దోచేస్తున్నాయ్‌ మనసుల్నీ, జేబుల్నీ..! - ..

Do not want smart ideas

ఎర్రబటను, పచ్చ బటను.. రోజులు పోయాయ్‌. ఇప్పుడంతా స్మార్ట్‌. పల్లెల నుండీ, పట్నాల దాకా ఎక్కడ చూసినా స్మార్ట్‌ సందడే. వెయ్యి నుండీ లక్ష వరకూ స్మార్ట్‌ ఫోన్లు జనానికి అందుబాటులో ఉంటున్నాయి. లక్ష.. ఆ పైన కూడా స్మార్ట్‌ ఫోన్లు జనం మదిని దోచేస్తూనే ఉన్నాయి. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు వినియోగదారులు. ఎక్కువ మంది స్మార్ట్‌ పోన్‌ వినియోగదారులు యువత అని ఓ సర్వేలో తేలింది. పదేళ్ల వయసు నుండే స్మార్ట్‌ ఫోన్‌ని ఓ అవసరంగా మాత్రమే కాదు, స్టేటస్‌ సింబల్‌గా పిల్లలు కూడా భావవిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. కనీస అవసరాలను పక్కన పెట్టి మరీ స్మార్ట్‌గా అడుగులేయాలన్న తపన అందరిలోనూ కనిపిస్తోంది. అదే స్మార్ట్‌ వినియోగం పెరిగిపోవడానికి నాంది అవుతోంది.

ప్రతీరోజూ కుప్పలు తెప్పలుగా అత్యాధునిక సాంకేతికత గల స్మార్ట్‌ఫోన్లు పుట్టుకొస్తున్నాయ్‌. నిన్నటి టెక్నాలజీ రేపటికి అప్‌డేట్‌ అయిపోతోంది. మళ్లీ కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. ప్రతినెలా స్మార్ట్‌ ఫోన్‌ను మారుస్తున్న వారి సంఖ్య ఈ మధ్య గణనీయంగా పెరుగుతోందట. బై - బ్యాక్‌ ఆఫర్లు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు పెరిగిపోతున్నాయంటే దానికి కారణం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో విపరీతమైన వృద్ధే. ఏడాది కాలంలో ఒకే ఫోన్‌ మెయింటైన్‌ చేస్తున్న వారి సంఖ్య తగ్గుతోంటే, మూడు.. ఆ పైన వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. 'ఇంకా అప్‌డేట్‌ అవ్వవేంట్రా..' అంటూ సన్నిహితులు, స్నేహితులు దగ్గర నుండి వచ్చే వెటకారపు డైలాగ్‌ చాలా మందిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఓ అంచనా.

ఓ సంస్థ ఇటీవల ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తాము ఇచ్చే సాధారణ ఫోన్‌ మాత్రమే ఏడాది పాటు వినియోగించాలని, ఆ ఏడాదిలో ఎలాంటి స్మార్ట్‌ ఆలోచనలు చేయకూడదని షరతు విధిస్తూ పోటీలో నెగ్గితే లక్షల్లో ప్రైజ్‌ మనీ అని ప్రకటించింది. అంటే ఎవరు తమ ఛాలెంజ్‌ని స్వీకరించలేరన్న గట్టి నమ్మకం ఆ సంస్థకు ఉందన్న మాట. సెల్‌ఫోన్‌తో రేడియేషన్‌ వస్తుంది.. స్మార్ట్‌ ఫోన్ల వినియోగంతో సైబర్‌ క్రైమ్‌లు పెరిగిపోతున్నాయ్‌. వ్యక్తిగత సమాచారమ్‌ దోపిడీకి గురవుతోంది. బోలెడంత సొమ్ము వృధా అవుతోంది. పర్యావరణానికి చాలా హాని జరుగుతోంది. అయినా ఇవేమీ డోంట్‌కేర్‌. బీ స్మార్ట్‌ ఇదొక్కటే ప్రపంచాన్ని నడిపిస్తుందేమో.! 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు