గాడ్జెట్స్‌ పెంచేస్తున్న సరికొత్త డౌట్లు.! - ..

New Doubles to Gadgets

ఏ టైంకి ఆహారం తీసుకోవాలి.? ఎంత సేపు నిద్రపోవాలి.? శరీరానికి ఎంత వ్యాయామం అవసరం.? రక్తంలో గ్లూకోజ్‌ని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి.? హార్ట్‌బీట్‌ కంట్రోల్‌ ఎలా చేసుకోవాలి.? ఎలా కూర్చోవాలి..? ఎలా నిల్చోవాలి..? ఏ యాంగిల్‌లో పడుకోవాలి.? పడుకోవడానికి బెడ్‌రూమ్‌లో టెంపరేచర్‌ ఎంతుండాలి..? ఈ ప్రశ్నలేంటీ.? ఈ గోలేంటీ.? అనుకుంటున్నారా.! చెప్పుకుంటూ పోతే ఈ ప్రశ్నల లిస్టు చేంతాడంత కనిపిస్తుంది మరి. మనిషి తన మెదడును వాడడం మానేసి గ్యాడ్జెట్స్‌ మీద ఆధారపడుతున్నాడు. స్మార్ట్‌ ఫోన్‌లో అలారమ్‌ పొద్దున్నే మోగడంతో మనిషి లైఫ్‌ స్టైల్‌ మొదలవుతోంది. అర్ధరాత్రి తర్వాత ఎప్పుడో చేతిలోని మొబైల్‌ ఫోన్‌ని పక్కన పెడితే కానీ మనిషికి ఆ రోజు జీవితం పూర్తి కావడం లేదు. అదీ మనిషికీ, గ్యాడ్జెట్స్‌కీ మధ్య అవినాభావ సంబంధం.

పొద్దున్నే ఆరోగ్యం కోసం వ్యాయామం చేయమని డాక్టర్‌ చెబితే మొబైల్‌ ఫోన్‌లో టైమర్‌ ఆన్‌ చేసుకోవడంతో వ్యాయామం మొదలవుతోంది. క్షణం క్షణం ఎంత కష్టపడుతున్నామో తెలుసుకోవడానికి గ్యాడ్జెట్స్‌ మీద ఆధారపడుతున్నాం. ఖర్చవుతున్న కేలరీల లెక్కని ఈ గ్యాడ్జెట్‌ చెబుతోంది. చాలా కష్టపడిపోయామని అక్కడితో ఆ వర్కవుట్‌ని సరిపెట్టేస్తున్నాం. ఏదైనా తినేటప్పుడు ఆ ఫుడ్‌లో ఎన్ని క్యాలరీలుంటాయో తెలుసుకుని తింటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని రోబోలుగా మార్చేసి స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఓ ఆట ఆడేసుకుంటున్నాయి. పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని సంతోషపడుతున్నాం కానీ, మన మీద పెత్తనాన్ని స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌కి అప్పగించేస్తున్నామని తెలుసుకోలేకపోతున్నాం.

అసలు కథ ఇప్పుడే మొదలైంది. పూర్తిగా ఈ గ్యాడ్జెట్స్‌ చేతిలోకి వెళ్లిపోతున్నాడు మనిషి. ఆవిష్కరణల జోరు ఎంత పెరిగితే మనిషి పతనానికి అంత దగ్గరవుతున్నాడని అర్ధం అంటాడో ప్రముఖ శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త మాటల్ని పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా పలు సర్వేలు, పరిశోధనలు స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ వల్ల మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాయని చెబుతున్నాయి. అవసరానికంటే కాస్త తక్కువగా వీటిని వినియోగించడం మంచిదనీ, అవసరానికి తగ్గట్లు వాడినా, అవసరానికి మించి వాడినా సమస్యలు తప్పవనీ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మానసిక రుగ్మతలు పెరిగిపోవడం ప్రధాన సమస్య. దాంతో పాటుగా మన శరీరాన్ని సరిగ్గా అంచనా వేయలేని గ్యాడ్జెట్స్‌తో అనవసర ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందట. 'అతి సర్వత్రా వర్జయేత్‌' అని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. ప్రపంచంలో ఎంత పెద్ద కంప్యూటర్‌ అయినా, మనిషి మెదడు ముందు బలాదూర్‌. ఆ మెదడుకు మేత అంటే దానికి సరిగ్గా పని చెప్పడమే. మెదడుకు పని చెప్పకుండా గ్యాడ్జెట్స్‌ మీద ఆధారపడితే మనిషి గతి అంతే మరి.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు