నిజమైన భక్తుడు . - ఆదూరి.హైమావతి

nijamaina bhaktudu

ఒక పర్యాయం నారదుడు ‘ఓం నమోనారాయణాయ' అని నారా యణ నామజపం చేసుకుంటూ తన వాయిద్యమైన మహతి మీటు తూ, పాటలు పాడుతూ వైకుంఠంలో ప్రవేశించాడు. తన గాన మాధు ర్యా నికీ,తన భక్తికీ, నారాయణమూర్తి పరవసించి, ఆనందించి మెచ్చు కో వాలని , తనంత గొప్ప భక్తుడు మరెవ్వరూ లేరనీ కాస్తంత గర్వం మనస్సులో ప్రవేసించగా నారాయణుని దర్శించుకున్నాడు.

భగవంతుని స్థానం భక్తుల హృదయమే కనుక నారదుని మనస్సు లో ప్రవేసించిన ఆ రాకాసి ఐన గర్వాన్ని రూపుమాప తలంచి శ్రీమ న్నా రాయణుడు “ నారదా! నీ అంత భక్తుడు ఎక్కడా లేనేలేడు.నీవు నా కోసం ఒకపని చేసిపెట్టాలి. భూలోకములో అందరికంటే గొప్ప భక్తు డెవరో తెలుసుకొని వచ్చి ,నాకు చెప్పు,నీవు గొప భక్తునివి గనుక నిజమైన భక్తుని నీవే బాగా తెలుసుకోగలవు.” అని  కోరాడు.

నారదుడు నారాయణుని ఆన శిరసావహించి భూలోకానికి బయలు దేరే ముందు ''స్వామీ! భూలోకంలో ఎలాంటి వానిని నేను భక్తునిగా ఎన్ను కోవాలి? రాజునా, సేవకునా,మునినా,సన్యాసినా,పేదవానినా?" అని అడిగాడు.

శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు –' నారదా! ఎవరైతే పరిశుద్ధమైన హృదయం తో దైవనామాన్ని నిరంతరం స్మరిస్తూంటాడో అతనే నిజ మైన భక్తుడు. లోకసంబంధమైన వ్యవహారాలు ఎన్ని ఉన్నప్పటికీ లక్ష్యమును దైవంపై నిల్పుకోవాలి. మనస్సులో భగవంతుని రూపా న్నే ఉంచుకోవాలి. భగవన్నామాన్ని మరువరాదు.."అని వివరణ నిచ్చాడు.

అప్పుడు నారదుడు ''స్వామీ! నేను నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూనే ఉన్నాను కదా! మరి భూలోకంలో నాకంటే గొప్ప భక్తు డుంటాడా?దీనికోసం భూలోకం వెళ్లాలా? అని అడిగాడు.

నారదునిలో గర్వపు సోదరి అహంకారం కూడా చేరిపోయింది. 'నేనే అందరి కంటే గొప్ప భక్తుడను,' అని అనుకోవడమే పెద్ద అహంకారం. "నారదా!! భగవన్నామాన్ని జపించినంత మాత్రాన చాలదు. ఇలా నామ జపం చేసే  భక్తులు లోకంలో ఇంటింటిలో ఉన్నారు, అడుగ డు క్కూ  కనిపిస్తుంటారు. ఇది కాదు నిజమైన భక్తి. హృదయంలో ఆవిర్భవించిన ప్రేమను సర్వత్రా ప్రసరింపజేయాలి. మానవుడు భుజించిన ఆహారము పొట్టలో జీర్ణమై దాని సారం సర్వాంగాలకు రక్తం, ద్వారా సరఫరా ఐనట్లుగా, తాను హృదయములో స్మరించిన భగవన్నామం యొక్క దివ్య ప్రభావము కన్నులలో చేరాలి, చెవులలో చేరాలి, నాలుకపై చేరాలి, చేతులలో చేరాలి, పాదములలో చేరాలి. అన్ని అవయవాల్లో చేరిపోవాలి .

అప్పుడే మానవుడు నిజంగా భగవ న్నామమును స్మరించినవాడౌతాడు. లేకపోతే అదంతా ఒక సాధారణ కార్యం మాత్రమే. జీర్ణమైన ఆహారముయొక్క సారము కన్నులలో చేరి నప్పుడు ఏమౌతుంది? ఎలాంటి ఆహారమో అలాంటి దృష్టి కల్గుతుం ది. అలాగే, హృదయంలో స్మరించిన భగవన్నామం యొక్ కప్రభావం  కన్నులలో చేరినప్పుడు దృష్టి పవిత్రమైనదిగా రూపొందుతుంది , నాలుక పై చేరినప్పుడు పవిత్రమైన పలుకులనే పలుకుతాము; చెవు లలో చేరినప్పుడు పవిత్రమైన విషయాలనే వింటాము; పాదములలో చేరి నప్పుడు పవిత్రమైన ప్రదేశాలకే నడుస్తాము; చేతులలో చేరిన ప్పుడు సార్థకమైన పనులనే ఆచరిస్తాము. ఈరీతిగా, తనసర్వాంగము లతోను పుణ్య కర్మల నాచరించేవాడే నిజమైన మానవుడు. అలాంటి పరమ భక్తుడు ఎక్కడున్నాడో చూసి రమ్మ''ని చెప్పాడు.

నారదుడు భూలోకమంతా సంచారం చేశాడు. కాని, అతనికి తనను మించిన భక్తుడు లేడనే అహంకారం పోలేదు. తానే గొప్ప భక్తుడననీ, నిరంతరం భగవన్నామాన్ని ఉచ్చరించే వాడిని కనుక నాకంటే భక్తు డు మరొకడు ఉండడనే గర్వమూ చేరింది. ఆఇద్దరు సోదర రక్కసుల వలన , అపవి త్రమైన మనస్సుతో, 'దృష్టిని బట్టి సృష్టి' అన్నట్లుగా నారదుని కళ్ళకు,మనస్సుకు భక్తులెవ్వరూ కనిపించలేదు.

ఎవర్నిచూసినా మనస్సుకు తనకంటే భక్తులని తోచలేదు. ఇహ లాభం లేదు  వైకుంఠానికి తిరిగి వెళదామని అనుకుంటూండగా ,ఒక అరణ్యంలో ఒక చెట్టు క్రింద ఒక వ్యక్తి కన్నులు మూసుకొని నామస్మర ణ చేస్తూ కనిపించాడు.

ఐతే అతని చేతిలో ఒక పదునైన కత్తి కనిపించింది. నారదునికి ఆశ్వర్యంకలిగింది,ఆదేవముని అతని దగ్గరకు వెళ్ళి, ''నాయనా! నీవెవరు?'' అని అడుగుతాడు.

" స్వామీ! పరమాత్ముని భక్తుడను," అన్నాడాతడు.

నారదుడు “ఇక్కడ నీవేం చేస్తున్నావు ?” అని మరలా అడగ్గా , "అత డు భగవన్నామాన్ని జపిస్తున్నాను"అంటాడు.

నారదుడు  మరింత ఆశ్చర్యంగా "మరి నీవు భక్తుడివైతే నీ చేతిలో కత్తి ఎందుకు? ఎవరిని చంపడంకోసం పెట్టుకున్నావు?భక్తులుఅహిం సావర్తనులు కదా!"  అని అడిగాడు.

"స్వామీ! ఈ కత్తితో నేను ఇతరులెవ్వరినీకానీ, అడవి మృగాలనుకానీ సమ్హరించను.దీంతో నేను  పరమదుర్మార్గులైన నల్గురిని చంపాలి, వారి కోసం కాచుక్కూర్చున్నాను" అన్నాడు.

నారదుడు ఇంకా ఆశ్చర్యంగా "ఎవరా నల్గురు? " అని అడిగాడు

"మొట్టమొదట ఆ ద్రౌపదిని చంపాలి,'' అన్నాడాతడు.

ఆ బ్రహ్మ మానసపుత్రుడు  అచ్చెరువంది "అదేమిటి!  ద్రౌపదినిరం తరం కృష్ణనామాన్నే స్మరిస్తుంది  కదా! ఆమె భక్తికి మెచ్చి కృష్ణుడు ఆమెకు అక్షయ వలువలిచ్చి, కౌరవ సభలో ఆమె మానం కాపాడాడు కదా! అరణ్య వాస సమయంలో దుర్వాసుని శాపం నుంచీ కాపాడాడు. అజ్ఞాతవాస సమయానా కంటికి రెప్పలా కాచాడు. అలాంటి మహా భక్తు రాలిని ,మీదు మిక్కిలి కృష్ణుని సోదరిని ఎందుకు చంపాలను కుంటున్నావు?" అనిఅడిగాడు.

"ఆమె భక్తురాలే కావచ్చు.కృష్ణు నీసోదరే కావచ్చు. కాని, నా కృష్ణుడు భోజనం చేస్తున్న సమయంలో 'కృష్ణా!' అని పిలుస్తుంది. నాకృష్ణుడు నిద్రించే సమయంలో 'కృష్ణా!' అని కేకవేస్తుంది.తక్షణమే నా స్వామి తన ఆహారాన్ని, నిద్రను  వదలిపెట్టి ఆమెను రక్షించడానికి వెళతా డు. ఆ రోజు ఇహ నా కృష్ణుని కి భోజనం ఉండదు,నిద్రా ఉండదు. ఇ లా ఎన్నో మార్లు ఎప్పుడంటే అప్పుడు నాకృష్ణునిపిలుస్తూఉంటుంది . ఇబ్బంది పెడుతుంటుంది . కాబట్టి, ఆమెను చంపాలి,అప్పుడు కానీ నాస్వామి కడుపు నిండాతిని, కంటినిండా నిద్రపోడు" అన్నాడు.

నారదుడు , ఇంకా మిగతా ముగ్గురెవరో తెల్సుకోవాలన్న ఉత్సుకత తో,"సరే మరి,రెండవ వ్యక్తి ఎవరు?" అని అడిగాడు.

" ఉన్నాడులే ఒకడు. వాడే ఆ ప్రహ్లాదుడు .పదేపదే నా స్వామిని పిలిచి చాలా ఇబ్బంది పెట్టాడు. తన తండ్రి తనను ఏనుగులచేత త్రొక్కించేప్పుడు 'నారాయణా!' అని పిలిచాడు. అతనిని రక్షించ డా నికి నారాయణుడే ఏనుగులచేత త్రొక్కించుకున్నాడు. అలా ఎన్నో తండ్రి పెట్టే బాధలన్నింటికీ నారాయణుని పిలవడం ఆయన ప్రహ్లా దుని బదులుగా తనే ఆబాధలన్నీ భరించడం జరిగింది. ఈ రీతిగా నా స్వామిని కష్టపెట్టినందుకు ప్రహ్లాదుణ్ణి చంపాలి,'' అన్నాడు.

నారదుడు మరింత ఆశ్చర్యంగా "మరి మూడవ వ్యక్తి ఎవరు?"అని అడిగాడు. దానికా వ్యక్తి  "మీరా! నిరంతరం 'గిరిధారీ! గిరిధారీ!' అనిస్మరించి నా స్వామిని చాలా బాధపెట్టింది. ఆమెకు తగల వలసిన దెబ్బలన్నీ నా కృష్ణునికే తగిలాయి. కనుక, ఆమెను కూడా చంపాలి," అన్నాడు.  నారదుడు మరింత ఆసక్తితో “ సరి సరి,ఇంక నాల్గవ వ్యక్తి ఎవరు?" అని అడిగాడు.

"నారదుడనేవాడు ఒకడున్నాడు; చేతిలో తంబుర పట్టుకొని నిరం తరం 'నారాయణ! నారాయణ!' అని అంటూంటాడు. అతనిది స్వార్థ భక్తియేగాని , ప్రేమతోకూడిన పరార్థభక్తి కాదు . తానే గొప్ప భక్తుడినని భావిస్తూ నిరంతరం నా స్వామిని నిద్ర, ఆహారం కూడా లేకుండా చేస్తుంటాడు. కాబట్టి, అతనిని కూడా చంపాలి, అప్పుడుకానీ నా స్వామి హాయిగా భుజించి, కంటి నిండా నిద్రపోడు" అన్నాడు.

అతని మాటలు విని నారదుడు భయపడ్డాడు. తానే నార దుడని తెలిస్తే తక్షణం తన శిరస్సును ఆపదునైన ఖడ్గంతో ఆతడు ఒక్క వేటుకు ఖండిస్తాడని భావించాడు. తన గర్వాహంకారలే దీనికి కారణమని గుర్తించాడు. తనమనస్సులో చేరిన అహంకారం, గర్వం అనే  రెండు రాకాసులనూ తరిమేశాడు. వెంటనే శ్రీమన్నారా యణు నివద్దకు వెళ్ళి ఈవిషయాన్ని విన్నవించుకున్నాడు.

''స్వామీ! నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం కూడా భగవంతు ణ్ణి కష్ట పెట్టినట్లేనా?'' అని అడిగాడు.

నారాయణుడు ''నీవు చాలా పొరబడుతున్నావు నారదా! భగవంతు ని పట్ల  గల అనన్యప్రేమచేత అతడు ఈ విధంగా భావిస్తున్నాడు. భక్తులు భగవంతునికి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారని, ఇబ్బం ది కల్గిస్తున్నారని అతను బాధపడు తున్నాడు. భగవంతుని సుఖమే తన సుఖమని భావించి, సర్వకాల సర్వావస్థలయందు భగవంతునికి ఆనందము కల్గించాలి. దేహానికిగాని, మనస్సుకుగాని ఏ కించిత్ బాధ కూడా కల్గించకూడదు. అలాంటివాడే నిజమైన భక్తుడు'', అన్నాడు.

నారదుడు సత్యాన్ని గుర్తించి ''స్వామీ! నా లో ప్రవేశించిన గర్వ అహంకారాలను  అణగ ద్రొక్కడానికే నీవు నాకీ పని పెట్టావు'', అని నమస్కరించాడు నారదుడు.

మనలో ఎంతటి భక్తి ఉన్నప్పటికీ, భగవంతుని మనస్సుకు కించి త్తై నా కష్టం కలుగకుండా చూసుకోవాలి. ప్రతి వ్యక్తిలో భగవంతుడున్నా డని విశ్వసించాలి. ఎవ్వరినీ మాటలతోకానీ, చేతలతో కానీ బాధించ రాదు. భగవంతుడు తనలో ఏ మాత్రం  బాధపడినా అది మనకు బాధనే కలిగిస్తుంది. భగవంతుని సుఖమే మన సుఖము. మన సుఖ మే భగవంతుని సుఖము. ఈ రెండింటి ఏక త్వాన్నిసమన్వయ పర చుకుని గుర్తించాలి

''నేను, భగవంతుడు ఒక్కటే,'' అనే సత్యా న్ని గుర్తించాలి, అనుభ వించాలి. ఈనాడు  భక్తులమని చెప్పుకునే  చాలామంది కేవలం స్వార్థ భక్తినే అనుసరిస్తున్నారు. వారి సుఖమే వారికి కావాలి. దైవము సంగతి వారి కక్కర్లేదు. దైవము ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ అందరి యందు ప్రసరిస్తున్నది , అని గుర్తించి,వర్తించాలి. ఆ ప్రేమనుమనం ఇతరులతో పంచుకోవాలి. ఇదియే భగవంతుడు కోరేది.   

చిదానంద మూర్తి ఐన నారాయణుడు, భక్తుల మనస్సులను ఎప్పటి కప్పుడు పరిశుభ్రపరిచే పరమ దైవమైన నారాయడుడు చిరునవ్వుతో నారదుని సాగనంపాడు.

కనుక భక్తుడెవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఎవ్వరికీ తెలీదు. పూజలు చేసినంతమాత్రాన, నామస్మరణ చేసినంతమాత్రాన, దాన ధర్మాలు చేసినంతమాత్రాన భక్తులుకారు.అవన్నీ మన పాపాలను కడుక్కోనే , పరిశుధ్ధహృదయాన్నే భగవంతుడు గుర్తిస్తాడు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు