శ్రీహనుమద్వైభవం - .

Sri Hanumath Vaibhavam

అట్లాంటాలో కనులవిందుగా ‘శ్రీహనుమద్వైభవం’ నృత్యనాటిక

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటా మహానగరంలో సెప్టెంబరు 29న జార్జియా టెక్ లోని ఫెర్స్ట్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ లో దిగ్విజయంగా ప్రదర్శించబడిన ‘శ్రీహనుమద్వైభవం’ నృత్యనాటిక ప్రేక్షకులలకు కనువిందు చేసింది. హనుమాన్ మందిర్ (ఆల్ఫరెట్టా) నిధుల సేకరణ నిమిత్తం హనుమాన్ మందిర్ మరియు నటరాజ నృత్యాంజలి నాట్య అకాడమీ సమిష్టిగా కృషి చేసి సగౌరవంగా సమర్పించిన ఈ కార్యక్రమానికి వేయిమంది పైగా హాజరయ్యారు.

నటరాజ నృత్యాంజలి నాట్య అకాడమీ సంస్థాపకులు గురు శ్రీమతి నీలిమ గడ్డమణుగు వద్ద శిక్షణ పొందిన సుమారు 50 మంది చిన్నారులు ఈ నృత్యనాటికలోని వివిధ పాత్రలకు జీవం పోసి ఈ దృశ్యకావ్యాన్ని అత్యంతసుందరంగా ఆవిష్కరించారు. గురు శ్రీ దండిభొట్ల నారాయణమూర్తి ఈ నృత్యనాటికకు అతి చక్కటి గేయరచన చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీమతి మాలతి నాగభైరవ తమ వాక్చాతుర్యంతో కార్యక్రమం ఆద్యంతం ఎంతో రక్తి కట్టించారు. హనుమాన్ మందిర్ కార్యదర్శి శ్రీ రాము అరుణాచలం పరిచయవాక్యాలతో కార్యక్రమానికి శుభారంభం పలికారు. తదుపరి ముఖ్య అతిథి శ్రీ సుభాష్ రాజ్దాన్, హనుమాన్ మందిర్ సంస్థాపకులు శ్రీ శేషావతారం పురాణం, ఆలయం కార్యనిర్వాహకవర్గ అధ్యక్షులు శ్రీ రాకేష్ గర్గ్, గురు శ్రీమతి నీలిమ గడ్డమణుగు మరియు ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ పురాణం జ్యోతిప్రజ్వలన నిర్వహించారు.

డా.మాధవ్ దుర్భా సభికులకు గురు శ్రీమతి నీలిమ గడ్డమణుగును పరిచయం చేశారు. శ్రీ హనుమానులవారి పుట్టుకతో ప్రారంభమైన ఈ నాటిక శ్రీరామ పట్టాభిషేకంతో ముగిసింది. రెండుగంటల నిడివి ఉన్నా ‘ఈ నాటిక అప్పుడే ఐపోయిందా’ అనిపించేలా శ్రీ శివ గడ్డమణుగు దర్శకత్వం వహించారు. అత్యంత సుందరంగా మలచబడిన అశోకవనం, రసవత్తరంగా సాగిన రామరావణసంగ్రామం వంటి సన్నివేశాలు చూపరులను విశేషముగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు వారి శ్రద్ధ, భక్తి తత్పరతతో అందరి మన్ననలనూ అందుకున్నారు. ఈ నాటిక ప్రథాన పాత్రను కుమారి నవ్య నూతివాన ఎంతో చక్కగా పోషించింది. రామ లక్ష్మణ పాత్రధారులుగా మీను రెడ్డి, షాలిని వేమూరు ల అభినయం చూపరులను ఎంతో ఆకట్టుకొంది.

ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి తోడ్పడినవారందరికీ శ్రీ రాకేష్ గర్గ్ వారి కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి ముఖ్య అతిథి శ్రీ సుభాష్ రాజ్దాన్ అందరు వారి శక్తిమేరకు హనుమాన్ మందిర్ కు ఆర్ధిక సహకారాన్ని అందజేయవలసిందిగా అర్థించారు. ఎంతో అద్భుతముగా ఉన్న ఈ కార్యక్రమము నాలుగైదు మాసములలో ఇంకా పెద్ద ఆడిటోరియుం లో పునఃప్రదర్శన కావాలని అభిలషించారు. నృత్య ప్రదర్శనానంతరం హనుమాన్ మందిర్ పాలక వర్గం, గురు నీలిమ గారికి, చిన్నరులకు ఉచితసన్మానం నిర్వహించారు.
 


సాలెం అసోసియేట్స్, గరుడవేగా కొరియర్స్, యప్ టీవీ, క్యూబ్ ప్రింటర్స్, రామ్ డీజే, హరి లిముసీన్, saridhoti.com, వెంకట గడ్డం రియల్ ఎస్టేట్, ఎజైల్ ఐటీ యూఎస్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, advbackoffice.com, సెరెనిటీ ఇన్ఫోటెక్, బ్రాండ్ మార్ట్గేజ్, గోల్డెన్ లైన్ ఎల్ ఎల్ సి, అమ్మా కిచెన్, ఏ.వి.డెంటల్ కేర్, ఎవరెస్ట్ టెక్నాలజీస్, మెట్రో మెడికల్ అసోసియేట్స్, స్పైసెస్ హట్, తడ్కా/బేమ్బూ గార్డెన్, హాట్ బ్రెడ్స్, టీవీ ఏసియా, మరియు bytegraph.com లు ఈ కార్యక్రమానికి కార్పొరేట్ స్పాన్సర్స్ గా వ్యవహరించాయి.

శేషావతారం పురాణం, రాకేష్ గార్గ్, సుందర్ గార్గ్, రాము అరుణాచలం, శ్రీకాంత్ గణేష్, సచీపతి, అవనీష్ గుప్త, నీలిమ గడ్డమణుగు, రమేష్ ఖజ్జాయం, ఉమేష్ డికొండ,  సాయికుమార్ ముట్టుపూరి, శ్రీమాన్ పురాణం ల తో కూడిన హనుమాన్ మందిర్ పాలక వర్గం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, గుడి నిర్మాణానికి తోడ్పడిన అందరికీ తమ కృతజ్ఞతలను తెలియజేసుకొంది.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు