నా చేతుల మీదుగా విడుదలైన గోతెలుగు 300 సంచికలు పూర్తి చేసుకోవటం ఆనందం గా వుంది గో అనే అక్షరం లో ఆ మహత్యం వుంది.
- జె.కే . భారవి
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు
********
మొదటి సంచికలో నా ఇంటర్వ్యూను ప్రచురించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. గోతెలుగు పదికాలాల పాటు చల్లగా వుండాలని ఆశిస్తూ
- భాస్కరభట్ల
ప్రముఖ సినీ గేయ రచయిత
********
సాహిత్యం పట్ల బన్నుగారికి వున్నటువంటి ఇంట్రస్ట్, నిబద్ధతకి నా జోహార్లు
-చంద్రబోస్
ప్రముఖ సినీ గేయ రచయిత
********
చిన్నప్పుడు చందమామ చదువుతుంటే కమ్మని ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు గో తెలుగు చదువుతుంటే అదే ఫీలింగ్. గాసిప్స్ ,పిచ్చి రాతలులేని ఒక అమూల్యమైన కుటుంబ వార పత్రిక .
-రఘు కుంచె
ప్రముఖ గాయకుడు , సంగీతదర్శకుడు
********
గోతెలుగంటే నాకెందుకిష్టమంటే, స్వచ్చమైన తెలుగు వెబ్ వారపత్రిక కావడం. నేను స్టూడెంట్ గా వున్నప్పుడు మాగజైన్స్ కోసం ఎలా ఎదురుచూసేవాణ్ణో అలాగే ఇప్పుడు గోతెలుగు కోసం ప్రతీ శుక్రవారం ఎదురుచూస్తాను. అందులో వుండే చిత్రసమీక్ష కోసం, మంచి మంచి వ్యాసాలు, కథలు, కార్టూన్ల కోసం , గోతెలుగు లో వేసే కార్టూన్లు చాలా ఫన్నీ గా వుంటాయి. ... సో ఐ లవ్ గోతెలుగు అండ్ ఐ విష్ మెనీ మోర్ సక్సెస్స్ ఫుల్ ఇయర్స్ ఫర్ గోతెలుగు. ఇలాగే ఇంకెన్నో వందల సంచికలు వెలువడాలని కోరుకుంటూ బన్నుగారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
- మధుర శ్రీధర్
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు