ప్రతాపభావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

‘సెల్’ ఫీ..కెమెరా

ఒకప్పుడు ఫోటో తీయించుకోవాలంటే గగనం.

ఫోటో తీయించుకోవాలంటే ప్రణాళికలేసుకోవాల్సిందే! అంత కాస్ట్లీ అఫ్ఫయిర్.

ఇహ ఫోటోలు తీయాలంటే అదో ఖరీదైన హాబీ! మధ్య తరగతికి అందని ద్రాక్ష!

ఇప్పుడు అనూహ్యమైన సాకేతికాభివృద్ధితో సెల్ ఉన్న ప్రతి చేతిలోనూ కెమెరానే. ప్రతి వ్యక్తీ కెమెరామ్యానే!

సెల్ ఫోన్ మ్యాన్ ఫాక్చర్స్ కూడా సెల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం అన్నది పక్కన పెట్టి కెమెరాలనీ, తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడానికి ఉన్న సేలియంట్ ఫీచర్స్ నూ ఊదర్గొట్టేస్తున్నారు.

సరే ఇదిలా ఉంటే..

గుడి, బడీ..అన్నది లేకుండా ఎక్కడ బడితే అక్కడ, ఎలా బడితే అలా ఫోటోలు ఎడా పెడా తీసేసుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకోడానికి యమా తాపత్రయపడిపోతున్నారు.

ఎక్కడన్నా యాక్టర్లూ, సెలెభ్రిటీలు ఫంక్షన్లకు, ఓపెనింగ్ లకు వస్తే ఎన్ని సెల్ ఫోన్లు ఫోటోల కోసం, సెల్ఫీల కోసం గాల్లోకి లేస్తాయో.

ఎక్కడకన్నా వెళ్లినప్పుడు ఆయా ప్రదేశాల్లో సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదని నిషేధ ఆజ్ఞలు జారిచేసి ఉంటే గాలి తీసిన బెలూన్లా జావగారిపోతారు. ఎలా అయినా సెల్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాలని ఉవ్విళ్ళూరతారు.

సెల్ ఫోన్ అన్యాయాల్ని, అక్రమాల్ని బయట పెట్టేలా ఉపయోగపడుతున్నందుకు ఆనందించాలో లేక ఏ మూల నుంచి ఎవరు మనల్ని ఏ భంగిమలో ఫోటో తీసి ఎక్కడ ఎలా ప్రదర్శనకు పెడతారో అన్న బెంగతో ఉంటున్నందుకు బాధపడాలో అర్థంకాని అయోమయ పరిస్థితి. మనం చేసే పని మరొకడూ చేస్తాడన్న అవగాహన మనకు ఉండాలి. పిచ్చి ముదిరి పాకాన పడక ముందే మనను మనం నియంత్రించుకోవాలి.

ఎవరన్నా సెలభ్రిటీకి యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినా, ‘పోయినా’ అక్కడ కూడా జనం సెల్ఫీలు తీసుకోడానికి కుతూహలపడుతున్నారంటే ఏవనుకోవాలి. మొన్నొక హాస్పిటల్లో సెలెభ్రిటీ శవం పక్కన సెల్ఫీలు తీసుకుని మీడియాలో పెట్టారంటే పిచ్చి ఏ లెవెల్ కి ముదిరిందో అర్థం చేసుకోవచ్చు.

సెల్ ఫోన్ లో ఉండే యాప్ ఫెసిలిటీస్ తో మనను మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ముందడుగేయొచ్చు.. ఇది ఒక పార్శ్వం అయితే, ఇంకో పార్శ్వంలో పూర్తిగా మనం ప్రైవసీ కోల్పోయామనే చెప్పాలి.

సెల్ఫోన్ మన ఆక్సిజన్ అయిపోయింది. ఎవరిదన్నా సెల్ఫోన్ క్షణం కనిపించకపోతే ఇహ వాళ్లకి పిచ్చి పట్టినట్టే.

మన కానసంట్రేషన్ అంతా సెల్లే..దానికి మనని మనం బంధీ చేసుకుంటున్నాం.

చదువుకుని పైకి రావాల్సిన పిల్లలు, యువత సెల్ఫోన్ బానిసలవుతున్నారు. విలువైన సమయం కోల్పోతున్నారు.

ఏమో మనం ఎక్కడికి పోతున్నామో..ముందు ముందు ఏం జరుగుతుందో ఆ సెల్లుకే ఎరుక(ఒకవేళ దానికో యాప్ ఉంటే)!

***

 

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు