మన కార్టూనిస్టుల్లో చాలా కళలున్నాయండోయ్....అవి మామూలుగా బయటపడలేదు...మొన్న ఆదివారం పెనుమాకలో సీనియర్ కార్టూనిస్ట్ పద్మ గారు వనభోజనాలేర్పాటు చేసి ఆహ్వానాలు పంపేసరికి పొలోమంటూ వాలిపోయి, తమలోని చిత్రవిచిత్రకళలన్నింటినీ బయటికి తీసారు.... ఆటలు..పాటలు...పోటీలు...ఒకటేమిటి, ఒక్కొక్కరిలో ఎన్నెన్ని ఏషాలో....అమ్మో అమ్మో...మామూలుగా తమ కార్టూన్లు తము వేసుకుంటున్న బుద్ధిమంతులనుకున్నాం గానీ మరీ అందరూ ఒక్కచోట చేరితే మరీ ఇంత అల్లరా? చెట్లమీద కోతులు, అడవిలోని కుందేళ్ళు, లేళ్ళు, జింకలు వీళ్ళ పరుగులు అల్లర్లు చూసి ఆశ్చర్యపోయి, అసలు మావో గంతులా...మావో ఆటలా అని తోకలు ముడిచాయని బీబీసీలో ఉగాండా దేశపు అధికారిక చానల్ లో చెప్తూంటే పాపం డొనాల్డ్ ట్రంప్ బాధపడ్డాడట....
వీళ్ళందరినీ ఒక్కచోట చేర్చి ఇంత ఆనందాన్ని అందించిన పద్మగారు అభినందనీయులు కదా...భీభత్సమైన అల్లరి చేస్తూ ఒక్కొక్కరూ బ్రష్ హాండ్స్ తో దొరికిపోయారు...బస్తాలకొద్దీ బహుమతులు కొట్టేసి ఊళ్ళకెళ్ళిపోయారు. మొత్తానికి సీనియర్ కార్టూనిస్ట్ పద్మ గారు కార్తీక మాసానికో కళ తెచ్చారు. అందరికీ గుర్తుండిపోయే నవ్వుల పండగ చేసారు...మనసారా నవ్వుకున్న సందర్భాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుందాం, గుర్తొచ్చిన ప్రతిసారి పద్మగారికి గోతెలుగు తరపునా మనందరి తరపునా, అభినందనలు తెలియజేస్తూనే ఉందాం...ఏమంటారు...ఎవరెవరు ఏమేం అల్లర్లు చేసారో, ఎన్నెన్ని బహుమతులు కొట్టేసారో ఈ క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి....కమాన్ స్టార్ట్....