స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రతీదీ ఈజీ అయిపోయింది. ఈజీ షాపింగ్‌లాగా ఈజీ ఎర్నింగ్ మనీకి అలవాటు పడిపోతున్నారు. ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసేయడం అనే మాట బాగానే ఉంది. కానీ ఆన్‌లైన్ ట్రాన్స్‌లేషన్‌లో తలెత్తుతున్న ఇబ్బందుల్ని సైబర్ క్రైమ్స్‌ని మర్చిపోతున్నారు. ప్రతీరోజూ వీటికి సంబంధించిన ఎన్నో వార్తలు వింటూనే, చూస్తూనే ఉన్నా కానీ ప్రోబ్లమ్ మాది కాదు కదా మనకేంటీ.? అన్న చందంగా సింపుల్‌గా లైట్ తీసుకుంటున్నారు. అందుకే ఆన్‌లైన్ మోసాలకు కొదవే ఉండడం లేదు. ఆ తరహాలో మోసగించాలనుకునేవారికీ, ఈజీగా మనీ సంపాదించాలనుకునే వారికి టార్గెట్ అంత సులభమైపోతోంది. ఆన్‌లైన్ మోసాలకు చదువుకున్న వారు, చదువు లేని వారు అనే తేడా అస్సలు లేదు. ఈ రకమైన మార్గాలను అన్వేషించిన వారు వేసే గాలానికి ఎంతో సులభంగా బుట్టలో పడిపోతున్నారు.
ఉన్నత స్థాయి ఉద్యోగాలను సైతం వదిలేసి ఆన్‌లైన్ మోసాలకు బరి తెగించేస్తున్నారంటే ఏముందో అసలు ఈ ఆన్‌లైన్ బిజినెస్‌లో. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. నెలకు లక్షల్లో జీతం. హ్యాపీ లైఫ్. కానీ అది చాలక సైబర్ క్రైమ్స్‌కి పాల్పడుతున్న వారు కొంంతమంది అయితే, అసలు ఉద్యోగం లేక ఏదో ఒక రకంగా కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే నెపంతో ఈ రకమైన ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నవారు ఇంకొంతమంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మోసగించేవారు మరికొంతమంది. ముఖ్యంగా యువతే ప్రధాన లక్ష్యంగా నేరగాళ్లు ఈ సైబర్ క్రైమ్స్‌కి పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు అభ్యసించి, ఆశించిన ఉద్యోగాలు రాక కొందరు పెడదారిన పడుతుంటే, వచ్చిన ఉద్యోగాలు తమ లగ్జరీ లైఫ్‌కి సరిపోక అదనపు ఆర్ధిక ఆర్జన కోసం ఇంకొందరు అడ్డదార్లు తొక్కుతున్నారు.
ఓ సర్వే ప్రకారం తేలిందేంటంటే, అత్యధికంగా నిరుద్యోగ యువత ఈ మోసాలకు పాల్పడే వారిలో ముందుంటోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వీరి మోసాలకు బలయ్యేది కూడా నిరుద్యోగ యువతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంత మొత్తంలో జీతాలంటూ ప్రకటనలు వేస్తారు. ఆ ప్రకటనలకు ఎట్రాక్ట్ అయిన నిరుద్యోగులు సదరు వ్యక్తుల్ని కాంటాక్ట్ చేయగా, ఇంత అమౌంట్ ఇస్తే, మీకు పలానా ఉద్యోగం గ్యారంటీ. ఇంత టైంలో మనీ కట్టేయాలి అంటూ తొందరపెడతారు. అసలే నిరుద్యోగంతో సతమతమవుతున్న యువత ఉద్యోగం వస్తుంది కదా అని అప్పులు చేసో, ఆస్థులు జమ చేసో ఆ డబ్బు కట్టేస్తారు. చివరికి వారికి మిగిలేది ఆ అప్పుల తిప్పలే తప్ప అక్కడ ఏ ఉద్యోగాలూ ఉండవు. రైల్వేలో జాబ్ అట, సెంట్రల్ కంపెనీస్‌లో జాబ్స్ అట. ఫలానా సాఫ్ట్‌వేర్ కంపెనీ జాబ్ అట అంటూ ఇలా యువతను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఎవ్వరినైనా ముంచేయగలం అని భావిస్తున్నారు. అదే స్మార్ట్ ఫోన్ ఆధారంగా చేసుకుని ఉద్యోగాలకు ఎరవేస్తున్నారు.
సో ఇలాంటి కేటుగాళ్ల నీటు మాటలకు పడిపోవద్దు. టాలెంట్ లెక్క చేయకుండా, డబ్బుకే విలువ ఇచ్చే ఏ వ్యవహారంలోనూ నిజముండదు. అలా అని అన్ని సంస్థల్నీ తప్పు పట్టలేం కానీ, డబ్బులు చెల్లించి ఉద్యోగాలు ఎర చూపే కేటుగాళ్ల మాటలతో జర భద్రం గురూ.!