సొంతింట్లో 'బోర్‌' కొంచెం కొత్తగా 'హుషార్‌'.! - ..

house

కుటుంబ వ్యవస్థల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకటి రోజుల్లో పండుగలు, సెలవు దినాల్లో చక్కగా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి మెలసి కాలం వెల్లబుచ్చేవాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఎప్పుడో చరమ గీతం పాడేశాం. అన్నీ చిన్న కుటుంబాలే. వీకెండ్స్‌ వచ్చినీ, పండగలొచ్చినా ఆ నలుగురి మధ్యే. ఆ నాలుగు గోడల మధ్యే. ఇదీ మన ఈ బిజీ లైఫ్‌లో సాగుతున్న తంతు. అలా గిరి గీసుకుని అందులోనే బతికేస్తున్నాం. అయితే ట్రెండ్‌ పేరు చెప్పి, ఎంజాయ్‌మెంట్స్‌ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ కొన్ని కొన్ని కొత్త ఆలోచనలకు అంకురార్పణ జరుగుతోంది. ఎప్పుడూ ఒకే ఇల్లు. ఒకే గోడలు, ఒకే మనుషులు బోర్‌ కొట్టేయదు. అందుకే అప్పుడప్పుడూ వెకేషన్‌కి వెళుతుంటాం. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? కానీ ఉంది. 'వెకేషన్‌'కి కొత్త మీనింగ్‌ చెబుతున్నారిప్పుడు. అదేంటో తెలుసా 'స్టేకేషన్‌'.

అసలేంటీ 'స్టేకేషన్‌'.? అక్కడికే వచ్చేద్దాం. సొంతిళ్లు బోర్‌ కొట్టినవారికి వీకెండ్స్‌లో చక్కగా రెండు రోజులకు సరిపడా బ్యాగు సర్దేసుకుని అలా సిటీ ఔట్‌ కట్స్‌లోకి వెళ్లిపోయి, అక్కడున్న హోటళ్లు, రిసార్ట్స్‌లో ఓ రూమ్‌ని బుక్‌ చేసుకుని, చక్కగా ఫ్యామిలీతో ఆ రెండు రోజులు అక్కడే ఎంజాయ్‌ చేయడమన్న మాట. ఇది పాత పద్ధతే. కానీ పేరు మారింది అనుకుంటున్నారా? పోనీ అలాగే అనుకోండి కానీ, ఈ మధ్య ఈ స్టేకేషన్‌కి బాగా పాపులారిటీ దక్కుతోంది. కొత్త వాతావరణం, కొత్త లొకేషన్‌, అన్నింటికీ మించి కొత్త ఇల్లు కావాలనుకున్నవారికి ఈ వెకేషన్‌ సారీ స్టేకేషన్‌ ఎంతో అనుభూతినిస్తోంది. అందుకే ఈ దిశగా రిసార్ట్స్‌, హోటల్స్‌లో ఫ్యామిలీస్‌ కోసం ప్రత్యేక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఇంట్లో బోర్‌ కొట్టిందని ఎక్కడో ఉన్న విలేజ్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేయలేని వారికి ఈ స్టేకేషన్‌ ఎంతగానో తోడ్పడుతుంది. అన్నిరకాల సదుపాయాల్ని ఈ హోటల్‌ రూమ్స్‌లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటి, లేదా రెండు రోజులు ఫుల్‌గా ఆ కొత్త వాతావరణంలో ఎంజాయ్‌ చేసి, తర్వాతి రోజు తమ విధులకు ఫ్రెష్‌గా హాజరవుతున్నారు. ఈ స్టేకేషన్‌కి హాలీడేస్‌ అవసరం లేదు. అలసిపోయే అవకాశమూ లేదు. మనం ఉండే నివాసాలకు అతి కొద్ది దూరంలో, అందుబాటైన దూరంలోనే ఈ రిసార్ట్స్‌, హోటళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అందుకే యువతతో పాటు, ఫ్యామిలీస్‌ కూడా ఈ కొత్త టెక్నాలజీని అలవాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మామూలుగా మనం ఏ పిక్నిక్‌కో, లాంగ్‌ టూర్‌కో వెళ్లాలన్నా ఇదే తీరును అప్లై చేయొచ్చు. కానీ పూర్తిగా ఇంటి నుండి దూరంగా, ఇంచుమించు ఇంటి వాతావరణం కోరుకునే వారికి ఈ స్టేకేషన్‌ బాగా తోడ్పడుతోందట. వీలైతే, లెట్స్‌ ట్రై దిస్‌ 'స్టేకేషన్‌' బాస్‌.! 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు