైన ఈ రంగం మరింత అందంగా కనిపిస్తుంది. ఆదాయంలో అందలమెక్కిస్తుంది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు