జ్యోతిష్యం - బన్ను

Jyotishyam

'జ్యోతిష్య శాస్త్రం' ని నమ్మాలా? వద్దా? అనే ప్రశ్న 'దేవుడున్నాడా - లేడా?' లాంటిది. ఎవరినమ్మకాలు వాళ్ళవే!

నేను 1997 లో రాజమండ్రిలో షేర్ కన్సల్టెన్సీ నడిపేవాడిని. ఇంజనీరింగ్ పూర్తి చేసుకొనొచ్చి ఉద్యోగానికెళ్ళకుండా వ్యాపారం మొదలుపెట్టాను. మొదట్లో బాగా నడిచినా ఆ వ్యాపారంలో నష్టాలు కూరుకొని అప్పుల పాలయ్యాను. "కష్టాల్లో మనకి గుర్తుకొచ్చేది దేవుడు తర్వాత జ్యోతిష్కుడు!" ఒక స్నేహితుడి సాయంతో ఓ జ్యోతిష్కుని వద్దకు వెళ్ళాను. ఆయన నా వివరాలు తీసుకొని ఏవో గీసి నా వంక చూశారు. నేను ఆసక్తిగా చూస్తున్నాను... ఏమి చెబుతారో అని..!

"బన్ను గారు ఈ మధ్యకాలం లో ఇంత మంచి జాతకం వేయలేదండీ... కానీ... మీకు రాహువులో రాహువు వున్నాడు. అన్నారు"

"అంటే... మంచిదా కాదా సార్"

"ఫుట్ బాల్ తన్నినట్టు తంతాడు. మీకు స్థాన చలనం తప్పదు. మీరు చాలా(ఉన్నదంతా) నష్టపోయారు. కానీ అదంతా మళ్ళీ "షేర్స్" లోనే వస్తుంది" అని చెప్పారు. నాకు పెద్ద నమ్మకం లేదు. ఆయనకో నూట పదహార్లిచ్చి వచ్చేశాను.

1998 లో రాజమండ్రి నుంచి హైదరాబాదొచ్చి ఇక్కడే స్థిరపడిపోయాను. వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు - చిన్న చిన్న ఉద్యోగాలు... అలా అలా 2005 కల్లా ఓ మంచి కంపెనీలో జాయిన్ అయ్యాను. మాకేవో 'స్టాక్ ఆప్షన్స్' అనిచ్చారు. అవేంటో తెలీక ఆ కాగితాన్ని మూలపడేశాను. 2007 కల్లా కంపెనీ షేర్ బాగా పెరిగింది. ఆ షేర్స్ అమ్మితే నిజంగానే నేను పోగొట్టుకున్న సొమ్ము తిరిగొచ్చింది.

ఆలోచిస్తుంటే అప్పుడాయన "నీకు పోయిన డబ్బు మళ్ళీ షేర్స్ లోనే వస్తుంది" అంటే నవ్వుకున్నానప్పుడు. ఎందుకంటే నేను తర్వాత షేర్లు కొనలేదు. ఐనా కొనటానికి డబ్బులే లేవప్పుడు. కానీ 'స్టాక్ ఆప్షన్స్' రూపంలో నాకు లభించిన సొమ్ము 'షేర్స్' నుండే!

'స్థానచలనం, షేర్స్ లో డబ్బు' రెండూ జరిగే సరికి... నాకు జాతకశాస్త్రం కరక్టేనా? అనే అనుమానం మిగిలిపోయింది!

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి