షాపింగూ ఓ కళే....! - -మానస

shopping

అవసరం, అభిరుచి, స్తోమతను బట్టి ఎవరెవరి స్థాయికి తగినట్టు వారు వారు చేస్తారు షాపింగ్..అయితే అందరికీ కామన్ గా ఎదురయ్యే అనుభవాలు కొన్నుంటాయి షాపింగ్ లో...అందులో ముఖ్యమైనది బడ్జెట్..ఈరోజుల్లో ప్రతి షాపింగ్ మాల్ భారీ డిస్కౌంట్లూ, ఆఫర్లతో ఆకర్షించేస్తున్నాయి. అయినా మన షాపింగ్ బడ్జెట్ మన చేతుల్లో ఉండడం లేదు. కార్డులతో లావాదేవీలు జరపడం కొడా దీనికి ఒక కారణమే. దీనికి పరిష్కారం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది...అదెలాగంటే, షాపింగ్ కి వెళ్ళేప్పుడు ప్రత్యేకంగా మనం ఏం ప్లాన్ చేసుకోం.ఏమేమి కొనాలో, ఎంత కేటాయించాలో ఆలోచించుకోం...ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోం. అక్కడే ఉంది అసలు విషయం.

అవసరం వేరు, ఆకర్షణ వేరు...అలా అలా మాల్స్ లో చూస్తూ పోతే ప్రతీదీ మన కళ్ళను కట్టిపడేస్తుంది...కొనాలని మనసును తొందరపెట్టేస్తుంది...ఇంకేం ఆలోచించకుండా కొనేస్తాం. మన ఉత్సాహం చూసి షాపు వాళ్ళు కూడా వాటిపై మనకు భారీ డిస్కౌంట్ ఉందనో, ఈ ఆఫర్ పోతే ఇక ఈ శతాబ్దంలోనే మరెప్పుడూ రాదనో ఊదరగొట్టేస్తారు...బంగారు అవకాశం పోతే మరెన్నడూ రాదని తొందరపడి కొనేస్తాం...బంగారు అవకాశాన్ని ఒడిసిపట్టేసామని సంబరపడుతూ ఆ షాప్ లో నుంచి బయటకు రాగానే పక్క షాపులో కూడా ఇంచుమించు అలాంటి ఆఫరే మనను ఆకర్షిస్తూ...వెక్కిరిస్తూ కనిపిస్తుంది....
అసలు కొన్న వస్తువు అవసరమేమిటొ అప్పుడు ఆలోచించుకున్నా ప్రయోజనం ఉండదు కదా...అదే వస్తువు కొనేముందు అవసరమో, కాదో ఆలోచించుకుని, ఆ వస్తువు విలువ, ధర, రెండు మూడు షాపుల్లో చూసి కొంటే ఇలాంటి నిరాశలు తప్పుతాయి...
మన కార్డు క్రెడిట్ లిమిట్ లక్ష వరకూ ఉన్నా, ప్రస్తుత షాపింగ్ లిమిట్ మనమే నిర్ణయించుకుని బయల్దేరితే బడ్జెట్ దాటదు. అలాగే అసలు షాపింగ్ దేని కోసం, ఏవేవి కొనాలని ముందుగా నిర్ణయించుకుంటే కూడా ఇతర అనవసర వస్తువుల మీదికి మనసు వెళ్ళదు....

ఇక ఆన్ లైన్ షాపింగ్ విషయానికొస్తే, నెట్ లో ఏ సైట్ ఓపెన్ చేసినా మన దృష్టిని ఆకర్షించేవి యాడ్స్...క్లిక్ చేయగానే టకటకా నెక్స్ట్ అంటూ మనని తీసుకెళ్ళి, కార్ట్ లో పడేసుకుని, పేమెంట్ చేసేసుకునే దాకా ఆగనివ్వవు...ఆన్ లైన్ లో కూడా అనేక స్టొర్స్ పోటీ పడి డిస్కౌంట్లూ, ఆఫర్లూ ఇచ్చేస్తున్నాయి...ఆర్డర్ బుక్ చేసేముందు నాలుగు సైట్ చూసి ధర కన్ ఫర్మ్ చేసుకుంటే మరీ మంచిది....వాళు దిస్ ప్లే లో చూపించేది ఏ బ్రాండో ఒక్కోసారి గమనించం, ఆ వస్తువు డీటైల్స్ సరిగా పట్టించుకోం ( ఈ ప్రమాదం ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలకు మరీ ఎక్కువ) అక్కడే వస్తుంది అసలు చిక్కంతా....తీరా ఆర్డర్ డెలీవరీ అయ్యాక, చూసుకుంటే అదేదో చెత్త బ్రాండో, పెద్ద బ్రాండ్ కి నకలుదో అయి ఉంటుంది....అప్పుడేం చేయలేం...
మన్నికైన వస్తువులు, అదుపులో బడ్జెట్...రెండూ ముఖ్యమే అది ఆన్ లైన్ షాపింగ్ అయినా, ఆన్ రోడ్ షాపింగ్ అయినా....
కనుక....తస్మాత్ జాగ్రత్త...
 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు