సింపుల్‌ వర్కవుట్స్‌ ట్రై చేస్తే పోలా.! - ..

simple workouts

లావుగా ఉన్నవాళ్లకే కొవ్వు కరిగించుకోవడం అవసరం అనుకుంటే పొరపాటే. సన్నగా ఉన్నవాళ్లకీ వ్యాయామం అవసరమంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండలన్నా, అందంగా కనిపించాలన్నా ఫిట్‌నెస్‌ ఎంతో అవసరం. ఆ ఫిట్‌నెస్‌ పొందాలంటే వ్యాయామం ఒక్కటే మార్గం. అయితే ఉరుకుల పరుగుల జీవితం. క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాం. ఇలాంటి సిట్యువేషన్స్‌లో వ్యాయామానికి ఎక్కడ టైం దొరికేది. ఎలా ఉంటే అలాగే ఉంటుంది లైఫ్‌. ఇట్స్‌ గోయింగ్‌ ఆన్‌ అనుకుని కాలం వెల్లబుచ్చేస్తే కుదరదంటున్నారు ప్రముఖ వ్యాయామ నిపుణులు. అందకే ఏదో అలా బతికేయడమేంటీ.? బతికినన్నాళ్లు ఆరోగ్యంగా బతికితేనే కదా ఆ బతుక్కి అర్ధం అంటోంది నేటి యువత. అందుకే ఇంత బిజీ లైఫ్‌లోనూ వ్యాయామం కోసం కూడా ప్రత్యేకంగా కొంత టైమ్‌ని కేటాయిస్తోంది. ఆర్ధికంగా స్తోమత ఉన్నవాళ్లు వేలు ఖర్చు పెట్టి జిమ్స్‌లో వర్కవుట్స్‌ చేస్తుంటే, ఆ స్తోమత లేని వాళ్లు సహజ పద్థతుల్లో కూడా వ్యాయామాలు అవలంభిస్తున్నారు.

ఉద్దేశం ఏదైనా సరే, అమ్మాయిలు, అబ్బాయిలు వ్యాయామానికి ఇంపార్టెన్స్‌ ఇస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమే. అమ్మాయిలు సన్నగా నాజూగ్గా, మెరిసి పోవడానికి, అబ్బాయిలు ఫిట్‌ బాడీతో ఎట్రాక్టివ్‌గా కనిపించడానికి ఇలా ఉద్దేశం ఏదైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆరోగ్యానికి దోహద పడే ఆలోచన చేస్తున్నారు. వ్యాయామం వల్ల శరీరంలో ఫీల్‌ గుడ్‌ హార్మోన్స్‌ రిలీజ్‌ అవుతాయి. అవి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అంతే కాదు, కొవ్వు కరగడంతో పాటు, చెమట రూపంలో శరీరంలోని వ్యర్ధాలు బయటికి వచ్చేస్తాయి. చర్మం లోని మృతకణాలు తొలిగి పోతాయి. దాంతో చర్మం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే, శారీరకం గానూ ఆరోగ్యంగా ఉన్నట్లే. అందు కోసం తెగ కష్టపడి చేసే వర్కవుట్టే చేయక్కర్లేదు. సింపుల్‌గా ప్రాణాయామం చేస్తే సరి పోతుందట. అలాగే సింపుల్‌ వ్యాయామంతో పాటు ఆహార జీవన శైలిలో కాస్త మార్పులు చేసుకోవాలి. టైంకి నిద్రపోవాలి. తినేది ఏదైనా సరే టైమ్‌ టు టైమ్‌ పాటించాలి. అలాగే మరి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే.

చిన్న తనం నుండీ వ్యాయామం పట్ల అవగాహన ఉంటే భవిష్యత్తులో సహజంగా సంక్రమించే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘ కాలిక సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. కనీసం రోజులో అర్ధగంట సేపైనా నడకను తమ జీవన శైలిలో భాగమయ్యేలా చూసుకోవాలి. ఎక్కువగా కూర్చొని పని చేసే ఉద్యోగుల్లో పొట్ట సమస్య అధికంగా బాధిస్తుంది. దీని నుండి తప్పించుకోవడానికి కుర్చీకీ, వెన్నుముకకు మధ్య సన్నపాటి తలగడ, కానీ, కాస్త దళసరి క్లాత్‌ కానీ సపోర్ట్‌ పెట్టుకుంటే, పొట్ట సమస్య నుండి కాస్త ఉపశమనం పొందవచ్చు. చిన్నతనంలో వేసిన గోడకుర్చీ గుర్తుంది కదా. అదిప్పుడు సింపుల్‌ వ్యాయామంలో ఒక భాగం తెలుసా? పొట్ట వద్ద అనవసరంగా పెరిగిన కొవ్వు కరిగించడానికి ఈ వ్యాయాయం పనికొస్తుందట. రోజులో ఐదారు సార్లు ఇలా చేస్తే పొట్ట కండరాలు బిగుతుగా మారతాయని నిపుణుల సలహా. ఇలా ఒక్కటేమిటీ చిన్నతనంలో సింపుల్‌గా ఆడేసిన స్కిప్పింగ్‌లాంటి ఆటలే ఇప్పుడు సింపుల్‌ వ్యాయామాల లిస్టులో చేరిపోయాయి. డాన్సు కూడా ఈ లిస్టులో ఉందండోయ్‌. వీటికి ట్రైనింగ్‌ అవసరం లేదు. జస్ట్‌ మన స్టామినాని బట్టి ఎంత చేయ గలమో అంత చేస్తే సరి పోతుందని సీనియర్‌ వ్యాయామ నిపుణులు సలహా ఇస్తున్నారు. మరింకేం వీటికి ఖర్చేం అవసరం లేదు కదా. జస్ట్‌ ట్రై చేసి చూడండి. బట్‌ మైండ్‌ ఇట్‌ యువర్‌ స్టామినా.!
   

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు