యువతలో అత్యుత్సాహం - ...

The greatness of young people

2018కి గుడ్‌బై చెప్పేసి 2019కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేశాం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకోసం, ఆ ప్రత్యేక క్షణాల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసిన యువతరం డిశంబర్‌ 31 రాత్రంతా జాగారం చేసింది. జాగారం అంటే ఆధ్యాత్మిక చింతనతోనో, భవిష్యత్‌ పట్ల అంచనాలతోనో కాదు. 2018లో మిగిలిన కొద్ది గంటలు కొద్ది నిమిషాలు, కొద్ది సెకన్లు వీలైనంత ఎక్కువగా ఎంజాయ్‌ చేసేయాలనుకుంది నేటి యువతరం. యువతరమే కాదు, పెద్దలు, పిల్లలు చాలా వరకూ చేసిందిదే. ఈ క్రమంలో మధ్యం, మాంసాహారం విచ్చలవిడిగా హల్‌చల్‌ చేశాయి. డిశంబర్‌ 31న బీరు బాటిల్‌ దొరుకుతుంది. జనవరి 1న కూడా బీరు బాటిల్‌ దొరుకుతుంది. రోజూ దొరుకుతుంది. కానీ ఆ ప్రత్యేక ఆనంద క్షణాల కోసం మోతాదుకు మించి తాగేశారు.

తెలుగు రాష్ట్రాల్లో డిశంబర్‌ 31న రికార్డు స్థాయిలో మధ్యం అమ్మకాలు జరిగాయి. పల్లెటూళ్లు, పట్టణాలూ అన్న తేడా లేదిక్కడ. అంతటా మధ్యం, మాంసం వీటితో పాటు, కేకులు.. హంగామా ఇదే చర్చ, ఇదే రచ్చ అంతటా జరిగింది. అయితే అందరూ ఇలాగే ఎంజాయ్‌ చేశారనుకుంటే పొరపాటే. కొంతమంది భవిష్యత్‌ గురించి ఖచ్చితమైన లక్ష్యాల్ని నిర్ధేశించుకున్నారు. రాత్రంతా కూర్చొని ఆ లక్ష్యాల్ని డిజైన్‌ చేసుకున్నారు. పొద్దున్నే చర్చ్‌లకు, దేవాలయాలకు, మసీదులకు పరుగులు పెట్టి, తమ లక్ష్యాల్ని దేవుడి ముందుంచారు. లక్ష్య సాధనలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, ఒకవేళ సమస్యలెదురైనా వాటిని అధిగమించేందుకు తగిన ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. వీటితో పాటు కొందరు సామాజిక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఎంజాయ్‌మెంట్‌ కోసం చేసే ఖర్చును ఆపన్నుల కోసం వినియోగించేందుకు ప్రయత్నించారు.

మంచి, చెడూ మనుషిలోనే ఉంటాయి. ఏది ఎక్కువ డామినేట్‌ చేస్తే, దాన్ని బట్టి ఆ వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. డిశంబర్‌ 31న ఆఫీసుకు వెళ్లినట్లే, జనవరి 1న కూడా ఆఫీసుకు వెళ్లాలి. సగటు వ్యక్తికి ఏ రోజైనా ఒకటే. సెలబ్రేషన్‌ అనేది మధురానుభూతిగా ఉండిపోవాలనుకోవడం తప్పు కాదు. కానీ ఆ సెలబ్రేషన్‌ మితిమీరిపోయినప్పుడే సమస్యలొస్తాయి. గతంతో పోల్చితే ఈ సారి యువతలో అత్యుత్సాహం ఎంత పెరిగిందో ఆలోచన అంతకన్నా ఎక్కువే పెరిగింది. మధ్యం అమ్మకాలు రికార్డు సృష్టించినా యువత ఆలోచనలో సానుకూల మార్పు కూడా అంతే స్థాయిలో కనిపించిందనీ సోషల్‌ మీడియా వేదికగా జరిగిన పోల్స్‌ చెబుతున్నాయి. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెబుతూ యువత నుండి పోస్ట్‌ అయిన ట్వీట్స్‌ని విశ్లేషించిన మానసిక విశ్లేషకులు యువతలో ఈ మార్పు ఆహ్వానించదగ్గదేనని అభిప్రాయపడుతున్నారు. అలా తాగేసి, ఊగేసి పడిపోవడం ఒక్కటే కాదు, యవ్వనోత్సాహం కొత్త కొత్తగా సానుకూల ప్రపంచం వైపు పరుగులు పెడుతోందన్న మాట.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు