లక్ష్యం, వ్యక్తిత్వం, ఇదే విజయానికి మార్గం.! - ..

The goal, personality, the way to success!

'కౌషల్‌' ఇప్పుడీ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై గత 113 రోజులుగా ప్రసారమైన బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో వన్‌ ఆఫ్‌ ది కంటెస్టెంట్‌ ఈ కౌషల్‌. నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ రియాల్టీ షోకు విజేతగా నిలిచాడు కౌషల్‌. వివిధ రకాల మనస్తత్వాలున్న 17 మంది వ్యక్తులను గెలుచుకోవడంతో పాటు, అభిమానులను కూడా గెలుచుకోవాలి.. ఇదీ బిగ్‌బాస్‌ షో ఉద్దేశ్యం. అయితే బిగ్‌హౌస్‌లోని మనుషులను గెలిచుకోవడం సాధ్యం కాలేదు. కానీ ఎవరి అంచనాల్ని అందుకోలేని స్థాయిలో బయటి జనాల్ని గెలుచుకున్నాడు కౌషల్‌. ఓ స్టార్‌ హీరోకి ఉన్నంత ఫాలోయింగ్‌ అతి తక్కువ సమయంలో కౌషల్‌ సాధించేశాడు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా. లక్షలాది ప్రేక్షకుల అపారమైన అభిమానంతో బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు కౌషల్‌.

అసలు ఎవరు ఈ కౌషల్‌.? విశాఖ నుండి హైద్రాబాద్‌కి వచ్చిన ఈ కుర్రాడు జీవితంలో ఏదో సాధించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో సినిమాలు, మోడిలింగ్‌, టీవీ.. ఇలా వివిధ రంగాల్ని ఎంచుకున్నాడు. దక్షిణాదిన తొలి యాడ్‌ ఏజెన్సీ కౌషల్‌దే అనే విషయం అసలు ఎవరికీ తెలియదింతవరకూ. 5000కు పైగా మోడల్స్‌ని పరిచయం చేశాడు. 200కు పైగా ఫ్యాషన్‌ షోలు చేశాడు. లెక్కలేనన్ని కమర్షియల్‌ యాడ్స్‌ రూపొందించాడు. మెగా మల్టీ టాలెంటెడ్‌. ఇన్ని ఘనతలు సాధించిన కౌషల్‌, బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓ మామూలు వ్యక్తిగానే ఉన్నాడు. అందరూ తనను వేధిస్తున్నా, ధూషిస్తున్నా అవేమీ పట్టించుకోలేదు.తన ఆలోచన వేరు. టార్గెట్‌ వేరు. వీళ్లను మెప్పించలేం అనుకున్నప్పుడు వారి గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. తాను మెప్పించాల్సింది బుల్లితెర ప్రేక్షకుల్ని అనుకున్నాడు. దాంట్లో నూటికి నూటి శాతం సక్సెస్‌ అయ్యాడు కౌషల్‌. 17 మంది హౌస్‌ మేట్స్‌ మెచ్చకపోతేనేం. లక్షలాది మందిని కదిలించాడు. అపారమైన అభిమానం పొందాడు. ఇది అసాధారణమైన విషయం.

వ్యక్తిత్వం ఎంత గొప్పదైతే, ఆ వ్యక్తిత్వం చుట్టూ అంత ఎక్కువ అభిమానం ఉప్పొంగుతుంది. లక్ష్యం స్పష్టంగా నిర్దేశించుకుంటే, దాన్ని సాధించడానికి తగిన ఏకాగ్రత చూపించగలిగితే నువ్వే విజేతవి అని కౌషల్‌ నిరూపించాడు. ప్రధానంగా యువత, గెలుపంటే ఇదేరా అని కౌషల్‌ గురించి మాట్లాడుతున్నారు. బిగ్‌హౌస్‌లో ఆయన చూపించిన ఓర్పును మెచ్చుకోకుండా ఉండలేకపోతోంది నేటి యువత. అందుకే కౌషల్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ సంగతి పక్కన పెడితే, తన చుట్టూ ఉన్న వారు ఎలాంటి వారైనా మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో అనే విషయాన్ని కౌషల్‌ ద్వారా కొంచెమైనా నేర్చుకునే ప్రయత్నం చేశామని లైవ్‌లో నేటి యువత స్పందించడం విశేషం. మోడలింగ్‌ రంగం అంటే అంత ఆషామాషీ కాదు, సవాలక్ష సవాళ్లతో కూడుకున్నది. మన దగ్గర దీనికి అంతగా ఆదరణ లేదు. అయినా కౌషల్‌ అందులో రాణించాడు. అందుకే కౌషల్‌ జీవితం చాలామందికి ఆదర్శం. ఆ ఆదర్శమైన వ్యక్తిత్వమే కౌషల్‌ అంటే అందరూ అభిమానించేలా చేసింది. కౌషల్‌ వ్యక్తిత్వాన్ని మనకు ఆపాదించుకుంటే, జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు అనడంలో అతిశయోక్తి కాదనిపిస్తోంది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు