ప్రతాపభావాలు - ..

pratapabhavalu

రోల్స్ రాయిస్ : అర్హులైన ధనవంతుల కేరాఫ్

కారు కొనాలనుకోవడం మధ్యతరగతి జీవుల కోరిక. అందుకనే టాటా లక్షరూపాయల నానో కారు రూపొందించి మధ్యతరగతి ఆశలు కొంతవరకూ తీర్చాడు.

కేవలం డబ్బుంటేనే రోల్స్ రాయిస్ కారు సొంతమవదు. రోల్స్ రాయిస్ కొనడం అంత ఆషామాషీ కాదు. కారు ప్రత్యేకతలు!
అన్నింట్లోకి ఖరీదయినది. ఎంతదూరమైనా అవలీలగా, అలుపూ సొలుపూ లేకుండా విశాలమైన కారులో ప్రయాణించవచ్చు.
1904లో మొట్టమొదటిసారి రోల్స్ రాయిస్ కారుకు రూపకల్పన జరిగింది. ఛార్లె రోల్స్ మరియు హెన్రీ రాయిస్ లు రూపొందించారు (వీరిద్స్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటీ లేకపోడం విచిత్రం). వారి పేరుమీదుగానే రోల్స్ రాయిస్ ఆవీర్భవించింది..

రోల్స్ రాయిస్ కారుల్లో ఇప్పటిదాకా 65% వరకూ మూలన పడకుండా రోడ్ల మీద రయ్ రయ్యిన తిరుగుతున్నాయి.
పొడవులో ఆరు మీటర్లు ఉంటుంది. సాధారణంగా మనదేశంలోని కార్లు నాలుగు నుంచి నాలుగున్నర మీటర్ల పొడవుంటాయి.
కారు ఎడంవైపు డోర్ కు ఒక గొడుగు అమర్చి ఉంటుంది. వాన పడుతున్నప్పుడు లేదా ఎండగా ఉన్నప్పుడు ఆ గొడుగుతో హుందాగా కారు దిగొచ్చు.

రోల్స్ రాయిస్ లకు పేయింట్ యంత్రాలతో గాని రోబోలతోగాని వేయరు మార్క్రోడ్స్ అనే అతను తన చేతుల్తో వేస్తాడు. అంతేకాకుండా రోల్స్ రాయిస్ నిర్మాణంలోనూ యంత్రాలను ఉపయోగించరు. మనుషులే తయారు చేస్తారు.

కార్ అపరిమిత షేడ్స్ లో లభిస్తుంది. ఇంటీరియర్ కూడా కొనుక్కునే వాళ్ల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. చక్రాలకి మధ్యలో ఉండే ’RR' అనే సింబల్ చక్రంతో పాటు తిరగదు, ఒక అమరికతో అది నిలువుగా ’RR' ఉంటుంది. మన కలల్ని మనమే వేటాడాలన్న ఉద్దేశంతో స్పిరిట్ ఆఫ్ ఎక్శ్టసి బోనెట్ ఆర్నమెంట్ ని కారుకి ముందు (బోనెట్) భాగంలో చక్కగా అమర్చబడి ఉంటుంది. దాని ఖరీదు అయిదు నుంచి ఆరు లక్షలుంటుంది.

ఒక కారు తయారు చేయడానికి ఎనిమిది యూరోపియన్ బుల్స్ స్కిన్ అవసరమవుతుంది.

కారు నడపడానికి డ్రైవర్ కావలసి వస్తే, అతనికి కంపెనీ నిర్ణీత ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తూంది.

బటన్ ప్రెస్ చేస్తే డోర్ లు తెరుచుకుంటాయి.

ఎవరు అర్హులు?

సెలెభ్రిటీలు, బిజినెస్ మెన్ మరియు సంఘంలో కీర్తి ప్రతిష్టలున్న వ్యక్తులు.

కేవలం డబ్బుండంగానే సరిగాదు దాన్ని సొంతం చేసుకునే హోదా ఉండాలి. కొనేవాళ్లకి ఆ హోదా ఉందని కంపెనీ భావిస్తేనే కారు వాళ్లదవుతుంది.

కారు మనకిచ్చే ముందు-

మనకి దాన్ని భద్రపరచుకునే గ్యారెజ్ ఉందా?

మన తర తరాల చరిత్రను పరిశీలిస్తారు.

కొనేవాళ్ల పేరు మీద ఒక్క కేస్ కూడా ఉండకూడదట.

మనకి ఎంతమందిలో పేరుంది? మన కింది స్థాయిలో మనకి పేరుండడం కాదు, మనతో సమాన హోదా గల వ్యక్తుల్లో కూడా మన హోదా గుర్తించబడి ఉండాలి.

కారు కొనడానికి నింపే అప్లికేషన్ సైతం శ్రద్ధగా, రిజెక్ట్ అవకూడదన్న ఉద్దేశంతో రాస్తారట.

రోల్స్ రాయిస్ సొంతం చేసుకున్న కొంతమంది ప్రముఖులు (మనదేశంలో)-

ఆది గోద్రెజ్, శివ నాడార్, అమితాబ్ బచ్చన్, అమీర్ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంకా చోప్రా, చిరంజీవి, విజయ్(తమిళ్ స్టార్)....
సో అదండీ సంగతి.

మనం కొనే స్థితికి చేరుకుందామా, తెలుసుకుని సంతోషపడదామా?

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు