ఈ చదువులు మాకొద్దు బాబోయ్‌.! - ..

these studies dont want

ఇంజనీరింగ్‌లు, ఎంబీఏలు చదివేసి ఉద్యోగాల్లేక విలవిల్లాడుతున్న యువత దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. పాతికవేల రూపాయల జీతం కోసం సాధారణ డిగ్రీ హోల్డర్స్‌తో ఉన్నత విద్యాధికులు పోటీ పడాల్సిన పరిస్థితి. లోపం ఎక్కడుంది.? ఇంజనీరింగ్‌ చేసి, పార్ట్‌ టైం జాబ్‌ అంటూ ఎలాగోలా పొట్ట పోసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది. చదువుల్లో లోపమా.? వ్యవస్థలో లోపమా.? నిరుద్యోగుల్ని ఉద్ధరించేస్తున్నామంటూ రాజకీయ పార్టీలు చెప్పడం మామూలే. నిరుద్యోగ యువతను లైట్‌ తీసుకోవడం కూడా మామూలే. ఏ రాజకీయ పార్టీ అయినా నిరుద్యోగ యువతను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూస్తోంది. నమ్మలేని నిజమిది. మరి ఏం చేయాలి.?

130 కోట్ల మందికి పైగా భారతీయులు.. అందులో ఎక్కువ భాగం యువశక్తి కావడం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అందరికీ ఉద్యోగాల కల్పన అంటే అది దాదాపుగా అసాధ్యం. ఉద్యోగం చేస్తే నెలకు పాతిక వేలో, యాభై వేలో రావచ్చు. అదే సొంతంగా ఉపాధి కోసం ప్రయత్నిస్తే పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగొచ్చు. యువత పంథా మారింది. ఉద్యోగం కోసం ఎదురు చూసే రోజులు ఇకపై కనిపించకపోవచ్చేమో. ఈ చదువులు మాకొద్దు బాబోయ్‌ అని నిరుత్సాహపడేవారు ఎప్పుడూ ఉంటారు. ఏం చదివామన్నది కాదు ముఖ్యం. మన ఆలోచనలు ఎలాంటి ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయో అని తెలుసుకోవడమే ముఖ్యం.

ఇది నేటి నయా యూత్‌ మైండ్‌సెట్‌.  ఫుడ్‌ ట్రక్‌, బాబీ క్యూ బైక్‌ ట్రెండీ ట్రెండీ వ్యవసాయం, ఈవెంట్స్‌ మేనేజ్‌మెంట్‌.. ఇలా ఒక్కటేమిటి కుప్పలు తెప్పలుగా అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. పది మంది సక్సెస్‌ అయిన దారిలో పదకొండో సక్సెస్‌ పెద్ద కష్టమేమీ కాదు. అలాగే కొత్త దారిలో ప్రయత్నించి సక్సెస్‌ అయితే అలాంటి కిక్‌ ఇంకెక్కడా దొరకదు. ప్రయత్నించి చూస్తే అద్భుతాలకు అవకాశాలెప్పుడూ రెడ్‌ కార్పెట్‌ పరిచే ఉంటుంది. ఒక్కసారి కొంచెం కొత్తగా ఆలోచించడం మొదలు పెడితే చదివినా ఉద్యోగాలు రావన్న నైరస్యం నుండి తేలిగ్గా బయటపడొచ్చు. చదవడం అనేది ఏ పని చేసినా దానికి అదనపు బలాన్నిస్తుంది. సో చదువు దారి చదువుదే. ఆవిష్కరణల దారి ఆవిస్కరణలదే. ఎందుకంటే ఇది 'నవ యువతరం వెర్షన్‌ 2.0'.!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు