మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈ వారం పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. చర్చల్లో అధికంగా పాల్గొంటారు. సమయాన్ని సాధ్యమైనంత వరకు వృధా చేయకండి. విలువైన వస్తువులను నస్టపోయే అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో మొండి నిర్ణయాలు తీసుకోవడం వలన పనులు ముందుకు సాగుతాయి. విదేశీ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వాటికీ అనుగుణంగా నడుచుకోండి.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈ వారం కుటుంబంలో శుభ కార్యక్రమాల గురుంచి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. సోదరుల నుండి కావల్సిన సహకారం లభిస్తుంది. సంతానం నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి. తొందరపాటు ఆలోచనలు వద్దు, కాస్త నిదానంగా ముందుకు వెళ్లడం మంచిది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. దూర ప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. రావల్సిన ధనం చేతికి అందుతుంది.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈ వారం మిత్రుల నుండి ముఖ్యమైన సహకారం లభిస్తుంది, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయ వంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి, పెద్దల నుండి ఆశించిన మేర గుర్తింపును అదే విధంగా సహకారం పొందుతారు. నూతన ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు లేదా ఖర్చులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీ లేదా పురుష సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. సంతానం గురుంచి ఆలోచనలు కలిగి ఉంటారు, వారి కోసం సమయాన్ని కేటాయిస్తారు.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈ వారం ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎవరి తోను మాట పట్టింపులకు వెళ్ళకండి. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మాట పట్టింపులకు వెళ్ళకండి, అలాగే ఆత్మీయులను కోల్పోకండి. కుటుంబ పరమైన విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. అనుకోకుండా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో విభేదాలు ఏర్పడుతాయి.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈ వారం ఆరంభంలో ఒకింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో పెద్దల, లేదా అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు లభిస్తాయి, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. చర్చల్లో సమయాన్ని గడుపుతారు.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈ వారం మొత్తం మీద చేపట్టిన పనుల్లో సంతృప్తి కరమైన ఫలితాలు పొందుతారు. పెద్దల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి కీలకమైన సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. వ్యాపార పరమైన విషయాల్లో పెద్ద పెద్ద పెట్టుబడుల కన్నా చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. కుటుంబ పరమైన విషయంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వద్దు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈ వారం ఆరంభంలో పెద్దల నుండి మాటలను పడవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు చర్చలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మీ మాట తీరు మూలన నూతన సమస్యలు వచ్చే ఆస్కారం కలదు, జాగ్రత్త. కుటుంబంలో వివాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి సంతృప్తి కరమైన సహకారం లభిస్తుంది, మీ ఆలోచనలను తెలియ జేయటం మంచిద
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈ వారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మీ మాట తీరును కొన్ని విషయాల్లో సరి చూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వారం మద్యలో ఒకింత ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. సంతానం వలన పెద్దలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో తొందర పాటు వద్దు. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట అన్నివిధాలా మేలు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడుతుంది.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈ వారం సాధ్యమైనంత వరకు ఆరంభంలో చర్చలు చేయకండి. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేపట్టు పనుల విషయంలో అవగాహన లేకపోతే నూతన సమస్యలు వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందక పోవచ్చును. వ్యాపార పరమైన విషయంలో వేచి చూసే ధోరణి మంచిది అలాగే శ్రమించుట ద్వారా మేలు జరుగుతుంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. దూర ప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈ వారం కుటుంబ పరమైన విషయాల్లో పెద్దల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి, వారం చివరలో చేయాల్సి వస్తుంది. మీ మాట తీరును మీ అనుకున్నవారే వ్యతిరేకించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో అనుకోకుండా వివాదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సోదరులతో చేపట్టిన చర్చలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈ వారం ఉద్యోగంలో అధికారుల నుండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు, కాకపోతే కొంత మేర ఒత్తిడి ఉంటుంది. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడే ఆస్కారం కలదు. గతంలో చేపట్టిన పనులను నలుగురి సహకారం తీసుకోవడం ద్వారా పూర్తి చేయవచ్చును. సంతానం వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. దూర ప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు.
ఈ వారం ఎవరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు అవసరం. చేపట్టిన పనులను నిదానంగా పూర్తి చేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందక పోవచ్చును. స్వల్ప అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. సమయానికి భోజనం చేయుట సూచన. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆత్మీయులను కలుస్తారు, వారి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. దైవ పరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం