సోషల్‌ 'రౌడీస్‌'కి పొలిటికల్‌ హెచ్చరిక.! - ..

Political Warning for Social 'Rowdies'!

ఎన్నికలొస్తున్నాయ్‌. వివిధ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వారికి సోషల్‌ మీడియా ఎంతగా ఉపయోగపడుతోందో అందరికీ తెలుసు. కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకుని మరీ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ పాపులారిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండడం చూస్తున్నాం. ఈ కొత్త ట్రెండ్‌తో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలూ లభిస్తున్నాయి. చిన్న చిన్న పార్టీల నుండి జాతీయ పార్టీల వరకూ సోషల్‌ మీడియా టీమ్స్‌ మీద చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సర్వేలు చేయడం, ఆయా పార్టీలకు ప్రచారం సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం, ప్రత్యర్ధుల ఇమేజ్‌ని తగ్గించేలా సోషల్‌ మీడియాలో పలు ప్రచారాలు నిర్వహించడం ఈ టీమ్స్‌ చేసే పని. దాంతో ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత అవకాశాలు దొరుకుతున్నాయి కదా అని ఆ తరహా పనుల వైపు ఆశక్తి చూపిస్తోంది.

నాణానికి చెరో వైపు అన్నట్లుగా ఇక్కడా మంచీ, చెడూ ఉంటాయి. ఓ పార్టీకి అనుకూలంగా సోసల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం ఇబ్బందికరమేమీ కాదు. కానీ ఇంకో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎప్పుడూ రిస్కే. సాధారణంగా పార్టీలు పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి ఇలాంటి పనుల కోసం. ఆయా సంస్థల ద్వారా నెగిటివ్‌ ప్రచారానికి దిగితే కష్టాలు తప్పవు. వ్యక్తులు కావచ్చు, పార్టీలు కావచ్చు, చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తూ కేసుల్లో ఇరుక్కుంటే ఏ రాజకీయ పార్టీ ఆదుకోదు. పైగా ఈ కేసులు జీవితం మీద పెద్ద మచ్చ వేసేస్తాయి. ఇవేమీ పర్మినెంట్‌ ఉద్యోగాలు కావు కాబట్టి, భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ముందే జాగ్రత్తపడాలి.

ఆకర్షణీయమైన ప్యాకేజీలు, వేతనాలతో యువతకు రాజకీయ నాయకులు, పార్టీలు గాలమేస్తున్న సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దుష్ప్రచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న ఘటనల్నీ చూస్తున్నాం. సో ఇలాంటి పనులకు ఉపక్రమించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా తమ సరదా కోసం కావచ్చు, తమ రాజకీయ అవగాహన మేరకు కావచ్చు చేసే పోస్టింగ్స్‌ కూడా ఇతరుల్ని ఇబ్బంది పెట్టేలా, తద్వారా తాము ఇబ్బందుల్లో పడేలా ఉండకూడదు. చేతిలో మొబైల్‌ ఫోన్‌ ఉంటే చాలు ఏదైనా చేసేయొచ్చు. ఆ తర్వాత తప్పించుకోవచ్చు అంటే మాత్రం పప్పులుడకవ్‌. ఇలాంటి కేసుల్లో అరెస్టు అవుతున్న వారంతా 18 నుండి 25 ఏళ్ల మధ్యలో ఉన్న యంగ్‌స్టర్సే. సో బీ కేర్‌ ఫుల్‌.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు