ఈనెల 15 నుంచి ఎన్ టీ ఆర్ స్టేడియం లో ప్రారంభమైన బుక్ ఫెయిర్ కి ఎంతోమంది సందర్శకులు వచ్చి వెళుతున్నారు....కావలసినన్ని పుస్తకాలు కొనుక్కెళుతున్నారు....పుస్తకాలు కొనేవాళ్ళు తగ్గిపోతున్నారు, చదివేవాళ్ళు ఎవరున్నారు అనే వాదనలను పటాపంచలు చేస్తూ ఏటికేడు సందర్శకుల సంఖ్య, పుస్తకాలు కొనేవాళ్ళ సంఖ్య పెరుగుతూండడం పుస్తకప్రియులకూ, ప్రచురణకర్తలకూ, రచయిత(త్రు)లకూ సంతోషకరమయిన విషయమే. వాటిలో మనం చెప్పుకోవలసింది ప్రత్యేకంగా స్టాల్ నంబర్ 87 గురించి...అందులో ఏముందనుకుంటున్నారా? కావలసినన్ని నవ్వులున్నాయి...కార్టూన్ ఇష్టులు కోరుకునే కార్టూనిస్టులు కొలువై ఉన్నారు...ఇంతకంటే కావలసిందేముంది? కితకితలు పెట్టే అవసరం లేకుండా పుస్తకం తెరుస్తూనే నవ్వు తెప్పించే మన కార్టూనిస్టుల పుస్తకాలు అందమైన ముఖచిత్రాలతో అలరిస్తూ కొనమని ఉత్సాహపరుస్తున్నాయి...ఎవరెవరి పుస్తకాలో ప్రత్యేకంగా చెప్పాలా? " బుక్ హ్యాండెడ్ " గా ఇక్కడ దొరికిపోయారుగా మీరే చూడండి....అన్నట్టు హాస్యప్రియుల కోసమని స్పెషల్ డిస్కౌంట్లు కూడా ఇచ్చేస్తున్నారండోయ్.....ఇంతమంచి కార్టూన్ బుక్స్ ఒక్కచోట, ఒక్కసారే కొనే అవకాశం రావడం నిజంగా బంపరాఫరే....మరి హైద్రాబాద్ బుక్ ఫెయిర్ కి వెళ్ళి అన్నీ కొనేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా...!!
Hyderabad Book Fair లోని "ONLY CARTOONS" స్టాల్ లో Ms Ramakrishna Bachi Sarasi lepakshi Kamesh Padmadas
కార్టూన్ బుక్స్ లభిస్తాయి. ఈసారి ఎక్కువ డిస్కౌంటుకు అందజేస్తున్నాము.
Ms Ramakrishna:
RK Cartoons, వేమన పథ్యాల కార్టూన్లు.
Sarasi:
మనమీదోనర్రోయ్ కార్టూన్లు
నవ్వేడేస్ & సరసి కార్టూన్లు
Lepakshi:
నవ్వించే కార్టూన్లు
Bachi:
బాచి కార్టూన్లు 1 & 2
బాచీ తీన్మార్ కార్టూన్లు
Kamesh:
కామేష్ కార్టూన్లు 1 & 2
Padmadas:
దాస్ కార్టూన్లు 1 & 2
మరియు
ఆరుగురి కార్టూన్లతో
కా6టూనిస్టులు
తప్పక విచ్చేయండి.
Stall No.87
32nd Hyderabad Book Fair, NTR Stadium Indira Park Hyderabad
ఈ కార్టూనిస్టులు స్టాల్ కి మోసుకొచ్చిన కార్టూన్ పుస్తకాల్లో ఒక్కటీ మిగలకుండా అన్నీ అమ్ముడైపోవాలనీ, పుస్తకాలు తెచ్చిన సంచుల్లోనే నోట్ల కట్టలు మోసుకెళ్ళాలనీ కోరుకుందాం... అలాగే ఈ స్పూర్తితో, వచ్చే బుక్ ఫెయిర్ వరకు మరికొంతమంది కార్టూనిస్టులు ముందుకొచ్చి తమ కార్టూన్ సంకలనాలను కూడా అచ్చేసుకుని, కార్టూన్ ఇష్టులను మరింతగా అలరించాలని గోతెలుగు శుభాభినందనలు తెలియజేస్తోంది....