కొత్త సంవత్సరంలో యువతరం.! - ..

Youngest in the new year.

న్యూ ఇయర్‌ అంటే సెల్రబేషన్స్‌ మాత్రమే కాదు, కొన్ని రిజల్యూషన్స్‌ కూడా తీసుకుంటుంటారు. సిగరెట్‌ మానేయాలనుకోవడం, డ్రింకింగ్‌ మానేద్దామనుకోవడం.. లాంటి మరికొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకోవడానికి న్యూ ఇయర్‌ డేనే కీలకమైన రోజుగా ఎంచుకుంటుంటారు. అయితే ఇలాంటి చెడు అలవాట్లను మానేయడానికి మాత్రమే కాదు, కొన్ని మంచి మంచి నిర్ణయాలను తీసుకోవడానికి, దిశా నిర్ధేశకాలను ఎంచుకోవడానికి కూడా న్యూ ఇయర్‌ డేనే సరైన రోజుగా ఎంచుకుంటారు. అయితే ఎలాంటి నిర్ణయాలైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ న్యూ ఇయర్‌ డేనే ఎందుకు ఎంచుకుంటారంటే లైఫ్‌లో అదొక జ్ఞాపకంగా ఉండేందుకు. పాత సంవత్సరంలో ఎదుర్కొన్న బాధల్నీ, కష్టాల్నీ, అక్కడే వదిలిపెట్టి, న్యూ ఇయర్‌లో కొత్తగా లైఫ్‌ని స్టార్ట్‌ చేయాలనుకుంటారు. అందుకే కొన్ని కొత్త కొత్త నిర్ణయాల్ని తీసుకుంటుంటారు. 
ముఖ్యంగా యువత ఈ రకమైన రిజల్యూషన్స్‌ని ప్రధానంగా తీసుకుంటుంటారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌తో పాటు, రిజల్యూషన్స్‌ని కూడా నెల రోజుల ముందు నుండే ప్లాన్‌ చేసుకుంటారు. జనవరి 1 నుండి ఏ మంచి పనినైనా స్టార్ట్‌ చేయాలనే తపన, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయడంలో కూడా ఉండాలి నేటి యువతరానికి. ఏదో ఆ ఒక్క రోజుకే సంబంధించిన నిర్ణయంగానో లేక గోడ మీద జ్ఞాపకంగానో కాకుండా, ఆ ఒక్కరోజులో తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని మార్చేలా ఉండాలి.

భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉండాలి. నిజానికి కొత్త నిర్ణయాలకు, మంచి పనులకు ఏ రోజైనా మంచిదే. కానీ జనవరి 1నే ఎందుకు ఎంచుకుంటారంటే, ఆ రోజు మొదలుకొని, తిరిగి మళ్లీ కొత్త సంవత్సరం జనవరి 1 వచ్చేంత వరకూ తాము నిర్ధేశించుకున్న నిర్ణయాలు మర్చిపోకూడదనే. అయితే ఎంతమంది ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటున్నారు.? కొత్త సంవత్సరం వస్తుందని కేకులు కట్‌ చేయడం, పార్టీలు సెలబ్రేట్‌ చేసుకోవడంలాంటి ఆనందం పక్కన పెడితే మన జీవితంలో ఒక ఏడాది అప్పుడే కరిగిపోయిందా.? అని బాధపడేవారు కూడా లేకపోలేదు. అందుకే గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి తీసుకురాలేం. గడిచిన ఏడాదిలో మనం చేసిన తప్పుల్ని సమీక్షించుకుని, కొత్త ఏడాదిలో ఆ తప్పులు పునరావృతం కాకుండా బేరీజు వేసుకోవాలి. గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కాబట్టి, రాబోయే కొత్త సంవత్సరాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోగలం.? ఎన్ని మంచి లక్ష్యాల్ని అందుకోగలం. అనే వాటిపై పూర్తి ఫోకస్‌ పెట్టి కొత్త సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకోవాలి. ఎలాగైతే ఓ చెట్టు ఆకురాలు కాలంలో తన ఆకుల్ని రాల్చి, మళ్లీ కొత్త చిగురుల్నిస్తుందో, తద్వారా వచ్చే పువ్వులు, కాయలు ఎలాగైతే మానవాళికి ఉపయోగపడతాయో అలాగే తాము తీసుకున్న నిర్ణయాలు భవిష్యుత్తుకు దిశానిర్ధేశకాలు కావాలనీ, ఎన్నో సక్సెస్‌లు అందుకోవాలనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఆనందం విరజిమ్మాలని ఆశిస్తూ న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేద్దామా.!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు