ఎయిర్ కండిషన్డ్ ఇంట్లో ఎంచక్కా లైఫ్‌ని ఎంజాయ్ చేసేస్తున్నారా.? బయట తిరగట్లేదు కాబట్టి పొల్యూషన్‌కి దూరంగా ఉంటున్నామని సంబరపడిపోతున్నారా.? ఈ నిజం తెలిస్తే ఇంట్లోనూ, కార్లోనూ ఉండడం కంటే బయట తిరగడమే మేలనుకుంటారు. ఇంతకీ ఏంటా.? నిజం. ఓ విషయం తెలుసా.? ఇటీవల కాలంలో మన అలవాట్ల కారణంగా మన ఇల్లు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. ఈ నిజాన్ని నమ్మగలరా.? మనం మన సదుపాయాల కోసం, ఇంటి డెకరేషన్ కోసం వాడే ప్రతీ వస్తువు ఇన్‌డైరెక్ట్‌గా ఇంటి పొల్యూషన్‌కి కారణమవుతోంది.
ముఖ్యంగా ఏసీ వినియోగం బాగా ఎక్కువైన నేటి తరుణంలో పొల్యూషన్‌ని వేలు పోసి కొని తెచ్చుకున్నట్లే అవుతోంది. ఏసీలను వాడడమే కానీ, వాటి క్లీనింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోము. ఆ కారణంగా వాతావరణంలోని దుమ్ము, ధూళి పార్టికల్స్‌నీ మనింట్లో అఫీషియల్‌గా ప్యాక్ చేసి పెట్టుకున్నట్లే. అంతే కాదు టీవీ, ఫ్రిజ్, కిచెన్ వేర్ ఇలా అంతా ప్లాస్టిక్ మయం. వాటి నుండి విడుదలయ్యే రసాయనాలు ఇంట్లో పొల్యూషన్‌కి ముఖ్య కారణంగా మారుతున్నాయి. అలాగే డెకరేషన్ కోసం వాడే ప్లాస్టిక్ పూలూ, బెడ్‌రూమ్‌లో వెచ్చదనం కోసం వాడే రగ్గులు ఇతరత్రా బ్లాంకెట్స్ నుండి మైక్రో ప్లాస్టిక్ వేవ్స్ రిలీజ్ అవుతున్నాయనీ, అవి ఆరోగ్యానికి తెలియకుండానే ఎంతో హాని చేస్తున్నాయని ఓ సర్వే ద్వారా తేలింది.
ఇదివరకట్లో ఇంటి చుట్టూ చెట్లూ, మొక్కలూ ఉండేవి. కానీ నేటి కాంక్రీట్ జంగిల్స్‌లో కనుచూపు మేరలో పచ్చదనమే కరువైంది. దాంతో గాలిలో కార్భన్‌డై ఆక్సైడ్ ఎక్కువవుతోంది. నేటి తరంలో కొందరు ప్రకృతి ప్రేమికులు పచ్చదనాన్ని తిరిగి పొందేందుకు కొన్ని రకాల మొక్కల్ని పెంచుతున్నారు. కానీ వాటి వల్ల కలిగే ఉపయోగం కన్నా, నిరుపయోగమే ఎక్కువవుతోంది. మొక్కల కోసం వాడే కుండీల దగ్గరే అసలు కథ స్టార్ట్ అవుతోంది. ప్లాస్టిక్ కుండీలను ఎంచుకుంటున్నారు మరి. అలాగే ఆక్సిజన్ కోసం ఇంట్లోనూ మణీప్లాంట్స్, అలోవెరా వంటి మొక్కలు పెంచుతున్నారు. కానీ ఇవి విడుదల చేసే ఆక్సిజన్ శాతం కన్నా, ఇంట్లోని వస్తువుల నుండి విడుదలయ్యే మైక్రోప్లాస్టివ్ వేవ్స్ శాతం పదింతలు ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పొల్యూషన్ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి. మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా.? అన్నట్లు మీ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందా.? అని అడగాల్సిన రోజులివి. వాటర్ ఫ్యూరిఫైర్సే కాదు, ఎయిర్ ఫ్యూరిఫైర్స్ కూడా తప్పని సరిగా వాడాల్సి ఉంది. అలాగే ఎప్పుడూ మూసిన తలుపులు మూసినట్లే కాకుండా, అప్పుడప్పుడూ ఇంట్లోని తలుపులు, కిటికీలు తెరిచ ఉంచి, ఇంట్లోని గాలిని బయటికి పంపి, బయటి గాలిని కూడా కాస్త లోనికి రప్పించాలి. అంతకన్నా మరో మార్గం లేదు.