తల్లి ప్రేమ - ఆదూరి.హైమావతి

mother love

ఈ ప్రపంచంలో బంధువులు ,మిత్రులందరి ప్రేమకంటే తల్లి ప్రేమ చాలాగొప్పది, ప్రధానమైనది కూడా. కనుకనే, జన్మించిన దేశాన్ని మనం  'మాతృదేశమ'ని వ్యవహరిస్తాం. ఎవరి జన్మ భూమి వారికి  తల్లి వంటిది. మన  పవిత్ర భారత దేశంలో పూర్వం నుండి అనేకవిధాలైన దివ్యశక్తులు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. తల్లియందున్నటు వంటి శక్తి మరెవరి లోనూ లేదు. తల్లి సంకల్పం వజ్రసంకల్పం. ఆమె సంకల్ప బలంచేతనే బిడ్డలు  అభివృద్ధికి వస్తారు. తల్లి యొక్క సత్సంకల్పమెంతటి కష్టాలనైనా తీరుస్తుంది,తల్లి ఆశీర్వాదబలం ఎంతటి గొప్ప పనులనైనా సాధించే శక్తిని బిడ్డలకు ఇస్తుంది. కుంతి ఆత్మబలం, భగవత్ భక్తి, బిడ్డలపై ఉన్నల్రేమ వారిని అడుగదుగునా కాపాడుతూ వచ్చింది.

ఏ మహనీయుని చరిత్రను మనం  పరిశీలించినా, తల్లి ప్రేమచేతనే వారంతటి అభివృద్ధికి రాగలి గారని స్పష్టమవుతుంది. రామకృష్ణ పరమహంస , ఆయనయొక్క ప్రధాన శిష్యుడైన వివేకానం దుడు తల్లి యొక్క ఆశీర్వచన బలం చేతనే గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు. తల్లి హృదయ పవిత్రత, ఆశీర్వాద బలం సాటిలే నివి.

నేడు మనం  మాతృమూర్తియొక్క ప్రేమతత్వాన్ని సరిగానూ, పూర్తి గానూ  అర్థం చేసుకొనలేకపోతు న్నాం. ఆధ్యాత్మికం తల్లికి ప్రథమ స్థానం ఇచ్చింది. వేదం , 'మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదే వోభవ, అతిథిదేవో భవ' అని బోధించింది.

మనం  ఏ దేవతను పూజించినప్పటికీ, పూజించక పోయినప్పటికీ తల్లిని మాత్రం గౌరవించాలి. ఎవరిని గౌరవించినప్పటికీ గౌరవించక పోయినప్పటికీ తల్లిని గౌరవిస్తే అన్నీ సరిగా నెరవేరుతాయి. తల్లి గౌర వాన్ని నిలబెట్టినవాడే నిజమైన పుత్రుడు. మాతృప్రేమకు పాత్రుడు కాని పుత్రుని జీవితం నిరర్థకం. తల్లిని గౌరవించి, తల్లి ప్రేమను నిల బెట్టుకున్నప్పుడే మనం నిజమైన మానవులమవుతాం. కనుక  ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించి తమజీవితాలను విజయ మార్గం వైపు సాగిం చుకోవాలి. తల్లిని ప్రేమించాలి; తల్లికి ఉన్నత స్థానం అందించాలి. అటువంటి వ్యక్తులే దేశానికి నాయకత్వం వహించగలరు. ఉన్నతు లుగా గుర్తింపుపొందగలరు.

తల్లిని మించిన దైవము లేదు. కాని, ఎంతోమందిమి ఈరోజుల్లో తల్లిని మరచి దైవంకోసం అటూ ఇటూ తిరుగుతూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం. దైవాన్ని దర్శించే నిమిత్తం జపాలు, తపాలు, తీర్థయాత్ర లు, వ్రతాలు, పూజలు మొదలైనవి ఎన్నో చేస్తున్నాం. కంటికి కనిపిం చని దైవంకోసం ప్రాకులాడే బదులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవ మైన తల్లిని పూజిస్తేచాలు. పూజించడమంటే పూలుతెచ్చి తల్లిని కూర్చోబెట్టి పూజించడంకాదు ,ప్రేమించడం ,సేవించడం , గౌరవిం చడం,ఆదరించడం.  తల్లి ప్రేమకు నోచు కోకుండా మానవుడు దైవ ప్రేమకు, దైవానుగ్రహానికి పాత్రుడు కాలేడు. తల్లియొక్క ప్రేమ స్వార్థ రహితమైనది. అలాంటి స్వార్థరహిత ప్రేమను తల్లిదగ్గరనుండి మాన వులు అలవరచు కోవాలి. తల్లి ప్రేమకు పాత్రుడైనవారు ప్రపంచాన్నే జయించగలరు. తల్లి హృదయం చాలా విశాల మైనటువంటిది. అట్టి హృదయానికి ఎవ్వరూ  బాధ కలిగించకూడదు. తల్లిని నొప్పించి ఏపనీ చేయకూడదు.

మాతృప్రేమను విస్మరించి ఇతరుల ప్రేమకోసం ప్రాకులాడ టం వెఱ్ఱితనం. తల్లి అనేక శ్రమలకోర్చి, పిల్లలనుపోషిస్తూ, చదివిస్తూ వుంటుంది. పిల్లలకోసం అవసరమైతే తాను కూలి పనైనా చేయడానికి సిద్ధపడుతుంది.తాను తినకున్నా బిడ్డకు పెడుతుంది.అట్టి మాతృ ప్రేమను మరచి పోవడం చాలా ద్రోహం! మాతృప్రేమను మనం ఎన్న టికీ మరువరాదు. తల్లి ప్రేమచేతనే పిల్లలలో దివ్యమైన భావాలు కలుగుతాయి. గుణవంతురాలైన   తల్లి ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని విధాలు గా సుక్షేమం, సౌభాగ్యం కలుగుతుంటాయి.

రామకృష్ణ పరమహంస తల్లి గొప్ప గుణవంతురాలు. ఎన్ని కష్ట నష్ట ములు సంభవించినా ఆమె దైవము పై అచంచలమైన భక్తి, విశ్వా సాలు  కలిగియుండి, సద్భావాలతో, సత్కర్మలతో కాలం గడుపుతూ తద్వారా దైవానుగ్రహానికి పాత్రురాలై,బిడ్డలకు దైవప్రేమను అందిం చింది . మనం ఏ మహనీయుని  చరిత్రను చూసినా వారి గొప్పతనం తల్లి ప్రేమనుండి ఆవిర్భవించినదే! తల్లి ప్రేమను సాధించినటు వంటివాడు సర్వమును సాధించగలడు. తల్లి ప్రేమకు పాత్రుడైనాడు కనుకనే రామకృష్ణ పరమహంస గొప్ప పేరు సాధించాడు. రామకృష్ణు నికి పరిపూర్ణ మైన భక్తి, విశ్వాసాలుండడంవల్లనే తల్లిని ప్రేమించి, తల్లియొక్క ఆజ్ఞను శిరసావహించి ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని గడు పుతూ వచ్చాడు. తల్లి ప్రేమకంటే మించినది జగత్తులో లేదని ప్రబోధి స్తూ వచ్చాడు. తల్లియే దైవం, దైవమే తల్లి. అట్టి ప్రేమస్వరూపు రాలై న తల్లిని కష్టపెట్టడం మంచిది కాదు.

తల్లి పై ప్రేమను పెంచుకున్నప్పుడే మన జీవితం నిత్యకల్యాణం, పచ్చతోరణంగా కళకళలాడుతుంది. తల్లి ఏమి చేసి నప్పటికీ మన మంచికోసమే చేస్తుందిగాని, చెడ్డకోసం చేయదు. పసితనంలో మంచి చెడూ చెప్పను, తల్లి కొట్టినా, తిట్టినా సహించాలి. మాతృప్రేమకోసం హృదయ పూర్వకంగా కృషి చేయాలి. మాతృప్రేమ ఎల్లప్పుడూ మన ఇంటనే, వెంటనే, జంటనే, కంటనే ఉండి మనల్ని కాపాడు తుం టుంది.
    మాతృప్రేమను విస్మరించడం చేతనే నేడు మనం అవస్థలకు గురై తున్నాం .మనం భూమినుండి పుట్టలేదు; ఆకాశమునుండి ఊడి పడ లేదు; తల్లి గర్భమునుండే జన్మించాము. కాబట్టి, తల్లిపట్ల కృతజ్ఞత చూపాలి. తల్లిని ద్వేషించే కుమారులున్నారుగాని, కుమారునిద్వేషిం చే తల్లులు లేరు. తల్లి ఎల్లప్పుడు కుమారుని యొక్కక్షేమాన్నే  కోరు తుంది. ఒక్కొక్కసారి తల్లీ కుమారులమధ్య అభిప్రాయ భేదాలు తలె త్తవచ్చు. అంతమాత్ర చేత తల్లి కుమారుని ద్వేషించదు.తల్లి నిరం తరము తన పిల్లల యోగక్షేమం కోసమే  పాటుపడు తుంటుంది. అట్టి మాతృప్రేమను విస్మరించడంచేతనే నేడు మనం అనేక అవస్థలకు గురవుతున్నాం

ముసలివయస్సులో ఉన్నతల్లిని "ఆ ముసలమ్మకు ఇంత కూడు పెడితే సరిపోతుంది" అనే సంకుచిత భావములో మునిగిపోవద్దు. తల్లికి ఇంత తిండి పెట్టడంతో మన బాధ్యత తీరిపోయిందని భావిం చడం పొరపాటు. తల్లిని సేవించాలి. ఆమెను సంతోషపెట్టాలి. భగ వంతుడు మన ఎదుట ప్రత్యక్ష మైనప్పటికీ తల్లిదండ్రుల సేవను విడిచి పెట్ట కూడదు.ఐతే ఈ నాడు వంతరిగా మిగిలిపోయిన ముసలి తల్లిని వృధ్ధాశ్రమాలలోనో ,అనాధాస్రమాలలోనో వదిలేసి పోతు న్నా రు. ఎంత ఘోరం! రేపు తమకూ దేగతిపడుతుంద్నై మరువరాదు.

బాల గాంధీకి తల్లి నేర్పిన గుణపాఠం .

పుత్లీబాయి ఒక నియమాన్ని పాటించేది. కోయిల కూత వినకుండా ఆమె భోజనం చేసేది కాదు. గాంధీ పసివానిగా ఉన్నప్పు డు ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలైనప్పటికీ తల్లి భోజనం చేయకుండా ఉండడం గమనించి, తాను ఇంటి వెనుకకు పోయి కోయిల మాదిరి కూత పెట్టాడు. వెంటనే లోపలికి వచ్చి, ''అమ్మా! కోయిల కూసింది కదా! ఇక, నీవు భోజనం చేయవచ్చు" అన్నాడు.తన కుమారుడు అబద్ధం చెబుతున్నాడని గ్రహించి ఆ తల్లి పట్టలేని కోపంతో గాంధీని చెవి పట్టి యీడ్చి రెండు చెంప దెబ్బలు కొట్టింది. "నీలాంటి అసత్య వాది నా గర్భంలో పుట్టడం నా దురదృష్టం," అంటూ చాలా బాధ పడింది . అప్పుడు గాంధీ పశ్చాత్తాపపడి తన తప్పును మన్నించ వల సిందిగా తల్లిని ప్రార్థించాడు.

ఇక జీవితములో ఎన్నడూ తాను అసత్యమాడనని ప్రతిజ్ఞ చేశాడు.ఈవిధంగా, ప్రాచీన కాలంలో తల్లు లు తమ పిల్లలకు సరి యైన బుద్ధులు నేర్పి, వారిని సన్మార్గంలో ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేస్తూ వచ్చారు. అటువంటి ఆదర్శ ప్రాయులైన తల్లులు ఈనాడు లోకంలో చాలా అరుదుగా ఉన్నారు. "నా కుమారుడు పరీ క్షలో గొప్ప మార్కులు సంపాదించాలి; గొప్ప డిగ్రీలు తీసుకోవాలి. గొప్ప ఉద్యోగం చేయాలి లక్షలు సంపాదించాలి, అని ఆశించే తల్లు లు నూటికి నూరుమంది ఉన్నారుగాని, "నాయనా! నీవు దైవప్రార్థన చేయి.దైవాన్ని మరువవద్దు" అని పిల్లలకు బోధించే తల్లులు ఎక్కడా ఈనాడు కనిపించ డంలేదు."రామా, కృష్ణా, గోవిందా'' అని ఎంతో ఆనందంగా దైవచింతన చేస్తూ కాలం గడిపేవారు. కాని, ఇప్పుడు అటువంటి పవిత్రమైన చింతన నిలిచిపోయి లౌకికమైన చింతలు బయలుదేరినాయి. భారతీయ సంస్కృతి 'సత్యం వద, ధర్మం చర' అని ప్రబోధించింది. కాని, ఈనాడు జరుగుతున్న దేమిటి? "సత్యం వధ, ధర్మం చెఱ", సత్యాన్ని వధిస్తున్నారు, ధర్మాన్ని చెఱసాలలో పెడుతున్నారు. కనుకం తల్లిని ప్రేమిస్తూ వృధ్ధాప్యంలో ఆమెను గౌర విస్తూ ఆదరంగా చూసుకుంటూ జన్మ నిచ్చిన తల్లిని ఆప్యాయతతో సాగనంపేవాడే నిజమైన మానవుడు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు