నెట్టింట్లో 'ప్రైవసీ' సాధ్యమేనా.? - ..

Is the 'privacy' possible

ఒక్కసారి సోషల్‌మీడియాలో లాగిన్‌ అయ్యాకా ప్రైవసీ అనేది అసాధ్యమే అని చెప్పాలి. ట్విట్టర్‌ కావచ్చు, ఫేస్‌బుక్‌ కావచ్చు మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ కావచ్చు ఏదైనా కానీ, కోరిది కదా అని వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేస్తే అంతే సంగతులు. క్షణాల్లో ఆ వ్యక్తిగత సమాచారమ్‌ విశ్వవ్యాపితమైపోతుంది. అందరూ అలా చేస్తున్నారని చెప్పలేం కానీ, చాలా వరకూ జరుగుతున్నదదే. ప్రధానంగా ఈ ప్రైవసీ సమస్య మహిళలకే ఎక్కువ ఎదురవుతోంది. పర్సనల్‌ ఫోటోస్‌ కొంతమంది కోసమే షేర్‌ చేస్తున్నాం అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అవి చేరాల్సిన చోటుతో పాటు మరో ప్రమాదకరమైన చోటుకు కూడా చేరిపోతున్నాయి. నిత్యం హ్యాకర్స్‌ ఇలాంటి పనుల మీదే బిజీగా ఉంటుంటారు. సో పర్సనల్‌ ఫోటోస్‌ని షేర్‌ చేయడం ఏ రకంగానూ శ్రేయస్కరం కాదు.

'ప్రైవసీ' అనేది కష్టమన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ నిర్లక్ష్యం. ఏమవుతుందిలే అన్న చిన్నపాటి అశ్రద్ధ కారణంగా జీవితాలు నాశనమైపోతున్నాయి. ఇటీవల హీరోయిన్‌ అక్షరాహాసన్‌ ప్రైవేట్‌ ఫోటోలు లీకయ్యాయి. అవి ఎలా లీకయ్యాయి అనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఫోటోల వరకూ ఒక సమస్య అనుకుంటే, బ్యాంకులకు సంబంధించిన సమాచారమ్‌ లీకైతే అది ఇంకో తరహా ఇబ్బందికరమైన సమస్య. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగం జరిగాక ఎక్కువగా జరిగే ఈ - డోపిడీ ఎక్కువైపోయింది. ఓ సర్వే ప్రకారం ఈ ఈ - దోపిడీకి వినియోగదారుల నిర్లక్ష్యమే ముఖ్య కారణమని తేలింది. బ్యాంకులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నా, వినియోగదారులు మాత్రం అప్రమత్తత పాటించడంలేదు. అదే సమయంలో స్కామర్లు రోజురోజుకీ మరింత యాక్టివ్‌ అవుతున్నారు. సరికొత్త పద్దతుల్లో దోచేస్తున్నారు.

వ్యక్తిగత ఫోటోలతో లైంగిక వేధింపులు, బ్యాంకింగ్‌ సమాచారమ్‌తో ఈ - దోపిడీ ప్రపంచాన్ని వణికిస్తున్న అతి ముఖ్యమైన అంశాలుగా రూపాంతరం చెందుతున్నాయి. అప్రమత్తత తప్ప దీనికి వేరే మందు లేదు. అలసత్వం ఇక్కడ అస్సలు పనికి రాదు. దురదృష్టవశాత్తూ అప్రమత్తంగా లేకపోవడం, అలసత్వం పెరగడం నెటిజన్లు మానుకోవడం లేదు. ఈ తరహా వివాదాల్ని పరిష్కరించడానికి సైబర్‌ క్రైమ్‌ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. దురదృష్టవశాత్తూ యువత, చదువుకున్న వారే ఈ - బాధితుల లిస్టులో అగ్రస్థానం దక్కించుకుంటున్నారు. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు