సరిగ్గా దాచుకోకపోతే 'స్మార్ట్‌'గా దోచేస్తారు.! - ..

Smartly loses

టెక్నాలజీని రెండు వైపులా పదునున్న కత్తితో పోల్చుతారు చాలా మంది. అది ముమ్మాటికీ నిజం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, కత్తి పదునుకు ప్రాణాలు పోతాయి. స్మార్ట్‌ ఫోన్లు కూడా అంతే. ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే నిలువునా ముంచేస్తాయి. అదేంటీ స్మార్ట్‌ ఫోన్‌ ప్రాణాలు తీసేయడమేంటీ.? నిలువునా ముంచేయడమేంటీ.? అనుకుంటున్నారా.! అసలు విషయంలోకి వెళ్దాం పదండి. స్మార్ట్‌ ఫోన్‌ అంటే ఎర్రబటన్‌, పచ్చ బటన్‌ మాత్రమే కాదు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ అంటే, అందులో మన పూర్తి సమాచారమ్‌ నిక్షిప్తమై ఉంటుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోకెట్‌లో కార్డ్‌ రూపంలో కాకుండా, మొబైల్‌ ఫోన్‌లో భద్రపరచుకుంటున్న రోజులివి. చెక్‌లు, ఏటీఎమ్‌ కార్డ్‌లతో పనుండట్లేదు. అంతా ఆన్‌లైన్‌. ఫోటోలు మేన్యువల్‌గా భద్రపరచుకోవడం మానేశాం. డిజిటల్‌ ఫార్మేట్‌లోనే ఉంటున్నాయవి. ఇలా ఒక్కటేమిటి.. అంతా మొబైల్‌లోనే. ఎంత స్మార్ట్‌ అయిపోయామో, అంత నెగ్లిజన్స్‌ కూడా పెరిగిపోతోంది.

చిన్న నిర్లక్ష్యానికే జీవితాలు తారుమారైపోతున్న రోజులివి.  ఫోన్‌ ఛార్జింగ్‌ అయిపోయింది కదా అని తెలియని చోట ఛార్జింగ్‌ పాయింట్‌ ఉపయోగిస్తే, మీ ఫోన్‌లోని విలువైన సమాచారమంతా మాయమైపోవచ్చు. అలా తస్కరించబడిన సమాచారమ్‌ మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయొచ్చు. స్కిమ్మర్స్‌, స్కామర్స్‌ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. రోజుకో కొత్త మాయ స్టార్ట్‌గా వెలుగు చూస్తుంటే, వినే వాళ్లకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. నా ఫోన్‌లో హై సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉన్నాయని ఎవరైనా విర్రవీగితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఒక్కసారి ఇంటర్నెట్‌కి కనెక్ట్‌ అయ్యాక, అందులోని సమాచారమ్‌ ఎవరైనా, ఎప్పుడైనా, ఎలాగైనా కొట్టేయడానికి అవకాశం ఉన్నట్లే. ఒక నేరం బయటపడి దానికి అడ్డు కట్ట వేసేందుకు ఓ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఆ వెంటనే మరో కొత్త తరహా నేరం స్మార్ట్‌గా బయటపడుతున్న రోజులివి. అందుకే వ్యక్తిగత సమాచారమ్‌ విషయంలో ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. 
సైబర్‌ నేరాల క్రమాన్ని పరిశీలిస్తే, అత్యధికం ఆర్ధిక నేరాలే ఉంటున్నాయి. వ్యక్తిగత ఫోటోలు లీకవ్వడం ఆ తర్వాత స్థానంలో ఉంటోంది. డెస్క్‌ టాప్‌ కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌ల వాడకం తగ్గుతూ మొబైల్‌ ఫోన్ల వాడకం పెరుగుతూ ఉండడంతో ఈ స్మార్ట్‌ నేరాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కోసం డివైజెస్‌ ఉపయోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ మొబైల్‌ ఇంకొకరి చేతికి అందకుండా జాగ్రతపడాలి. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా మీ సెక్యూర్డ్‌ ప్రొవైడర్‌దే ఎంపిక చేసుకోండి. కంప్యూటర్‌లోనూ, మొబైల్‌లోనూ నాణ్యమైన సెక్యూరిటీ ఫీచర్స్‌ తప్పనిసరి. వీటన్నింటికీ మించి అప్రమత్తత చాలా చాలా ముఖ్యం.  

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు