బాధ్యత యువభారతానిదే.! - ..

Responsible youngers

అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21ఏళ్లు - ఇది పెళ్లి వయసు. శారీరకంగా మానసికంగా ధృడంగా ఉండేందుకు తద్వారా వైవాహిక జీవితాన్ని సజావుగా కొనసాగించేందుకు ఈ వయసును ప్రామాణికంగా భావిస్తున్నాం. 30 ఏళ్లు దాటేదాకా అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ పెళ్లి గురించి ఆలోచించడం లేదిప్పుడు. అందరూ కాదు కానీ, ఎక్కువ మంది ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. జీవితంలో స్థిరపడాలి, ఏదైనా సాధించాలి అన్న ఆలోచనే వారిని ఇలా నడిపిస్తోంది. మరి 18 ఏళ్లకే ఓటు హక్కు వచ్చేస్తే 5 ఏళ్లపాటు తమని పరిపాలించే ప్రజాప్రతినిధిని ఎన్నుకునేంత పరిపక్వత యువతలో వచ్చేస్తుందనుకోవాలా.? వస్తుంది. రావాలి కూడా. ఆ దిశగా అవగాహనా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. పుట్టిన బిడ్డ నుండి చివరి రోజుల్లో ఉన్న ముదుసలి వరకూ ప్రతీ ఒక్కరి పైనా ఎన్నికల ప్రభావం ఉంటుంది. ఈ విషయమై బాధ్యత తీసుకోవాల్సింది యువతరం.

ఎన్నికలొస్తున్నాయంటే యువతకు క్రికెట్‌ కిట్లు, ఇతరత్రా స్పోర్ట్స్‌ పరికరాలు, ఖరీదైన బహుమతులు ఇచ్చి మేనేజ్‌ చేసేద్దాం అనే ధోరణి రాజకీయ నాయకుల్లో కనిపిస్తోంది. పెద్దవాళ్లకైతే డబ్బులు, ఇతరత్రా ప్రలోభాలు యువతకు ఇంకోరకమైన తాయిలాలు.. చిత్రమేంటంటే భావి భారత పౌరులు ప్రలోభాలకు తలొగ్గుతున్నారు. అందరూ కాదు కానీ, చాలా వరకూ ఈ ప్రలోభాల పర్వం యువతరంపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఎన్నికలంటే, ఓట్ల పండక్కి ముందు డబ్బు ఖర్చుపెట్టడం, మళ్లీ ఓట్లు పండగొచ్చేదాకా డబ్బు వెనకేసుకోవడం అనే భావన రాజకీయ నాయకుల్లో పెరిగుతోంటే, యువతలో కూడా నిస్తేజం అలముకుంటోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. 
ఓటుపై చైతన్యం కోసం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడే దీనిపై చర్చ జరుగుతోంది కూడా. అవగాహన కార్యక్రమాల్లో ఎక్కువగా యువతే కనిపిస్తుంటారు.

10 కె రన్‌, హాఫ్‌ మారథాన్‌ ఇలా ఓటు హక్కు గురించి ఏ కార్యక్రమం జరిగినా అక్కడ యువత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ అలాంటి యువత ఎన్నికల్లో ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పెద్దగా ఆశక్తి చూపించడం లేదు. ప్రచారం కోసం పార్టీలకు యువత ఉపయోగపడుతోంది. మరి ఓట్లు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం వంటి విషయాల్లో మాత్రం యువత దూకుడు ప్రదర్శించడం లేదు. రేపటి భవిష్యత్తుకు నాంది ఈ రోజే పడాలి. అంటే నేటి యువతే రేపటికి దారి చూపాలి. రాజకీయాల్లో యువత పాత్రే అత్యంత కీలకం. కానీ ఆ యువత ప్రదర్శిస్తోంది అలసత్వం. ఆ అలసత్వం వీడితే భవిష్యత్‌ అవుతుంది అద్భుతం.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు