దిస్‌ ఈజ్‌ 'కిల్ఫీ': చావుతో 'సెల్ఫీ' - ..

This Is 'Kilpi': 'Selfie' with the Death

సాంకేతికత (టెక్నాలజీ)ను పునికి పుచ్చుకోవడంలో అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. చైనా సంగతి సరేసరి. భారతదేశం ఎప్పటి నుండో అభివృద్ది చెందుతూ ఉన్న దేశమే. ఇంకా మనది అభివృద్ధి చెందిన దేశం కాలేదు. కానీ ఓ విషయంలో మాత్రం ఇండియా అభివృద్ధిలో దూసుకుపోయింది. దురదృష్టం ఏంటంటే ఇది సెల్ఫీ మరణాల విభాగంలో. అమ్మాయిల దృష్టిని ఆకర్షించడానికో, అబ్బాయిల్ని పడేయడానికో, అమ్మాయిలు, అబ్బాయిలు సెల్ఫీల పిచ్చిలో పడి కొట్టుకుంటున్నారు మన దేశంలో. వినడానికి కష్టంగా ఉన్నా. ఇది వాస్తవం. 2011 నుండి 2017 మధ్యలో సంభవించిన సెల్ఫీల మరణాల లిస్టు తీస్తే భారతదేశానికి అగ్రస్థానం లభించింది.

చైనాలో కేవలం నలుగురే ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లో 11 మంది, అమెరికాలో 14 మంది రష్యాలో 16 మంది సెల్ఫీల కారణంగా చనిపోతే, ఇండియాలో 'సెల్ఫీ' అనే సైలెంట్‌ కిల్లర్‌ తీసేసిన ప్రాణాల సంఖ్య అక్షరాలా 159. సిగ్గుపడాల్సిన విషయమిది. రైలు దూసుకొస్తుండగా రైలు పట్టాలపై తలకాయ పెట్టి సెల్ఫీ తీసుకుంటాడో మూర్ఖుడు. ఎత్తైన ప్రదేశానికి వెళ్లి బోయ్‌ ఫ్రెండ్‌తో కలిసి అందమైన లొకేషన్‌ అంటూ లిప్‌ టు లిప్‌ కిస్‌ కోసం ప్రయత్నిస్తుందో మూర్ఖురాలు. సెల్ఫీ మరణాల్లో అత్యధికం ఇలాంటివే అని ఓ సర్వే పేర్కొంది. నిజానికి 2011 నుండి 2017 మధ్య కాలంలో సెల్ఫీల ట్రెండ్‌ క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత రెండు మూడేళ్లలో ఈ పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోయింది.

ప్రమాదంలో ఆనందం వెతుక్కోవడం పైశాచికత్వమే అవుతుంది. చస్తావ్‌ జాగ్రత్త..' అని ఎవరైనా హెచ్చరిస్తే, పోయేది నా ప్రాణమే కదా నీకెందుకా దురదా.. అని ఎగతాళి చేసే యువతీ యువకులు చివరికి ప్రమాదకర రీతిలో ప్రాణాలు కోల్పోతూ తల్లితండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లో ఫ్రంట్‌ కెమేరా ఉండడమే నేరమా అనే స్థాయికి సెల్ఫీ మరణాల తీవ్రత పెరుగుతోంది. అయినా డోంట్‌ కేర్‌. దేన్నైనా, ఎంత చెత్తగా వాడాలో మనకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అని చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నాం ఇలాంటి చర్యలతో. వాస్తవం ఏంటంటే, ఎంత జాగ్రత్తగా వాడాలో ఎంత అవసరానికి తగ్గట్టుగా వాడాలో అలా వాడేవారూ చాలా ఎక్కువ మందే ఉన్నారు. కానీ కొంత మంది వల్ల ఈ చెత్త రికార్డు భారత్‌ ఖాతాలో చేరింది. సెల్ఫీ మెమరబుల్‌ మూమెంట్‌ అవ్వాలి. కానీ మన ఫోటోకి మనమే దండేస్కునేలా ఉండకూడదు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు