తెల్లనివన్నీ పాలు కావు.! - ..

white is not milk.

కల్తీ.. కల్తీ.. కల్తీ ఎటు చూసినా కల్తీనే. ఏదో పండూ, పాలు తాగి అయినా కనీసం కడుపు నింపుకుందామన్నా, ఆ పాలూ కల్తీనే. పండూ కల్తీనే. అదీ నేటి ఫుడ్‌ పరిస్థితి. ఆఖరికి రైస్‌ని కూడా వదలడం లేదంటే ఏ రేంజ్‌లో కల్తీ ఆహారం కడుపులో చక్కర్లు కొడుతుందో. మానవాళి ఆరోగ్యాన్ని స్లో పోయిజన్‌లా ఎలా హరించేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మరి ఈ కల్తీని ఆరికట్టడం సాధ్యమేనా.? పోనీ ఏ కొద్దిమందైనా ఈ కల్తీ ఆహారం నుండి ఎస్కేప్‌ అవ్వడమైనా సాధ్యమేనా.? అంటే ఆన్సర్‌ లేని క్వశ్చన్‌ ఇది. కానీ కొన్ని రకాల ఫుడ్‌ కంపెనీలు 'ఆర్గానిక్‌' పేరిట కల్తీ లేని ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ అంటూ ప్రచారం చేస్తున్నాయి. విక్రయాలూ చేస్తున్నాయి.

కల్తీ ఆహారం నుండి కాస్తైనా ఉపశమనం పొందొచ్చు కదా అని జనం కూడా ఆ ఆర్గానిక్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌కి ఎట్రాక్ట్‌ అవుతున్నారు. అవగాహన లేకుండా, ఆర్గానిక్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌ని కొనుగోలు చేస్తున్నారు. అయితే నిజంగా అవి కెమికల్‌ రహిత ఫుడ్‌ ఐటెమ్సేనా.? ఎంత వరకూ నిజం.? ఆ పేరు చెప్పి వారు ఆ వస్తువులకు నిర్ణయించే ధరలు అధికం. అధిక ధరలను కూడా లెక్క చేయకుండా జనం వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా తీసుకుని ఒకటీ అరా ఉన్న ఆర్గానిక్‌ ఫుడ్‌ ప్రొడక్ట్‌ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆకుకూరల్ని, పండ్లను సైతం ఆర్గానిక్‌ ఫుడ్‌ పేరు చెప్పి ప్యాకింగ్స్‌లో అమ్మేస్తున్నారు. కానీ కెమికల్‌ లేకుండా ఫుడ్‌ని డ్రై రూపంలో ప్రోసెస్‌ చేయడం సాధ్యమేనా.? ఒక్కసారి ఆలోచించండి.

ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌లో కల్తీ లేదా.? అంటే వాటిని కనుక్కొనే ఎలక్ట్రానిక్‌ పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. కానీ అత్యంత ధరలు వ్యత్యించి వాటిని కొనుగోలు చేసేది ఎవరు.? అందుకే మనం కూడా 80ల 70ల కాలం నాటి పరిస్థితులకు వెళ్లిపోవాలేమో. మన కూరగాయలు, మన ఆకుకూరలు మనమే పండించుకోవాలేమో. మన పెరట్లో పండిన పండునే కోసుకుని తినాలేమో. కానీ కాంక్రీట్‌ జంగిల్‌లో ఇది సాధ్యమేనా.? భవిష్యత్‌ మానవాళి దుస్థితి ఇది. ఏది ఏమైనా ఏం చేసినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కల్తీ నుండి దూరంగా పారిపోవడం జరగని పని. అయితే కల్తీ నుండి కొంత ఊరట పొందేందుకు మన వంతుగా కొన్ని ప్రయత్నాలు చేయక తప్పదు. ఆ ప్రయత్నం కనీసం మనల్నీ, మన కుటుంబ సభ్యుల్నీ కొంతవరకైనా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు